- మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు 330
- 138 సమస్యాత్మక, 104 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తింపు
విశాఖ రూరల్: ఏజెన్సీ, సబ్‌ప్లాన్ మండలాల్లో ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. రెండో దశ ఎన్నికలు మావోయిస్టు ప్రాంతాల్లో జరుగుతుండడంతో అధికారులు భారీగా భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు.
ఏజెన్సీలోని పాడేరు, ముంచింగిపుట్టు, జి.కె.వీధి, చింతపల్లి, డుంబ్రిగుడ, అనంతగిరి, అరకులోయ, కొయ్యూరు, హుకుంపేట, పెదబయలు, జి.మాడుగుల మండలాలతో పాటు ట్రైబల్ సబ్‌ప్లాన్ పరిధిలోని నాతవరం, గొలుగొండ, రోలుగుంట, రావికమతం, వి.మాడుగుల, దేవరాపల్లి మండలా ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. దేవరాపల్లి, వి.మాడుగులలో 24 సమస్యాత్మక, 25 అత్యంత సమస్యాత్మక, 13 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు.
నాతవరం, రావికమతం, రోలుగుంట, గొలుగొండలలో 60 సమస్యాత్మక, 76 అత్యంత సమస్యాత్మక, 5 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. పాడేరు డివిజన్‌లో 11 మండలాల్లో 54 సమస్యాత్మక, 3 అత్యంత సమస్యాత్మక, 312 మావోయిస్టు ప్రభావం గల ప్రాంతాలుగా నిర్ధారించారు. వీటితో పాటు రవాణా, రహదారులు లేని17 ప్రాంతాలను అధికారులు గుర్తించారు. పంచాయతీ ఎన్నికల్లో మావోయిస్టు ఆగడాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు.