అవనిగడ్డలో పోలింగ్ ప్రారంభం | Polling start in Avanigadda | Sakshi
Sakshi News home page

అవనిగడ్డలో పోలింగ్ ప్రారంభం

Published Wed, Aug 21 2013 8:28 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

Polling start in Avanigadda

అవనిగడ్డ: కృష్ణా జిల్లా అవనిగడ్డ శాసనసభ స్థానంలో ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్ధులు ఉన్నారు. 241 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది.  టిడిపి ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మృతి చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ టిడిపి  అభ్యర్థిగా  బ్రాహ్మణయ్య కుమారుడు శ్రీహరిప్రసాద్(హరిబాబు) పోటీ చేస్తున్నారు.  హరిబాబును ఏకగ్రీవంగా గెలిపించుకునేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఉప ఎన్నికను పురస్కరించుకుని అవనిగడ్డ నియోజకవర్గంలోని పాఠశాలలకు నిన్న, ఈరోజు  జిల్లా కలెక్టర్ బుద్దప్రకాష్ ఎం.జ్యోతి సెలవు ప్రకటించారు.  షాపుల్లో పనిచేసే కార్మికులకు కూడా ఈరోజు సెలవు  ప్రకటించారు.  ఈ నెల  24న మచిలీపట్నంలోని  హిందూ కళాశాలలో  ఓట్ల లెక్కింపు జరుగుతుంది.  ఆ రోజున కళాశాలకు, పాఠశాలకు సెలవు ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement