మూడు రోజులపాటు భారీ వర్షాలు | Heavy rains for Three days | Sakshi
Sakshi News home page

మూడు రోజులపాటు భారీ వర్షాలు

Published Sat, Jul 12 2014 7:00 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

మూడు రోజులపాటు భారీ వర్షాలు - Sakshi

మూడు రోజులపాటు భారీ వర్షాలు

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వచ్చే మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, మెదక్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణశాఖ హెచ్చరించింది.

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆ కారణంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ కేంద్రం వివరించింది. ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 24 గంటల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  భీమవరంలో అత్యధికంగా 14 సెంటీ మీటర్లు, తుని 11 సెం.మీ. మిగిలిన కోస్తాంధ్ర ప్రాంతాల్లో 5 సెం.మీ వర్షాపాతం నమోదైనట్లు  వాతావరణ శాఖ వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement