కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
Published Fri, Aug 25 2017 2:31 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM
విశాఖ: చత్తీస్‌గఢ్ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాలో తీరం వెంబడి 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మృత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
Advertisement
Advertisement