ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో జిల్లాలోని పలు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అందులోభాగంగా గుండ్లకమ్మ రిజర్వాయిర్కు వరద నీరు పోటెత్తింది. దీంతో రిజర్వాయిర్లోని నాలుగు గేట్లను అధికారులు ఎత్తివేసి 13 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
మరో వైపు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఒంగోలు నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనాయి. నగరంలోని భాగ్యనగర్ కాలనీ, బలరాం కాలనీ, వెంకటేశ్వరకాలనీ, మధర్థెరిస్సా కాలనీలోని రహదారులపైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దాంతో సదరు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.