rush of devotees
-
మహాశివరాత్రి : శ్రీశైలంకు తరలివస్తున్న భక్తజనం (ఫొటోలు)
-
మహాశివరాత్రి 2024: శ్రీశైలంకు భారీగా తరలివస్తున్న భక్తజనం (ఫొటోలు)
-
అమ్మవు నీవే... అఖిల జగాలకు!
దుష్టశిక్షణకు శిష్టరక్షణకు ప్రతీక దసరా. స్త్రీశక్తి విజయానికి నిలువెత్తు నిదర్శనం దసరా. దేశవ్యాప్తంగా ఊరూవాడా ఏకమై ఉమ్మడిగా జరుపుకొనే వేడుక దసరా. ముగురమ్మల మూలపుటమ్మ అయిన జగజ్జననిని జనమంతా భక్తితో ఆరాధించే పండుగ దసరా. దుర్గతులను దూరం చేసే దుర్గమ్మను నవరాత్రులలో పూజించే వేడుక దసరా. మన దేశంలో నలుమూలలా దసరా వేడుకలు ఘనంగా జరుగుతాయి. కోల్‌కతా, మైసూరు వంటి నగరాలలో దసరా నవరాత్రి వేడుకలు అమిత వైభవంగా జరుగుతాయి. దేశంలోని చాలా నగరాలు, పట్టణాల్లో తాత్కాలికంగా వెలిసే దుర్గామాత మంటపాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతాయి. శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలు ప్రత్యేకపూజలతో కళకళలాడుతూ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. దసరా వేడుకలు భారత్‌కు మాత్రమే కాదు, పొరుగునే ఉన్న నేపాల్, శ్రీలంకలలో కూడా దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. తొలిసారిగా చైనా సందడి కోల్‌కతా దసరా వేడుకలపై ఈసారి చైనా ఆసక్తి ప్రదర్శిస్తోంది. కోల్‌కతాలోని చైనా కాన్సులేట్ అధికారులు, సిబ్బంది ‘ఇంపాక్ట్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలసి ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. చైనా ప్రతినిధులు అధికారికంగా దసరా వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి కానుంది. ‘ఇంపాక్ట్’ ప్రతినిధులతో కలసి చైనా కాన్సులేట్ అధికారులు కోల్‌కతా నగరంలో వెలసిన దుర్గామాత మంటపాలను నవరాత్రులలో పంచమి నాటి నుంచి... అంటే అక్టోబర్ 6 నుంచి సందర్శించనున్నారు. భద్రత, అలంకరణ వంటి వివిధ అంశాల్లో మేటిగా నిలిచిన పది ఉత్తమ మంటపాల ఫలితాలను దసరా ముందు రోజు ప్రకటించనున్నారు. ఉత్తమ మంటపాల నిర్వాహకులకు ఎలాంటి నగదు బహుమతులు చెల్లించరు గాని, వారికి ఉచితంగా చైనాను సందర్శించే అవకాశం కల్పించనున్నట్లు కోల్‌కతాలోని చైనా కాన్సుల్ జనరల్ మా ఝాన్వు ప్రకటించారు. మైసూరులో మహారాజ వైభోగంగా... మైసూరులో దసరా వేడుకలు మహారాజ వైభోగంగా జరుగుతాయి. ఏనుగుల ఊరేగింపు, ఊరేగింపులో జానపద కళాకారుల ప్రదర్శనల సందడిని చూసి తీరాల్సిందే. మైసూరులో దసరా నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించే సంప్రదాయం పదిహేనో శతాబ్దిలో విజయనగర రాజుల కాలం నుంచే మొదలైంది. విజయనగర సామ్రాజ్యం పతనమయ్యాక వడయార్ రాజ వంశీకులు దసరా వేడుకలకు పునర్వైభవం తీసుకొచ్చారు. వడయార్ రాజులు పదిహేడో శతాబ్ది తొలినాళ్లలో ఈ వేడుకలను శ్రీరంగపట్నంలో నిర్వహించేవారు. మూడవ కృష్ణరాజ వడయార్ హయాంలో 1805 సంవత్సరం నుంచి మైసూరులో దసరా వేడుకల నిర్వహణ ప్రారంభమైంది. నవరాత్రుల సందర్భంగా చాముండీ హిల్స్ ప్రాంతంలోని మైసూరు ప్యాలెస్‌లో వడయార్ రాజులు దర్బార్ నిర్వహించే ఆనవాయితీ కూడా అప్పటి నుంచే మొదలైంది. ఆ ఆనవాయితీ నేటికీ కొనసాగుతోంది. నవరాత్రులలో మైసూరు ప్యాలెస్ విద్యుద్దీపకాంతులతో ధగధగలాడుతూ దేదీప్యమానంగా మెరిసిపోతుంది. నవరాత్రుల సందర్భంగా వడయార్ రాజవంశీకుల ఆరాధ్య దైవమైన చాముండేశ్వరీ దేవిని 750 కిలోల బంగారంతో నిర్మించిన స్వర్ణమంటపంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దసరా రోజున మైసూరు ప్యాలెస్ నుంచి ఏనుగులతో సకల రాజ లాంఛనాలతో జరిగే దసరా ఊరేగింపులో లక్షలాది మంది జనం ఉత్సాహంగా పాల్గొంటారు. ఊరేగింపును తిలకించడానికి దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో జనం తరలి వస్తారు. ఈ ఊరేగింపు మైసూరు వీధుల గుండా సాగి, పరేడ్ గ్రౌండ్స్ సమీపంలోని