సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. తిరుమలలో శనివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. శనివారం వేకువజాము 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 49,299 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 13 కంపార్టుమెంట్లలో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. వీరికి 10 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఐదు కంపార్టుమెంట్లలో వేచిఉన్న కాలినడక భక్తులకు నాలుగు గంటల సమయం పడుతోంది. గదులు తీసుకోవడానికి, కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించేందుకు భక్తులు గంట సమయం వేచిఉండాల్సి వస్తోంది.