శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ఏఓపీ సరిహద్దులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల నుంచి పడుతున్న వర్షాలకు నాగావళి , వంశధార నదుల్లో నీటి మట్టం భారీగా పెరిగింది. గొట్టా బ్యారేజీ లో ప్రస్తుతం ఇన్ ఫ్లో 33 వేలుగా ఉంది. వరద నీరు పెరుగుతుండటంతో 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ ఇన్ ఫ్లో 70 వేలకు పెరిగే అవకాశం ఉంది.