రానున్న 72 గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు
Published Thu, Oct 10 2013 3:15 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
ఏలూరు, న్యూస్‌లైన్ : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పెను తుపాన్‌గా మారనుందన్న సమాచారం నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దీని ప్రభావంతో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో డీఆర్వో, ఆర్డీవోలతో ఆయన సమావేశమయ్యూరు. తుపాన్ కారణంగా 170 కిలోమీటర్లకు పైబడిన వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసిందని కలెక్టర్ చెప్పారు. రానున్న 72 గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిందన్నారు.
ఈ దృష్ట్యా సముద్రతీర ప్రాం తం వెంబడి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విపత్కర పరి స్థితి నైనా ఎదుర్కొవడానికి సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. అధిక వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి ప్రవహించే అవకాశాలు ఉన్న దృష్ట్యా లోత ట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, గురువారం ఉద యం 10 గంటలకు అధికారులతో మరోసారి సమావేశమై తీసుకోవాల్సిన చర్యల పై సమీక్షిస్తామని తెలిపారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌లో టోల్ ఫ్రీ నంబర్ 08812 230617 ఏర్పాటు చేశారు.
ప్రత్యేక అధికారిగా సంజయ్ జాజు
జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ అధికారి సంజయ్‌జాజును ప్రభుత్వం నియమిం చింది. ఏపీఎన్జీవోలు, విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేస్తున్న దృష్ట్యా జిల్లా అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
Advertisement
Advertisement