ఆండ్ర రిజర్వాయర్‌లో హెడ్‌కానిస్టేబుల్ గల్లంతు? | Head Constable missing in Andre Reservoir | Sakshi
Sakshi News home page

ఆండ్ర రిజర్వాయర్‌లో హెడ్‌కానిస్టేబుల్ గల్లంతు?

Published Fri, Apr 8 2016 2:32 AM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM

ఆండ్ర  రిజర్వాయర్‌లో హెడ్‌కానిస్టేబుల్ గల్లంతు?

ఆండ్ర రిజర్వాయర్‌లో హెడ్‌కానిస్టేబుల్ గల్లంతు?

మెంటాడ: మండలంలోని ఆండ్ర పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పి.గోపాలకృష్ణాజీ(45) గురువారం ఆండ్ర రిజర్వాయర్‌లో గల్లంతైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం ఆండ్ర రిజర్వాయర్ వద్ద వెళ్లిన గోపాలకృష్ణాజీ ప్రమాదవశాత్తు జారిపడి ఉండవచ్చని భావిస్తున్నారు.  చెప్పులు, ద్విచక్ర వాహనం రిజర్వాయర్ వద్దే పడి ఉండటంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
 
 గజపతినగరం సీఐ విజయనాథ్, ఆండ్ర ఎస్‌ఐ భాస్కరరావు పర్యవేక్షణలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సాయంత్రం 6 గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరక్కపోవడంతో వెనుదిరిగారు. విజయనగరంలో ఉంటున్న భార్య మాధవికి, సోదరులు వెంకట కృష్ణాజీ, శ్రీనివాసురావులకు సమాచారం అందజేయడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పిల్లలు లేరని  గోపాలకృష్ణాజీ నిత్యం బాధపడేవారని కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement