మచిలీపట్నం: కృష్ణా జిల్లా అవనిగడ్డ ఉప ఎన్నికలో టిడిపి అభ్యర్థి శ్రీహరి ప్రసాద్ (హరిబాబు) విజయం సాధించారు. సమీప స్వతంత్ర అభ్యర్థిపై 61,664వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు.
అవనిగడ్డ శాసనసభకు బుధవారం జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మచిలీపట్నంలోని హిందూకళాశాలలో ఈరోజు జరిగింది. అవనిగడ్డ శాసన సభ్యుడు అంబటి బ్రాహ్మణయ్య మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. బ్రాహ్మణయ్య కుమారుడు హరిబాబుకే టిడిపి టిక్కెట్ ఇచ్చింది. బ్రాహ్మణయ్యపై గౌరవంతో ప్రధాన పార్టీలు ఏవీ ఆయన కుమారుపై పోటీ చేయలేదు. దీంతో హరిబాబు అభ్యర్థిత్వం ఏకగ్రీవం అవ్వవలసి ఉంది. అయితే ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు రంగంలో ఉండటంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది.
అవనిగడ్డలో హరిబాబు విజయం
Published Sat, Aug 24 2013 12:42 PM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM
Advertisement
Advertisement