సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈనెల 15వ తేదీ వరకు పొడిగించింది. గత కొద్ది రోజులుగా ఏపీపీఎస్సీ వెబ్‌సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో గ్రూప్-2 ఉద్యోగాలకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేయాల్సిన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రూప్-2కు ఏడు లక్షలకు పైగా దరఖాస్తులు రావచ్చని ఏపీపీఎస్సీ అంచనా వేయగా రెండు రోజుల క్రితం వరకు కేవలం 2.5 లక్షల దరఖాస్తులు మాత్రమే అప్‌లోడ్ అయ్యాయి. వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అప్‌లోడింగ్‌లో సమస్యలతోపాటు గ్రూప్-2 దరఖాస్తుల స్వీకరణలో కూడా ఇబ్బందులు తలెత్తాయి. నోటిఫికేషన్లు వెలువడుతున్న సమయంలో ఒక్కసారిగా ఓటీపీఆర్‌ల నమోదు పెరగడంతో ఏపీపీఎస్సీ సర్వర్‌పై లోడ్ పెరిగి సాంకేతిక సమస్యలు ఏర్పడ్డారుు. ఓటీపీఆర్ అప్లికేషన్లోనూ మార్పులు చేశారు.
సమస్యలు కొంత తీరినా వెబ్‌సైట్ మాత్రం ఇంకా పూర్తిస్థారుులో అభ్యర్థులకు అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో గురువారం ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్, కార్యదర్శి వైవీఎస్‌టీ సారుు ఏపీ ఆన్‌లైన్ ప్రతినిధులతో మరోసారి సమీక్షించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సమర్పణలో మరికొన్ని మార్పులు చేశారు. వెబ్‌సైట్ కొంతవరకు మెరుగుపడినా గ్రూప్-2 దరఖాస్తు గడువు ఈనెల 10వ తేదీతోనే ముగుస్తుండడంతో అభ్యర్థులంతా దరఖాస్తు చేయడానికి సమయం సరిపోదని భావించారు. గురువారం వరకు 4 లక్షల దరఖాస్తులు అప్‌లోడ్ అయ్యాయి. ఓటీపీఆర్‌ల సంఖ్య 6 లక్షలకు చేరుకుంది. కాగా గడువును ఈనెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు.
నెగిటివ్ మార్కులు లేవు: ఉదయభాస్కర్
ఇలా ఉండగా ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఆబ్జెక్టివ్ తరహా పోటీ పరీక్షలకు నెగిటివ్ మార్కుల విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అరుుతే ఇది రానున్న నోటిఫికేషన్లకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే వెలువరించిన గ్రూప్-2కు గానీ, అంతకు ముందరి నోటిఫికేషన్లకు కానీ వర్తించదని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ ‘సాక్షి’కి వివరించారు. నెలాఖరులోగా గ్రూప్-3, గ్రూప్-1 నోటిఫికేషన్లు వెలువరిస్తామని, వీటిలోని ఆబ్జెక్టివ్ పరీక్షలకు నెగిటివ్ మార్కుల విధానం వర్తిస్తుందని స్పష్టం చేశారు.
15 వరకు గ్రూప్-2 దరఖాస్తు గడువు పెంపు
Published Fri, Dec 9 2016 3:29 AM | Last Updated on Thu, Mar 28 2019 5:39 PM
Advertisement
Advertisement