వైభవంగా గంధోత్సవం | grand celebrations in dargah YSR district | Sakshi
Sakshi News home page

వైభవంగా గంధోత్సవం

Published Fri, Jan 3 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM

grand celebrations in dargah YSR district

 కడప నగరంలోని పెద్దదర్గాలో గురువారం పదవ పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా మహమ్మద్ మహమ్మదుల్ అమీన్‌పీర్ సాహెబ్ చిష్ఠివుల్ ఖాద్రీ ఉరుసు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
 
 దేశం నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు  దర్గాలోని హజరత్ అమీన్‌పీర్ సాహెబ్ మజార్‌ను దర్శించుకుని పూల చాదర్ సమర్పించి ప్రార్థనలు నిర్వహించారు. వందలాది మంది భక్తులు ప్రస్తుత పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. అర్ధరాత్రి అనంతరం ప్రస్తుత పీఠాధిపతి హజరత్ అమీన్‌పీర్ సాహెబ్ మజార్ వద్దకు గంధ కలశాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఫాతెహా నిర్వహించి భక్తులకు అందజేశారు. దర్గాలో ఏర్పాటు చేసిన తోట సెట్టింగ్ విశేషంగా భక్తులను ఆకట్టుకుంది. సినీ నటుడు రాజ్‌కుమార్, టీవీ సీరియళ్ల సంగీత దర్శకుడు, నంది అవార్డు గ్రహీత ఖుద్దూస్ దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. శుక్రవారం ఉరుసు సందర్బంగా షాహిన్ ఖవ్వాలీ కార్యక్రమం నిర్వహించనున్నారు.    
 - న్యూస్‌లైన్, కడప కల్చరల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement