హైదరాబాద్ : నవంబరు 1 నుంచి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకం తప్పనిసరని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. నేటి నుంచి హెల్మెట్ లేకుండా ప్రయాణించేవారికి జరిమానా విధించనుంది. మొదటిసారి జరిమానా వేయాలని, మరోసారి పట్టుబడితే వాహనం సీజ్ చేయాలని నిర్ణయించారు.ఇప్పటికే రెండు దఫాలుగా హెల్మెట్ వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా వివిధ కారణాలతో వాయిదా వేస్తూ వచ్చింది.
ఇక ఆదివారం నుంచి హెల్మెట్ వాడకం తప్పనిసరి కావడంతో హెల్మెట్ ధరలకు రెక్కలొచ్చాయి. ఉన్నట్టుండి హెల్మెట్ వ్యాపారులకు గిరాకీ పెరిగింది.
నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి
Published Sun, Nov 1 2015 7:31 AM | Last Updated on Sat, Jul 6 2019 1:10 PM
Advertisement