సాక్షి, అమరావతి: గత రెండు రోజులుగా కరుస్తున్న వర్షాలకు ఏపీ రాజధాని ప్రాంతం నీట మునిగింది. కొండవీటి వాగులో వరద ఉధృతి గంటగంటకు పెరుగుతుండటంతో హైటెన్షన్ నెలకొంది. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నీరుకొండ వద్ద రాజధానికి ఇచ్చిన భూముల్లో భారీగా వరద నీరు చేరింది. గుంటూరు జిల్లా రాయపూడిలో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతుంది. దీంతో ప్రజలు భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో పొలాలు నీట మునిగాయి. పెడపరిమి వద్ద కొటేళ్ల వాగు పొంగి ప్రవహిస్తుంది. గుంటూరు, సచివాలయం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం రాత్రి వర్షం పడితే గ్రామల్లోకి వరద నీరు చేరుతుందని రాజధానివాసులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సచివాలయంలో వాటర్ లీకేజీతో మంత్రుల ఛాంబర్లలోకి నీళ్లు చేరాయి.
సీఎం సమీక్ష
మరోవైపు అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి పంపుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment