GSLV D6
-
నాటీబోయ్.. దారిలోకి వచ్చాడు!
భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయాలను లిఖిస్తూ జీఎస్ఎల్వీ డి-6 ప్రయోగం విజయవంతం అయ్యింది. ఇప్పటివరకు 'నాటీబోయ్'గా అంతరిక్ష శాస్త్రవేత్తలు ముద్దుగా పిలుచుకునే జీఎస్ఎల్వీ.. చాలా రోజుల తర్వాత నేరుగా విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అంతులేదు. ఇదే విషయాన్ని మిషన్ డైరెక్టర్ ఉమామహేశ్వరన్ కూడా ప్రయోగం విజయవంతం అయిన తర్వాత శాస్త్రవేత్తలను అభినందిస్తూ చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. తమ నాటీబోయ్ ఇప్పుడు బాగా క్రమశిక్షణ గల అబ్బాయిలా మారిపోయాడని, తమను అస్సలు ఇబ్బంది పెట్టకుండా మంచి విజయం సాధించాడని ఆయన అన్నారు. దీనికి ముందు చేసిన జీఎస్ఎల్వీ డి-5 ప్రయోగం జరగడానికి సుమారు పావుగంట ముందు ఇంధనం లీకవుతున్నట్లు గుర్తించడంతో అప్పటికప్పుడు దాన్ని ఆపేసి.. తర్వాత మళ్లీ ప్రయోగించగా అప్పుడు విజయవంతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్ ఇంజన్‌తో కూడిన ఈ 'నాటీబోయ్' విజయం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. Another day & another phenomenal accomplishment by our scientists. Congratulations @isro for the successful launch of GSAT-6. — Narendra Modi (@narendramodi) August 27, 2015 Congratulations to #ISRO team for successfully launching communications satellite #GSLV-D6.Another feather in the Indian space agency's hat. — Prakash Javadekar (@PrakashJavdekar) August 27, 2015 Congratulations to @isro for the successful launch of #GSLV-D6 / #gsat6 https://t.co/wYLWlvWxSt — Rajiv Pratap Rudy (@RajivPratapRudy) August 27, 2015 -
జీఎస్ఎల్వీ డీ6 ప్రయోగానికి రంగం సిద్ధం
నెల్లూరు: సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 27న రోదసిలోకి పంపనున్న జీశాట్-6 ఉపగ్రహ ప్రయోగానికి బుధవారం మొదటి అడుగు పడింది. జీఎస్ఎల్వీ డీ6 ఉపగ్రహ వాహక నౌకను రాకెట్ అనుసంధాన భవనం నుంచి ప్రయోగ వేదికకు అనుసంధానం చేశారు. 24న ప్రయోగ సన్నాహాలు చేయనున్నారు. 26 వ తేదీ మధ్యాహ్నం 11.52 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. 27వ తేదీ సాయంత్రం 4.52 గంటలకు రోదసీలోకి ప్రయోగించనున్నారు. జీఎస్ఎల్వీ డీ6 రాకెట్ ద్వారా 2,200 కిలోల బరువు గల జీశాట్-6ను రోదసిలోకి పంపనున్నారు. దీని ద్వారా డిజిటల్ మల్టీమీడియాలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఇస్రో తెలిపింది. -
27న జీఎస్ఎల్వీ డీ-6 ప్రయోగం
శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. పిఎస్ఎల్వి ప్రయోగించిన నెల వ్యవధిలోనే జిఎస్ఎల్వి ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈనెల 27న జీఎస్ఎల్వీడీ-6 రాకెట్ ప్రయోగాన్ని చేయనున్నట్లు షార్ డైరక్టర్ పీ. కున్హికృష్ణన్ తెలిపారు. శనివారం ఆయన నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ కేంద్రంలోని కల్పనా అథితి గృహంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 27న జీఎస్ఎల్వీడీ-6 రాకెట్ ద్వారా 2176 కిలోల బరువు కలిగిన జీశాట్-6 అనే ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామని చెప్పారు. ఈ ప్రయోగం ద్వారా కమ్యూనికేషన్ రంగానికి చెందిన జి షాట్-6 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. సెప్టెంబర్ 29న పీఎస్ఎల్వీ సీ-30 ద్వారా ఆస్త్రోశాట్ అనే ఉపగ్రహాంతో పాటు మరో ఆరు విదేశీ ఉపగ్రహాలను పంపనున్నట్టు తెలిపారు. ఈ ఏడాది ఆఖరునాటికి పీఎస్ఎల్వీ సీ-29 ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన ఆరు ఉపగ్రహాలను ప్రయోగించనున్నామన్నారు. అదేవిధంగా త్రివేండ్రంలోని విక్రమ్‌సారాబాయ్ స్పేస్ సెంటర్లో తయారు చేస్తున్న ఎక్స్ ఎల్ స్ట్రాపాన్ బూస్టర్లు తయారు చేసే యూనిట్‌ను షార్‌లోనే ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. అనంతరం షార్‌లో మూడుకోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా పరిషత్ హైస్కూల్ భవనాలను ఆయన ప్రారంభించారు. -
ఆగస్టు చివరివారంలో జీఎస్ఎల్వీ డీ6 ప్రయోగం?
సూళ్లూరుపేట: సమాచార రంగంలో మరింత విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జీఎస్ఎల్వీ డీ6 ఉపగ్రహ వాహకనౌక ద్వారా జీశాట్-6 సమాచార ఉపగ్రహాన్ని ఆగస్టు చివరివారంలో ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక అనుసంధాన భవనంలో జీఎస్ఎల్వీ రాకెట్ అనుసంధాన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 2,200 కిలోలు బరువు కలిగిన జీశాట్-6 ఉపగ్రహం ఈ నెల 9న బెంగళూరు నుంచి శ్రీహరికోటకు చేరుకుంది. ఆగస్టు 30న ఈ ప్రయోగం చేపట్టాలనే లక్ష్యంతో ఇస్రో శాస్త్రవేత్తలు పనులు ముమ్మరంగా చేస్తున్నారు. డిజిటల్ మల్టీమీడియా, మల్టీమీడియా మొబైల్ ఫోన్స్‌లో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది.