ఏపీలో ఈదురుగాలులు, వర్షాలు | Heavy rains and wind wreak havoc in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో ఈదురుగాలులు, వర్షాలు

Published Sat, May 28 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 1:04 AM

Heavy rains and wind wreak havoc in AP

ముగ్గురి మృతి.. చెట్లు కూలి ట్రాఫిక్‌కు అంతరాయం

సాక్షి నెట్‌వర్క్: ఏపీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం బలమైన ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో కృష్ణాజిల్లాలో గోడ దిమ్మె కూలి ఒకరు, పిడుగుపాటుకు మరొకరు, గుంటూరు జిల్లాలో తాటిచెట్టు మీదపడి ఒకరు మృతిచెందారు. పలుచోట్ల చెట్లు కూలి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. జాతీయ రహదారి వెంబడి హోర్డింగ్‌లు పడిపోయాయి.

విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, బొబ్బిలి, శృంగవరపుకోట పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది.శ్రీకాకుళం జిల్లాలోని పలుప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. మామిడి కాయలు రాలిపోవడంతో రైతులు నష్టపోయూరు. కంచిలి మండలంలో వీచిన గాలులకు 35 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement