సాక్షి,తిరుమల : తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 50,553 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో వేచిఉన్న వారికి 16 గంటలు, 11 కంపార్ట్మెంట్లలోని కాలిబాట భక్తులకు 8 గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది. గదుల కోసం భక్తుల రద్దీ పెరిగింది. శనివారం హుండీ ఆదాయం *2.22 కోట్లు కానుకలుగా లభించాయి.