ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్
=జిల్లాలో గుర్తించిన ఖాళీలు 725
=టెట్‌కు హాజరుకానున్న 24వేల మంది అభ్యర్థులు
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేయాలని విద్యాశాఖ నిర్ణయించడంతో అభ్యర్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంతకంటే ముందే ఈనెల 22 లేదా 29 తేదీల్లో టెట్(టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది.
దీంతో ఇప్పటికే టెట్‌కు దరఖాస్తు చేసి నిరీక్షిస్తున్న అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా లో మొత్తం 24,530 మంది అభ్యర్థులు టెట్ రాయనున్నారు. ఇందులో పేపర్-1కు 2,377 మంది, పేపర్-2కు 21,932 మంది, రెండు పరీక్షలను కలిపి 221మంది రాయబోతున్నారు. ఇక డీఎస్సీ నోటిఫికేషన్ వార్తల నేపథ్యంలో బీఈడీ, డీఎడ్, టెట్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల్లో సంతోషాలు వెల్లివిరిస్తున్నాయి.
మొత్తం పోస్టులు 725
జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో 48, పండిట్‌లలో 64, పీఈటీలు 23, సెకండ్ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ) పోస్టులు 590.. మొత్తంగా 725 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలు తక్కువగా ఉండడం బీఈడీ అభ్యర్థులను నిరాశకు గురిచేస్తోంది.
చిగురిస్తున్న ఆశలు
Published Thu, Dec 5 2013 1:58 AM | Last Updated on Fri, May 25 2018 5:44 PM
Advertisement
Advertisement