తిరుమల: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించన తలనీలాలను ఏప్రిల్ 2వ తేదీ ఈ-వేలం నిర్వహించనున్నారు. ప్రతినెలా మొదటి గురువారం ఈ-వేలం నిర్వహించాలని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు ఉత్తర్వులిచ్చారు. దీంతో విశాఖపట్నంలోని మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎస్‌టీసీ) లిమిటెడ్ సంస్థల్లోని ఈ-వేలం ద్వారా టీటీడీ తలనీలాలు విక్రయించనున్నారు. ఆసక్తిగల బిడ్డర్లు తిరుపతిలోని టీటీడీ జనరల్ మేనేజరు (వేలం) కార్యాలయంలోని 0877-2264429 నంబరుకు సంప్రదించవచ్చని టీటీడీ ప్రజా సంబంధాల విభాగం తెలిపింది.