జమ్మిచెట్టు వద్ద ఏర్పాటు చేసే ‘బన్నిమంటపం’ వరకు సాగుతుంది. జమ్మిని కన్నడంలో ‘బన్ని’ అంటారు అందుకే ఈ మంటపాన్ని ‘బన్నిమంటపం’ అంటారు. ఏనుగులతో భారీ స్థాయిలో సాగే ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని అప్పట్లో బ్రిటిషర్లు ‘జంబో సవారీ’అనేవారు. ఇప్పటికీ ఆ పేరే వాడుకలో ఉంది. పదవ చామరాజ వడయార్ హయాంలో 1880 నుంచి నవరాత్రుల సందర్భంగా దసరా ప్రదర్శన ఏర్పాటు చేసే ఆనవాయితీ మొదలైంది. ప్రస్తుతం దసరా వేడుకలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాజవంశీకులు నిర్వహిస్తూ వస్తున్నా, 1981 నుంచి ప్రదర్శన బాధ్యతలను మాత్రం కర్ణాటక ఎగ్జిబిషన్ అథారిటీ నిర్వహిస్తూ వస్తోంది. దసరా నవరాత్రి వేడుకల్లో మైసూరులోని ఆడిటోరియమ్స్ అన్నీ సంగీత కచేరీలు, నృత్యప్రదర్శనలతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఇక నవరాత్రుల సందర్భంగా జరిగే కుస్తీపోటీలు మైసూరు వేడుకలకే ప్రత్యేక ఆకర్షణ. మైసూరుతో పాటు కర్ణాటకలో బెంగళూరులోని బనశంకరి, గోకర్ణలోని భద్రకర్ణిక, బప్పనాడులో దుర్గాపరమేశ్వరి, కడియాలిలోని మహిష మర్దిని వంటి శక్తి ఆలయాల్లోనూ దసరా వేడుకలు సంప్రదాయబద్ధంగా, అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. శివమొగ్గలోనైతే దసరా వేడుకలు దాదాపు మైసూరు వేడుకలనే తలపిస్తాయి. నవరాత్రుల సందర్భంగా ఇక్కడ చలనచిత్రోత్సవాలను కూడా నిర్వహించడం విశేషం. నలుదిశలా నవరాత్రులు దసరా వేడుకలు అనగానే చప్పున స్ఫురించే పేర్లు కోల్‌కతా, మైసూరే అయినా మన దేశంలో నలుదిశలా దసరా నవరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరుగుతాయి. ముఖ్యంగా శక్తి ఆరాధన ఎక్కువగా ఉండే తూర్పు, ఉత్తర భారత ప్రాంతాల్లో దసరా నవరాత్రి వేడుకలు అత్యంత సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల గురించి చెప్పుకోవాలంటే విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారికి ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతాయి. దసరా రోజున కృష్ణానదిలో అమ్మవారికి తెప్పోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. శ్రీశైలంలోని భ్రమరాంబికా దేవికి, ఆలంపురంలోని జోగులాంబా దేవికి కూడా ఘనంగా నవరాత్రి వేడుకలను నిర్వహిస్తారు. తెలంగాణలో జరిగే నవరాత్రి వేడుకలకు బతుకమ్మ సంబరాలు మరింత వన్నె తెస్తాయి. రకరకాల పూలతో బతుకమ్మలను అలంకరించి, కొలువుదీర్చి మహిళలంతా పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. తెలంగాణలో వయసులో చిన్నవారు పెద్దల చేతికి జమ్మి ఆకులను ఇచ్చి, వారి ఆశీస్సులు అందుకుంటారు. ఒడిశాలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా దసరా వేడుకల కోలాహలం కనిపిస్తుంది. నగరాల్లోను, పట్టణాల్లోను అడుగడుగునా దేవీ మంటపాలు దర్శనమిస్తాయి. కటక్‌లో చండీ, జాజ్పూర్లో బిరజా, పూరీలో బిమలా, గంజాం జిల్లాలోని తరాతరిణి తదితర శక్తి ఆలయాల్లో నవరాత్రి వేడుకలు నేత్రపర్వంగా జరుగుతాయి. తమిళనాడు, కేరళలలో దసరా నవరాత్రులలోని తొమ్మిదోరోజు సరస్వతీ పూజ చేస్తారు. విజయ దశమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చదువుల్లో రాణిస్తారనే నమ్మకం ఆ రాష్ట్రాల్లో ఉంది. కొట్టాయంలోని సరస్వతీ ఆలయంలో విజయదశమి నాడు వేలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్‌కు చేరువలో ఉండే జార్ఖండ్, అసోం, త్రిపుర రాష్ట్రాల్లో కూడా దసరా వేడుకలు దాదాపు ఇదే తీరులో జరుగుతాయి. అసోంలోని కామాక్షీ శక్తిపీఠంలో జరిగే నవరాత్రి వేడుకల్లో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొంటారు. నవరాత్రుల సందర్భంగా మహారాష్ట్రలో తునికాకు చెట్లను పూజిస్తారు. తెలంగాణలో పెద్దలకు జమ్మి ఆకులిచ్చి ఆశీస్సులు పొందే ఆచారం ఉన్నట్లే, మహారాష్ట్రలో పెద్దలకు తునికాకులు ఇచ్చి, ఆశీస్సులు పొందే ఆచారం ఉంది. ఉత్తరాదిలో రైతుల పండుగ దసరా నవరాత్రులను ఉత్తరాదిలో వ్యవసాయదారుల పండుగగా జరుపుకొంటారు. నవరాత్రుల తొలిరోజున స్థానికంగా పండే గోధుమలు, బార్లీ వంటి ధాన్యాల విత్తులను మట్టికుండీలో నాటుతారు. దసరా నాటికి విత్తనాలు మొలకలెత్తుతాయి. మొలకలతో ఉన్న కుండీలను దసరా రోజున నదుల్లో లేదా చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బీహార్ ప్రాంతాల్లో చాలామంది ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఉత్తరాఖండ్‌లోని కుమావ్ ప్రాంతంలో రంగస్థల సంప్రదాయాల ప్రకారం ‘రామ్‌లీలా’ వేడుకను ప్రదర్శిస్తారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు ప్రాంతంలో దసరా వేడుకలు కొంత విలక్షణంగా జరుగుతాయి. మిగిలిన ప్రాంతాల్లో విజయదశమి నాటితో నవరాత్రి వేడుకలకు ముగింపు పలికితే, కులు ప్రాంతంలో మాత్రం విజయదశమి నాటి నుంచే ఈ వేడుకలు మొదలై వారం రోజుల పాటు జరుగుతాయి. రావణుడిని రాముడు విజయదశమి రోజున సంహరించడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో విజయదశమి రోజున రావణ దహనాన్ని అట్టహాసంగా నిర్వహిస్తారు. ఊరూరా కూడళ్లలో భారీ పరిమాణంలో తయారు చేసే రావణ, కుంభకర్ణ, మేఘనాదుల దిష్టిబొమ్మలను తగులబెడతారు. బీహార్‌లోని మైథిలీ ప్రజలు నవదుర్గా పూజలు నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో మహాలయ అమావాస్యకు ముందు నుంచే పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఊరూరా దుర్గాదేవి మంటపాలతో పాటు రకరకాల ప్రదర్శనలు ఏర్పాటవుతాయి. గుజరాత్లో దసరా నవరాత్రి వేడుకల్లో దాండియా, గార్భా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో జరిగే దసరా నవరాత్రి వేడుకల్లో భిన్నసంస్కృతులు ప్రతిఫలిస్తాయి. వివిధ రాష్ట్రాల్లో దసరా వేడుకల నిర్వహణలో కొంత వైవిధ్యం ఉన్నప్పటికీ, ప్రతిచోటా ఈ సందర్భంగా ఆయుధపూజలు నిర్వహిస్తారు. ఇళ్లలో, కార్యాలయాల్లో, కర్మాగారాల్లో వాడుకునే పనిముట్లను, యంత్రాలను, వాహనాలను పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు చేస్తారు. విదేశాల్లో విజయదశమి భారత్‌లోనే కాకుండా చాలా ఇతర దేశాల్లోనూ దసరా నవరాత్రి వేడుకలు జరుగుతాయి. పొరుగునే ఉన్న నేపాల్‌లోని శక్తి క్షేత్రాల్లో అత్యంత సంప్రదాయబద్ధంగా దసరా వేడుకలను నిర్వహిస్తారు. దసరాను నేపాలీలు ‘దసైన్’గా పిలుచుకుంటారు. ఇండోనేసియాలో స్థిరపడ్డ భారతీయులు జకార్తా, టాంగెరాంగ్లలో నిర్మించిన దుర్గాదేవి ఆలయాల్లో నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. మలేసియా, సింగపూర్లలో బెంగాలీ సంఘాలు ఈ సందర్భంగా దుర్గాదేవి పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయంతో పాటు పలుచోట్ల నవరాత్రి వేడుకలు జరుగుతాయి. ఈ సందర్భంగా పద్మానదిలో పడవ పందేలను కూడా నిర్వహిస్తారు. బ్రిటన్‌లో స్థిరపడ్డ బెంగాలీలు, అస్సామీలు దాదాపు యాభయ్యేళ్లుగా అక్కడ దసరా నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అమెరికాలోని యాభై రాష్ట్రాల్లోనూ అక్కడ స్థిరపడ్డ భారతీయులు ఈ వేడుకలను ఉత్సాహంగా జరుపుకొంటారు. జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోనూ అక్కడ స్థిరపడ్డ భారతీయులు కొన్ని దశాబ్దాలుగా దసరా నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. చైనాలోని భారతీయులు 2004 నుంచి షాంఘై నగరంలో ఈ వేడుకలను నిర్వహించడం ప్రారంభించారు. శరన్నవరాత్రుల పుట్టుపూర్వోత్తరాలు దసరా నవరాత్రులను శరదృతువు ప్రారంభంలో వచ్చే ఆశ్వియుజమాసంలో జరుపుకోవడం వల్ల వీటిని శరన్నవరాత్రులని కూడా అంటారు. నిజానికి దుర్గాదేవిని చైత్రమాసం ప్రారంభంలో వచ్చే వసంత నవరాత్రుల్లో ఆరాధించడమే సరైన పద్ధతి అని, ఆశ్వియుజంలో ఈ దుర్గాదేవిని పూజించడమంటే, అకాలంలో అమ్మవారిని మేల్కొల్పడమేనని బెంగాలీల్లో కొందరు నమ్ముతారు. దీనినే వారు ‘అకాల్ బోధొన్’ అంటారు. రామాయణ కాలానికి ముందు వసంత నవరాత్రులలోనే అమ్మవారిని ఆరాధించేవారట. రావణుడితో యుద్ధం జరిగినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీరాముడు ఆశ్వియుజ మాసంలో చండీహోమాన్ని నిర్వహించి, దుర్గాదేవి అనుగ్రహాన్ని పొంది రావణుడిని సంహరించాడని ప్రతీతి. అప్పటి నుంచే శరన్నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించడం మొదలైందని చెబుతారు. ఇక చరిత్రను పరిశీలిస్తే, దుర్గాదేవి ఆరాధన మధ్యయుగాల నాటికే దేశం నలుమూలలా జరుపుకొనేవారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని పరశురామేశ్వర ఆలయంలో లభించిన క్రీస్తుశకం ఆరోశతాబ్ది నాటి శిల్పం ద్వారా అప్పట్లోనే దుర్గాదేవి నవరాత్రులు వైభవోపేతంగా జరిగేవని తెలుస్తోంది. అప్పట్లో పలు శివాలయాల్లో దేవీ నవరాత్రులు జరిగేవి. తొలినాళ్లలో ఈ వేడుకలు ఆలయాలకు, రాజప్రాసాదాలకు మాత్రమే పరిమితమై ఉండేవి. కాలక్రమంలో సామాన్యులు సామూహికంగా ఊరూరా దసరా నవరాత్రులను జరుపుకోవడం మొదలైంది. కవర్‌స్టోరీ: పన్యాల జగన్నాథదాసు -
రాజన్నకు అమావాస్య ఎఫెక్టు
ప్రతి రోజూ రద్దీగా కనిపించే ఎములాడ రాజన్న ఆలయం అమావాస్య కారణంగా సోమవారం బోసిపోయింది. దీనికి తోడు ఆషాఢమాసం ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా తగ్గింది. జనం ఎక్కువగా లేకపోవడంతో ఆలయ సిబ్బంది, అధికారులు, అర్చకులు ఖాళీగా కనిపించారు. - వేములవాడ -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 49,529 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం మొత్తం 31 కంపార్ట్మెంట్లలో నిండిన భక్తులకు 10 గంటలు, కాలిబాట భక్తులకు 8 గంటల తర్వాత స్వామి దర్శనం లభించనుంది. గదులు ఖాళీ లేవు. అన్ని చోట్లా భక్తుల నిరీక్షణ పెరిగింది. హుండీ కానుకలు రూ. 2.70 కోట్లు లభించాయి. -
కోనేటిరాయా! క్యూ భద్రత ఎంత?
ఇల వైకుంఠం తిరుమలలో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే రద్దీకి తగ్గట్టుగా క్యూ నిర్వహణలో టీటీడీ అంత పటిష్టంగా లేదనే చెప్పాలి. దీంతో తరచూ భక్తులకు తిప్పలు తప్పడం లేదు. ప్రస్తుత క్యూలకు అత్యవసర ద్వారాలు సరిపడా లేవు. ఆదివారం కేరళలోని ఓ ఆలయంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో తిరుమల కొండపై క్రౌడ్ మేనేజ్మెంట్ నిర్వహణను టీటీడీ మరోసారి సమీక్షించుకోవాల్సిన అవసరం కలిగింది. తిరుమల: శ్రీవారి దర్శనం కోసం తిరుమలకొండకు వచ్చే భక్తుల కోసం ధార్మిక సంస్థ టీటీడీ విజిలెన్స్, పోలీసు బలగాలు బోలెడంత భద్రతను కల్పిం చాయి. భక్తులు తీర్థయాత్రను పరి పూర్ణం చేసుకునే సౌలభ్యం ఉంది. టీటీడీ ముఖ్య భద్రత, నిఘా అధికారి నేతృత్వంలో స్వామి ఆలయానికి ఆర్మ్డ్ ఫోర్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్), టీటీడీ విజిలెన్స్ విభాగాలు పనిచేస్తాయి. మహద్వారం నుంచి ఆనంద నిలయం ప్రాకారం వరకు విజిలెన్స్ తప్ప మిగిలిన సిబ్బంది అధునాతన ఆ యుధాలతో 24 గంటలూ షిఫ్టుల పద్ధతిలో పహారా కాస్తారు. ఇక ఆలయం మీద నాలుగు దిశల్లోనూ గస్తీ (ఔట్‌పోస్టుల్లో) ఉంటుంది. ఆలయం ముందు గొల్ల మండపం వద్ద కూడా అలాంటి వాటిలోనే భద్రత సిబ్బంది విధులు నిర్వర్తింటారు. విధుల్లో ఉన్నవారు తప్ప ఆలయంలోకి ఇతర భద్రతా సిబ్బంది ఆయుధాలు తీసుకెళ్లకూడదు. ప్రొటోకా ల్ వీఐపీలతోపాటు ఆయుధాలతో వచ్చే భద్రతా సిబ్బంది కూడా ఆలయ మహద్వారం దాటి లోనికి వెళ్లకూడదు. స్వా మి దర్శనానికి వెళ్లే భక్తులను భద్రతా సిబ్బంది వైకుంఠం నుంచి ఆలయం వరకు పలు దశల్లో తనిఖీ చేస్తారు. మెట ల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. ఆలయంలోకి లగేజీతో వెళ్లడం నిషిద్ధం. భక్తుల చిన్నపాటి చేతిబాగులు పరిశీలించేందుకు అధునాతన స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేశారు. వైకుంఠం నుంచి ఆలయం వరకు అడుగడుగునా అధునాతన సీసీ కెమెరా వ్యవస్థ ఉంది. నిఘా సిబ్బంది క్యూ ద్వారా ఆలయంలోకి వెళ్లేవారి కదలికల్ని నిశితంగా పరిశీలిస్తారు. క్రౌడ్ మేనేజ్మెంట్లో వెనుకబాటు టీటీడీ లెక్కల ప్రకారం ఏటా సగటున 2 కోట్ల నుంచి 2.5 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అంటే రోజుకు సరాసరిగా 70 వేల మంది వస్తున్నారు. రద్దీ తక్కువగా ఉండేరోజులో కనీసం 40 వేలకు తగ్గదు. సెలవులు, పర్వదినాల్లో ఈ సంఖ్య లక్ష దాటుతోంది. ఈ సమయంలో భక్తుల క్యూల నిర్వహణలో టీటీడీ వైఫల్యం చెందుతోందని చెప్పక తప్పదు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా సంబంధిత విభాగాలు ఏకకాలంలోనే ముందుకు రావాలి. అలాంటి వ్యవస్థ శాస్త్రీయంగా టీటీడీలో లేదు. ఇందులో ఆలయం, విజిలెన్స్ విభాగాల్లో ఎవరు ఏ విధులు నిర్వహించాలి? అన్న స్పష్టమైన విధి విధానాల్లేవు. సాధారణ రోజుల్లో క్యూ, రద్దీ రోజుల్లో క్యూ ఎలా నిర్వహించాలి? అన్నది ఆయా విభాగాధిపతి ఆదేశాల మేరకే నడుస్తోంది. అందుకు ప్రస్తుత టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ఉదాహరణగా చెప్పవచ్చు. వారు క్యూ వద్ద ఉంటేనే అన్ని విభాగాల అధికారులు అక్కడ ఉంటారు. వారు ఆయన ముఖం చాటేస్తే ఎవరిపనుల్లో వారు బిజీగా ఉంటారు. దీనివల్ల రద్దీక్యూ నిర్వహణలో ఎలాంటి స్పష్టత రావటం లేదు. ఫలితంగా భక్తుల అవస్థలు వర్ణనాతీతం. భక్తుల మధ్య తోపులాటలు నిత్యకృత్యంగామారాయి. సెంట్రల్ కమాండెంట్ సెంటర్ పరిస్థితేమిటి? అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అన్ని విభాగాలను సమన్వయం చేసేందుకు సమష్టిగా పనిచేసి పరిస్థితులను నుంచి గట్టెక్కించేందుకు టీటీడీ ప్రత్యేకంగా సెంట్రల్ కమాండెంట్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇది కేవలం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మాత్రమే పనిచేస్తుంది. ఇందులో టీటీడీలోని విజిలెన్స్, ఇంజినీరింగ్, ఆలయం, అన్నప్రసాదం, ఇతర అవసరమైన అనుబంధ విభాగాలు ఉంటాయి. దీంతోపాటు జాతీయ విపత్తుల నివారణ సంస్థ తరఫున ఓ బృందాన్ని తిరుమలలో నెలకొల్పాలని టీటీడీ నిర్ణయించింది. ఇది ఇంతవరకు అమలు కాలేదు. అలాగే, టీటీడీ విజిలెన్స్ విభాగంలోని కొంతమంది సిబ్బందికి జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఎన్డీఆర్ఎఫ్ నేతృత్వంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అలాంటి వారిని ఇతర విధుల్లో వినియోగించుకుంటున్నారు. ఇక కల్యాణకట్టల్లో భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు, గదులు పొందేందుకు భక్తులు బారులు తీరిన క్యూలో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటివాటిని కూడా సంబంధిత అధికారులు పరిగణలోకి తీసుకుని క్యూలను సజావుగా సాగే విధానం అమలు చేయాల్సిన అవసరం ఉంది. -
తిరుమల సమాచారం
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 8 కంపార్టుమెంట్లు నిండాయి. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు: ఉచిత గదులు - 5 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు - 30 ఖాళీగా ఉన్నాయి రూ.100 గదులు - 10 ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జిత సేవల వివరాలు ఆర్జిత బ్రహ్మోత్సవం - 100 ఖాళీగా ఉన్నాయి సహస్ర దీపాలంకరణ - 150 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం - 70 ఖాళీగా ఉన్నాయి శుక్రవారం ప్రత్యేక సేవ - పూరాభిషేకం -
యాదాద్రిలో తొలి ఏకాదశి ఏర్పాట్లు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం (యాదాద్రి)లో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో స్వామి, అమ్మవార్లకు తిరుమంజన స్నపనం, నవకలశ స్నపనం చేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటే విశేష పుణ్య ఫలితం ఉంటుందని చెప్పారు. భక్తుల కోసం సుమారు 50 వేల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేయనున్నారు. దర్శనం క్యూలైన్లలో ఎటువంటి తోపులాటలు లేకుండా ఉండేందుకు గాను కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఆలయంలో విశేష పూజలు, తులసీ అర్చనలు, కుంకుమార్చనలు, చేయనున్నట్లు అర్చకులు తెలిపారు. కొండపై పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం సెలవురోజు కావడంతో యాదాద్రికి భక్తుల రద్దీ పెరిగింది. పుష్కరాలకు వెళ్లిన భక్తులు తిరుగుప్రయాణంలో గుట్టకు వస్తున్నారు. సంగీత భవనం, దర్శనం క్యూలైను,్ల ప్రసాదాల క్యూలైన్లు అన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారని దేవస్థానం అధికారులు చెప్పారు. -
ఏపీలో గ్రామీణ ఘాట్లకు పోటెత్తిన భక్తులు
పశ్చిమ గోదావరివైపు తరలిన భక్తజనం * పలచబడ్డ వీఐపీలు.. వీవీఐపీలు * రాజమండ్రిలో తగ్గిన భక్తుల రద్దీ * పుష్కరఘాట్ తొక్కిసలాట దుర్ఘటన ప్రభావం సాక్షి, రాజమండ్రి, కొవ్వూరు: పుష్కరాల తొలి రోజున రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ప్రభావం రెండోరోజు కనిపించింది. రాజమండ్రికి భక్తుల తాకిడి అనూహ్యంగా తగ్గింది. తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకూ ఘాట్లు కాస్త రద్దీగా కనిపించాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మెజార్టీ ఘాట్ల వద్ద రద్దీ పెద్దగా కనిపించలేదు. రాజమండ్రి పరిసర ప్రాంతాల ఘాట్లకు భక్తుల తాకిడి తగ్గినా.. గ్రామీణ ఘాట్లకు జనం భారీగానే తరలి వెళ్లారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని ఘాట్ల వైపు మొగ్గుచూపారు. అలాగే బుధవారం అమావాస్య కావడంతో పుణ్యస్నానాలకు వచ్చే భక్తుల సంఖ్య కాస్త తగ్గింది. తొలి రోజు పుష్కరఘాట్‌లో సుమారు 3.5 లక్షల మంది, కోటిలింగాల రేవులో 4.2 లక్షల మంది స్నానమాచరించగా, రెండోరోజు ఆ సంఖ్య 2 లక్షలలోపే ఉందని తెలుస్తోంది. మొత్తమ్మీద బుధవారం సాయంత్రానికి అందిన సమాచారం మేరకు జిల్లా పరిధిలో సుమారు 12 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు. వీరిలో నగర పరిధిలో 6.58 లక్షల మంది, గ్రామీణ ఘాట్లలో 5.40 లక్షల మంది స్నానాలు చేశారు. తొక్కిసలాట నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి వరకూ సీఎం, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులంతా ఘాట్ల వద్దే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించారు. ప్రముఖులు కొందరే.. రాజమండ్రి వీఐపీ ఘాట్‌కు తొలి రోజుతో పోలిస్తే వీఐపీలు, వీవీఐపీల తాకిడి తగ్గింది. సిక్కిం మాజీ గవర్నర్ వి.రామారావు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సిసోడియా, ఎంపీ వి.హనుమంతరావు, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పుణ్యస్నానాలు ఆచరించారు. ‘పశ్చిమ’కు జన వరద పశ్చిమగోదావరి జిల్లాకు భక్తుల రాక పెరిగింది. కొవ్వూరు గోష్పాదం ఘాట్‌లో బందోబస్తు, పోలీసు భద్రతా పరిస్థితిని ఏపీ డీజీపీ జేవీ రాముడు పరిశీలించారు. ఏపీ మంత్రి పి.మాణిక్యాలరావు కొవ్వూరులోని పుష్కర ఘాట్లను పరిశీలించారు. రెండో రోజు జిల్లాలోని 97 ఘాట్లలో 10.86 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించారు. కొవ్వూరు, నరసాపురం పట్టణాల్లో పోలీసు యంత్రాంగం డ్రోన్ కెమెరాల సాయంతో నిరంతర నిఘా కొనసాగించారు. నరసాపురంలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పుణ్యస్నానమాచరించి, పితృదేవతలకు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. -
నీకు రెస్టెప్పుడు గోవిందా..!
ఆలస్యంగా పూజా కైంకర్యాలు..సమయం కుదింపు సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామివారి పూజా కైంకర్యాలు, సేవలు ఆగమోక్తంగా నిర్ణీత సమయాల్లో నిర్వహించడంలో టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. భక్తుల రద్దీ పేరుతో వ్యక్తిగత రికార్డుల కోసం మూలవిరాట్టు పూజా కైంకర్యాల్లో కోత పెడుతున్నారు. దీన్ని ఆగమపండితులు పీఠాధిపతులు నిరసిస్తున్నా పట్టించుకోవడం లేదు. కైంకర్యాల సమయం కనీసం ఆరు గంటలు గర్భాలయంలో వేంకటేశ్వరస్వామి మూలవిరాట్టు పూజా కైంకర్యాలన్నీ వైఖానస ఆగమ నిబంధనల మేరకు వేకువజాము మొదలుపెడతారు. తిరిగి అర్ధరాత్రి వరకు ప్రాతఃకాల, మధ్యాహ్న, రాత్రి కైంకర్యాలు ప్రతిరోజూ రెండుసార్లు, తోమాల ఒకసారి, మూడుసార్లు అర్చన, నైవేద్యాలు, తగినంత విరామ సమయం కేటాయించాలి. 24 గంటల్లో గర్భాలయ మూలమూర్తికి గరిష్టంగా 10 గంటలు, కనిష్టంగా 6 గంటలకు తక్కువ కాకుండా పూజా కైంకర్యాలు, విరామ సమయం కేటాయించాలి. అయితే, భక్తుల రద్దీ కారణంగా వారందరికీ దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో పూజా నివేదనలతోపాటు విరామ సమయాన్నీ తగ్గిస్తున్నారు. ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించామనే తమ వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఆగ మ నిబంధనల్ని పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శ లున్నాయి. గత శనివారం అర్ధరాత్రి 12.30 గంటలకు నిర్వహించాల్సిన ఏకాంత సేవ ఆదివారం వేకువజామున 1.45 గంటలకు ప్రారంభించడం, ఆ వెనువెంటనే విరామం లేకుండా సుప్రభాతం మరుసటి రోజు పూజలు ప్రారంభించడం గమనార్హం. -
తిరుమల సమాచారం
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండాయి. శుక్రవారం ఉదయానికి అందిన సమాచారం : ఉచిత గదులు - 10 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు- 67 ఖాళీగా ఉన్నాయి రూ.100 గదులు- 9 ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : 167 సహస్ర దీపాలంకరణ సేవ :110 వసంతోత్సవం : 9 ఖాళీగా ఉన్నాయి. శుక్రవారం ప్రత్యేక సేవ : పూరాభిషేకం. -
తిరుమల సమాచారం
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 7 కంపార్టుమెంట్లు నిండాయి. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం : ఉచిత గదులు - 11 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు- 5 ఖాళీగా ఉన్నాయి రూ.100 గదులు- 110 ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం : ఖాళీ లేవు బుధవారం ప్రత్యేక సేవ : సహస్ర కలశాభిషేకం -
తిరుమల సమాచారం
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 7 కంపార్టుమెంట్లు నిండాయి. సాయంత్రం 6 గంటలకుఅందిన సమాచారం : ఉచిత గదులు - 11 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు- 5 ఖాళీగా ఉన్నాయి రూ.100 గదులు- 110 ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం : ఖాళీ లేవు బుధవారం ప్రత్యేక సేవ : సహస్ర కలశాభిషేకం -
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల: తిరుమలలో రెండు రోజులుగా రికార్డు స్థాయిలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం 90,010 మందికి, ఆదివారం 90,662 మంది భక్తులకు గర్భాలయ మూల మూర్తి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వేసవి సెలవులతో రద్దీ పెరిగింది. ఉన్నతాధికారులు సమన్వయంతో సర్వదర్శనం, కాలిబాట క్యూ, రూ. 300 ఆన్లైన్ టికెట్లు, ఆర్జిత సేవలు, వీఐపీ భక్తులు, వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డ తల్లిదండ్రులు ఇలా అన్ని క్యూలను దశలవారీగా అమలు చేశారు. ఆలయంలో కూడా భక్తులకు త్వరగా దర్శనం కల్పించే చర్యలు తీసుకున్నారు. సోమవారం కొంత రద్దీ తగ్గి సాయంత్రం 6 గంటల వరకు 60,501 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం హుండీలో సమర్పించిన కానుకల్ని సోమవారం లెక్కించగా రూ. 2.80 కోట్ల ఆదాయం వచ్చింది. -
తిరుమల సమాచారం
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50 గదులు లభిస్తున్నాయి. రూ.100, రూ.500 గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. క్యూ వెలుపలకు వచ్చింది. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు: ఉచిత గదులు - 17, రూ.50 గదులు - 4 ఖాళీగా ఉన్నాయి, రూ.100 గదులు- ఖాళీ లేవు, రూ.500 గదులు- ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ సేవ : ఖాళీ లేవు వసంతోత్సవం : ఖాళీ లేవు -
తిరుమల సమాచారం
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గదులు ఏవీ ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. క్యూ వెలుపలకు వచ్చింది. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు: ఉచిత గదులు,రూ.50 గదులు - ఖాళీ లేవు రూ.100 గదులు- ఖాళీ లేవు రూ.500 గదులు- ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ సేవ : ఖాళీ లేవు వసంతోత్సవం: ఖాళీ లేవు -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.50, రూ.100ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 30 కంపార్టుమెంట్లు నిండాయి. గదుల వివరాలు: ఉచిత గదులు - 81 ,రూ.500 గదులు -6 ఖాళీగా ఉన్నాయి, రూ.50 గదులు, రూ.100 గదులు- ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ సేవ : ఖాళీ లేవు వసంతోత్సవం : ఖాళీ లేవు శుక్రవారం ప్రత్యేక సేవ : పూరాభిషేకం -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 9 కంపార్టుమెంట్లు నిండాయి. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు: ఉచిత గదులు -110, రూ.50 గదులు-45, రూ.100 గదులు- 11, రూ.500 గదులు- 34 ఖాళీగా ఉన్నాయి ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం 267 ఖాళీగా ఉన్నాయి సహస్ర దీపాలంకరణ సేవ : 214 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం : 40 ఖాళీగా ఉన్నాయి గురువారం ప్రత్యేక సేవ: తిరుప్పావడ -
తిరుమల సమాచారం
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. రూ.50, రూ.100ల గదులు భక్తులకు సులభంగా లభిస్తున్నాయి.ఉచిత, రూ.500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 8 కంపార్టుమెంట్లు నిండాయి. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు: ఉచిత గదులు - 11 , రూ.50 గదులు- 45 రూ.100 గదులు- 111, రూ.500 గదులు- 4 ఖాళీగా ఉన్నాయి ఆర్జితసేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - 27 సహస్ర దీపాలంకరణ సేవ -114 వసంతోత్సవం - 240 ఖాళీగా ఉన్నాయి బుధవారం ప్రత్యేక సేవ - సహస్ర కలశాభిషేకం -
తిరుమల సమాచారం
తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 5 కంపార్టుమెంట్లు నిండాయి. గదుల వివరాలు: ఉచిత గదులు - 101, రూ.50 గదులు - 75, రూ.100 గదులు - 211, రూ.500 గదులు - 14 ఖాళీగా ఉన్నాయి ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : 207, సహస్ర దీపాలంకరణ సేవ : 124, వసంతోత్సవం : 214 ఖాళీగా ఉన్నాయి మంగళవారం ప్రత్యేక సేవ : అష్టదళ పాదపద్మారాధన -
తిరుమల సమాచారం
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 15 కంపార్టుమెంట్లు నిండాయి. గదుల వివరాలు: ఉచిత గదులు - 21, రూ.50 గదులు - 102 ఖాళీగా ఉన్నాయి రూ.100 గదులు- 14 ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు- 5 ఖాళీగా ఉన్నాయి ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : 147 ఖాళీగా ఉన్నాయి, సహస్ర దీపాలంకరణ సేవ : 258 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం : 45 ఖాళీగా ఉన్నాయి -
తిరుమల సమాచారం
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత గదులు అందుబాటులో ఉన్నాయి. రూ.50, రూ.100, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 15 కంపార్టుమెంట్లు నిండాయి. గదుల వివరాలు: ఉచిత గదులు - 5 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు, రూ.100 గదులు- ఖాళీ లేవు రూ.500 గదులు- ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం: ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ సేవ: 110 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం : 100 ఖాళీగా ఉన్నాయి -
తిరుమల సమాచారం
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.100ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 16 కంపార్టుమెంట్లు నిండాయి. గదుల వివరాలు: ఉచిత గదులు - 25, రూ.50 గదులు -75 ఖాళీగా ఉన్నాయి, రూ.100 గదులు- ఖాళీ లేవు రూ.500 గదులు- 5 ఖాళీగా ఉన్నాయి ఆర్జితసేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ- ఖాళీలేవు వసంతోత్సవం - 102 ఖాళీగా ఉన్నాయి శుక్రవారం ప్రత్యేక సేవ - పూరాభిషేకం -
తిరుమల సమాచారం
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 13 కంపార్టుమెంట్లు నిండాయి. గదుల వివరాలు: ఉచిత గదులు - 43, రూ. 50 గదులు - 120 ఖాళీగా ఉన్నాయి రూ.100 గదులు - 61, రూ. 500 గదులు - 7 ఖాళీగా ఉన్నాయి ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : 112 ఖాళీగా ఉన్నాయి సహస్ర దీపాలంకరణ సేవ : 78 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం : 49 ఖాళీగా ఉన్నాయి గురువారం ప్రత్యేక సేవ - తిరుప్పావడ -
తిరుమల సమాచారం
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.100ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.50, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 15 కంపార్టుమెంట్లు నిండాయి. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు: ఉచిత గదులు-52 ఖాళీగా ఉన్నాయి, రూ.50 గదులు-102 ఖాళీగా ఉన్నాయి, రూ.100 గదులు-14 ఖాళీగా ఉన్నాయి, రూ.500 గదులు- 5 ఖాళీగా ఉన్నాయి ఆర్జితసేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం:121 ఖాళీగా ఉన్నాయి సహస్ర దీపాలంకరణ సేవ : 113 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం: 75 ఖాళీగా ఉన్నాయి బుధవారం ప్రత్యేక సేవ - సహస్ర కలశాభిషేకం