
శ్రీవారికి రూ.కోటి విరాళం
తిరుచానూరు (చిత్తూరు) : హెచ్‌సీఎల్ సంస్థ చైర్మన్ శివనాడార్ సోమవారం ఉదయం శ్రీవారికి రూ.కోటి విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఎస్వీ బాలమందిర్ ట్రస్టుకు వినియోగించేలా చెక్ రూపంలో టీటీడీ ఈవో డాక్టర్ డి.సాంబశివరావుకు అందజేశారు.
అంతకుముందు కుటుంబ సమేతంగా ఆయన శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో ఆయనకు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు స్వామి వారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు.