
తిరుమలలో వర్షం...
సాక్షి,తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనానికి బుధవారం 7 గంటల సమయం పట్టింది. స్వామికొండపై భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. బుధవారం వేకువజాము 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 42,306 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 14 కంపార్ట్‌మెంట్లలో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. వీరికి 7 గంటల సమయం పడుతున్న ట్టు అధికారులు తెలిపారు. రెండు కంపార్ట్‌మెం ట్లలో వేచి ఉన్న కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. గదులు తీసుకోవడానికి, కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించేందుకు గంట సమయం వేచి ఉండాల్సి వస్తోంది.
శ్రీవారి దర్శనానికి 7 గంటలు
తిరుమలలో బుధవారం కూడా భారీ వర్షం కురిసింది. దీంతో ఆలయ ప్రాంతం మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. స్వామిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులు వర్షం లో తడుస్తూనే పరుగులు తీయాల్సి వచ్చింది. ఘాట్‌రోడ్డులో వాహనదారులు ఇబ్బంది పడకతప్పలేదు. వర్షంతో తిరుమలలో చలి తీవ్రత కూడా పెరిగింది.