జీఎస్‌ఎల్వీ డీ6 ప్రయోగానికి రంగం సిద్ధం | gslv-d6 experiment on august 27 | Sakshi
Sakshi News home page

జీఎస్‌ఎల్వీ డీ6 ప్రయోగానికి రంగం సిద్ధం

Published Wed, Aug 19 2015 2:29 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

gslv-d6 experiment on august 27

నెల్లూరు: సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 27న రోదసిలోకి పంపనున్న జీశాట్-6 ఉపగ్రహ ప్రయోగానికి బుధవారం మొదటి అడుగు పడింది. జీఎస్‌ఎల్‌వీ డీ6 ఉపగ్రహ వాహక నౌకను రాకెట్ అనుసంధాన భవనం నుంచి ప్రయోగ వేదికకు అనుసంధానం చేశారు. 24న ప్రయోగ సన్నాహాలు చేయనున్నారు. 26 వ తేదీ మధ్యాహ్నం 11.52 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. 27వ తేదీ సాయంత్రం 4.52 గంటలకు రోదసీలోకి ప్రయోగించనున్నారు. జీఎస్‌ఎల్‌వీ డీ6 రాకెట్ ద్వారా 2,200 కిలోల బరువు గల జీశాట్-6ను రోదసిలోకి పంపనున్నారు. దీని ద్వారా డిజిటల్ మల్టీమీడియాలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఇస్రో తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement