సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: ఇస్రో ప్రయోగించిన అత్యాధునిక సమాచార ఉపగ్రహం జీశాట్-14 మూడో విడత కక్ష్య పొడిగింపు ప్రక్రియ గురువారం విజయవంతంగా పూర్తయింది. ఉపగ్రహంలోని ఇంజిన్లను ఉదయం 9.18 నుంచి 11.30 గంటల మధ్య 172 సెకన్లపాటు మండించి దానిని భూమికి దగ్గరగా 35,462 కి.మీ (పెరిజీ), భూమికి దూరంగా 35,741 కి.మీ (అపొజీ) నిర్ణీత వృత్తాకార భూస్థిర కక్ష్యలోని చేర్చినట్లు ఇస్రో అధికారులు తెలిపారు.