ఏలూరు : పోలవరం కుడి ప్రధాన కాలువ తవ్వకాల్లో వచ్చిన గ్రావెల్‌ను టీడీపీ నాయకులు అక్రమంగా రవాణా చేస్తూ జేబులు నింపుకుంటున్నారని పంగిడిగూడెం సర్పంచ్ లావూరి చిన్న వెంకన్న కలెక్టర్ కె.భాస్కర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో యంత్రాంగంలో కదలిక వచ్చి ంది. పోలవరం కాలువ గట్టు తవ్వకాలపై శనివారం ‘పోలవరం గట్టు వదిలితే ఒట్టు’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. అక్రమంగా గ్రావెల్‌ను రవాణా చేస్తున్నారనిచిన్న వెంకన్న జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
దీంతో క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ అధికారులతో పాటు, మండల రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి వె ళ్లి విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. దీంతో గ్రావెల్ అక్రమ రవాణాను దగ్గరుండి చేపట్టిన ద్వారకాతిరుమల మండల టీడీపీ అధ్యక్షుడు, ఎంపీపీ వడ్లమూడి ఈశ్వర భానువర ప్రసాద్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. భీమడోలు మండలం పోలసానిపల్లి రెవెన్యూ పరిధిలో కాలువ గట్టును రాత్రి వేళల్లో తవ్వుతున్నారు. ఎంపీపీ ఈశ్వర భానువరప్రసాద్ ఆ ప్రాంతానికి పక్కనే ఉన్న పంగిడిగూడెంకు చెందినవారు. ఆయన దగ్గరుండి తవ్వకాలు సాగిస్తుండగా గ్రామ సర్పంచ్ లావూరి చిన్న వెంకన్న అడ్డుకునేందుకు యత్నించారు.
దీంతో ఎంపీపీ ఆయనతో వాగ్వివాదానికి దిగారు. అక్రమ తవ్వకాలపై సర్పంచ్ కలెక్టర్‌తో పాటు ఇరిగేషన్ ఈఈ, తహసిల్దార్, ఎంపీడీవోలకు కూడా ఫిర్యాదు చేశారు. ద్వారకాతిరుమల ఆర్‌ఐ టి.నాగరాజు, పంగిడిగూడెం వీఆర్‌వో పి.ప్రభాకరరావు సర్వేయర్ ఎం.ధ ర్మారావు పోలీసులతో ఘటనాస్థలానికి వెళ్లి పూర్తిస్థాయి విచారణ నిర్వహించి తహసిల్దార్ సీహెచ్ ప్రసాద్‌కు నివేదిక ఇచ్చారు. దీనిపై పూర్తి సమాచారాన్ని ఆయన ఏలూరు ఆర్డీవో తేజ్‌భరత్‌కు పంపారు. నివేదికలో భారీఎత్తున గ్రావెల్‌ను తరలించినట్టు అధికారులు ధ్రువీకరించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు కూడా తాను గ్రావెల్ త రలింపునకు ఎటువంటి లేఖ ఇవ్వలేదని అధికారులకు చెప్పినట్టు సమాచారం. మరోవైపు ఇరిగేషన్ డీఈ బాలకృష్ణ కూడా గ్రావెల్ తవ్వకాలపై విచారణ చేసి నివేదిక ఇచ్చారు. అధికార పార్టీ నేత కావడంతో ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
తవ్వకాలు వాస్తవమే
పంగిడిగూడెం గ్రామ శివారులో గ్రావెల్ అక్రమ రవాణా జరగటం వాస్తమమని మా అధికారులు నివేదిక ఇచ్చారు. దీనిపై ఇరిగేషన్ అధికారులకు కూడా లేఖ పంపించా. కలెక్టర్ కె.భాస్కర్‌తో పాటు ఆర్డీవో తేజ్ భరత్‌కు నివేదిక ఇస్తాం.
- సీహెచ్.ప్రసాద్, తహసిల్దార్,
ద్వారకాతిరుమల
డీఈ విచారణ చేస్తున్నారు
పోలవరం కాలువ తవ్వకాలలో భాగంగా గట్టు వెంబడి పెట్టిన గ్రావెల్ ద్వారకాతిరుమల ఎంపీపీ తరలించుకుపోతున్న విషయంపై డెప్యూటీ ఇంజినీర్ బాలకృష్ణను విచారణ చేసి నివేదిక ఇవ్వమని ఆదేశించాం. నివేదిక రాగానే కలె క్టర్‌కు పంపుతాం.
- చినబాబు, ఇరిగేషన్ ఈఈ
గ్రావెల్ రవాణాపై కలెక్టర్‌కు ఫిర్యాదు
Published Mon, Oct 13 2014 1:17 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement