‘వేధింపుల కేసుల్లో’వేరే కోణం! | harassment cases investigation as different angle | Sakshi
Sakshi News home page

‘వేధింపుల కేసుల్లో’వేరే కోణం!

Published Sun, Jan 26 2014 11:20 PM | Last Updated on Wed, Sep 26 2018 6:09 PM

harassment cases investigation  as different angle

వేరు కుంపటి కోసం వేధింపుల పేరు...
 వరకట్న వేధింపుల కేసు పేరు చెప్తే చాలు పెళ్లైన మగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. భార్య ఫిర్యాదు చేస్తే చాలు... తనతో పాటు తల్లిదండ్రులు, తోడపుట్టిన వాళ్లు కూడా కటకటాల్లోకి వెళ్లాల్సి వస్తుందని పలువురు భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది నలిగిపోతున్నారని పోలీసులే అంటున్నారు.ఎగువ మధ్య తరగతి కుటుం బాల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో అనేకం బోగస్‌వి ఉంటున్నాయంటున్నారు.

అత్తమామలతో కలి సి ఉండటం ఇష్టం లేక, వేరే కాపురం కావాలం టూ పలువురు తమను ఆశ్రయిస్తున్నారని సీసీఎస్ అధికారులు చెప్తున్నారు. ఫిర్యాదులో మాత్రం వరకట్న వేధింపులని పేర్కొంటున్న వివాహితలు కౌన్సిలింగ్ వద్దకు వచ్చేసరికి భర్త వేరు కాపురం వస్తే చాలంటున్నారని తెలిపారు.

 ‘అమ్మతో పోల్చిచూడటంతో’  అనేక అపార్థాలు...
 ప్రస్తుతం సమాజంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు కావడం అనివార్యంగా మారింది. ఉద్యోగానికి వెళ్తుండంతో భార్యకు కొన్ని దైనందిన కార్యక్రమాలు నిర్వహించడం కష్టంగా మారుతోంది. ఇక్కడే సదరు భర్తల అహం దెబ్బ తింటోందని అధికారులంటున్నారు. తన తల్లి తమ విషయం లో కనబరిచిన శ్రద్ధను భార్య తనతో పాటు పిల్లలపైనా చూపడంలేదన్న భావన భర్తల్లో కలిగి స్పర్థలకు కారణమవుతోందంటున్నారు.

నాటి-నేటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, జీవన ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటే ఇబ్బందే ఉండదని.. అయితే ఆ కోణంలో ఆలోచించే భర్త లు తక్కువగా ఉంటున్నారంటున్నారు. ఈ అపార్థంతో మొదలయ్యే స్పర్థలు వేధింపుల కేసుల వర కు వెళ్తున్నాయి. ఓ మహిళకు రక్షణ కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ‘498-ఏ’ సెక్షన్‌ను దుర్వినియోగం చేయడం వల్ల అత్త, ఆడపడుచు, మరిది ... ఇలా మరికొందరు మహిళలు సామాజికంగా, చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్పష్టం చేస్తున్నారు. వ్యక్తిగత కారణాల నేపథ్యంలోనే అనేక మంది భర్తతో పాటు ఆయన కుటుంబీకులపైనా... ఒక్కోసారి భర్తను వదిలేసి కుటుంబీకులపై కట్న వేధింపుల ఫిర్యాదులు చేస్తున్నారని సీసీఎస్ పోలీసులు చెప్తున్నారు.
 
 స నగరానికి చెందిన ఓ వివాహిత తన ఆడపడుచు కుమార్తె (రెండు నెలలు) తరచు ఏడుస్తుండటంతో తనకు మానసిక వేధింపులు ఎదురవుతున్నాయంటూ ఫిర్యాదు చేశారు.

 స కెనడాలో ఉండే ఆడపడుచు తరచూ తన భర్తకు ఫోన్ చేస్తోందని,  ఫోన్‌లో మాట్లాడిన తర్వాత భర్త తనపై చేయి చేసుకుంటున్నాడని మరో గృహిణి ఫిర్యాదు చేసింది. విదేశంలో ఉంటున్న ఆడపడుచుతో పాటు భర్త నిందితులుగా పేర్కొంది.

 స ఉద్యోగస్తులైన ఓ జంట మనస్పర్థల కారణంగా విడిపోవాలనుకుంది.  కొన్నాళ్ల క్రితం పరస్పరం ‘ఎస్సెమ్మెస్‌లు’ ఇచ్చుకొని విడిపోయి.. ఎవరికి వారు జీవిస్తున్నారు. తనకు చెందిన ఓ నగ ‘మాజీ భర్త’ వద్ద ఉందని భావించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 స ఈ ముగ్గురు మహిళలను మించి మరో వివాహిత ఇంకో చిత్రమైన ఫిర్యాదు చేసిం ది. తనను ఇంట్లో వారితో పాటు పక్కింట్లో ఉండే వృద్ధుడూ వేధిస్తున్నాడని ఆరోపిం చింది. అతడిపై కేసు ఎలా నమోదు చేస్తామని పోలీసులు అడగ్గా..  ‘చనిపోయిన మా మామగారు దెయ్యమై పక్కింటాయన్ని ఆవహించి వేధిస్తున్నాడు’.. అని అంది.

 స నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని మహిళా ఠాణా అధికారులకు ఇటీవల అందిన ఈ ఫిర్యాదులు వారి దిమ్మ తిరి గేలా చేశాయి.  498-ఏగా పిలిచే వరకట్న వేధింపుల కేసుల్లో వేరే కోణాన్ని ఆవిష్కరించడానికి ఈ ఉదాహరణలు చాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement