బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. దీనికి తోడు నైరుతి బుతుపవనాలు కూడా బలం పుంచజుకున్నాయని పేర్కొంది. దాంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
అయితే తెలంగాణ ప్రాంతంలో చెదురుమదురుగా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయని చెప్పంది. హైదరాబాద్లో కూడా చిరుజల్లులు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అయితే నల్గొండలో గత అర్థరాత్రి నుంచి భారీ వర్షం పడింది.