helmets compulsory
-
హైకోర్టు ఆదేశాలు: ఇక నుంచి హెల్మెట్ తప్పనిసరి
సాక్షి, చెన్నై: రాజధాని నగరం చెన్నైలో ట్రాఫిక్ నియమాలను అధికారులు కఠితరం చేశారు. దీంతో ఇకపై వాహనదారులు హెల్మెట్ ధరించకున్నా, ఓవర్ స్పీడ్‌తో ముందుకు సాగినా, ఓవర్ లోడ్‌తో రోడ్డెక్కినా, సీటు బెల్టు పెట్టుకోకున్నా ఫైన్ తప్పదు. ఈ మేరకు సోమవారం నుంచి నిబంధనల్ని కఠినంగా అమలు చేయనున్నారు. రాష్ట్రంలో ద్విచక్రవాహన దారులకు హెల్మెట్లను తప్పనిసరి చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. వాహన దారులు తప్పని సరిగా హెల్మెట్ వాడే విధంగా పోలీసులు సైతం కఠినంగా తొలినాళ్లలో వ్యవహరించారు. అయితే, 75 శాతం మంది హెల్మెట్లు వాడుతున్నా, 25 శాతం మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు అప్పట్లో నిర్వహించిన సర్వేలో తేలింది. అదే సమయంలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న వారు సైతం హెల్మెట్ ధరించాల్సిందేనని కోర్టు మరో ఉత్తర్వు ఇవ్వడంతో దానిని అమలు చేయడానికి తీవ్రంగా కుస్తీ పట్టక తప్పలేదు. ఈమేరకు ప్రజల్లో అవగాహన పెంపొందించే విధంగా కార్యక్రమాలతో పోలీసులు ముందుకు సాగారు. అయితే ఇదే సమయంలో కరోనా తెర మీదకు రావడంతో హెల్మెట్ సోదాలు గాల్లో కలిశాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ హెల్మెట్ వాడకంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. పెరిగిన ప్రమాదాలతో.. చెన్నైలో ఈ ఏడాది జనవరి నుంచి మే 15వ తేదీ వర కు వెయ్యికి పైగా ద్విచక్ర వాహన ప్రమాదాలు జరిగాయి. ఇందులో 98 మంది హెల్మెట్ ధరించక పోవడంతో మరణించినట్టు తేలింది. అలాగే, 841 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ప్రమాదాలపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కట్టడికి తగ్గ చర్యలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి రాజధాని నగరం చెన్నై కమిషనరేట్ పరిధిలో పోలీసులు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల భరతం పట్టనున్నారు. ఇద్దరూ ధరించాల్సిందే.. బైక్‌లో ఒకరు ప్రయాణించినా.. లేదా ఇద్దరు వెళ్లినా.. తప్పనిసరిగా హెల్మెట్ ఉపయోగించాల్సిందే. డ్రైవింగ్ చేసే వ్యక్తి హెల్మెట్ ధరించి, వెనుక సీట్లో కూర్చున్న వాళ్లు ధరించని పక్షంలో ఇద్దరికి కలిపి జరిమానా విధించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం చెన్నైలో 300కు పైగా ప్రాంతాల్ని గుర్తించి వాహన తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. ఇక, పోలీసులు సైతం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని లేనిపక్షంలో చర్యలు తప్పవనే హెచ్చరికలు జారీ అయ్యాయి. హెల్మెట్ ధరించకుండా తిరిగే వారి భరతం పట్టడమే కాకుండా, సీటు బెల్టు వాడని వారు, అతి వేగంగా వాహనాల్ని నడిపే వారితో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇది కూడా చదవండి: హెల్మెట్ రూల్స్ ఇకపై మరింత కఠినతరం.. అలా చేసినా జరిమానే! -
హెల్మెట్..హెల్మెట్..!
కరీంనగర్‌బిజినెస్: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మ్‌ట్ ధరించాలని గతంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా జిల్లాలో కొంత కాలమే అమలయ్యింది. పోలీసులు సైతం పలు మార్లు హెల్మెట్ నిబంధనలు అమలు చేస్తున్నా.. వాహనదారులు పెద్దగా స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు పోలీసులు హెల్మెట్ యాక్ట్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరిం చాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే హెల్మెట్ ధరించడంపై ప్రచారం చేపట్టారు. తల మీదే.. రక్షణ మీదే.. హెల్మెట్ ధరించడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ప్రమాదాలు జరిగినప్పుడు వాహనదారులకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా హెల్మెట్ ఉపయోగపడుతుంది. మెట్రో నగరాల్లో హెల్మెట్ వాడకం తప్పనిసరిగా ఉంటుంది. గతంలో కరీంనగర్లో పలుమార్లు అమలు చేసినా అది కొనసాగలేదు. కానీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కచ్చితంగా హెల్మెట్ వాడాలని కరీంనగర్ పోలీసు అధికారులు సూచిస్తున్నారు. ‘తల మీదే... రక్షణ మీదే...’ నినాదంతో విస్తృతంగా అవగాహన, ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. హెల్మెట్లకు ఫుల్ గిరాకీ... పోలీసులు ఫిబ్రవరి 1నుంచి హెల్మెట్ వాడకం తప్పనిసరని సూచించడంతో హెల్మెట్ లేని వాహనదారులు కొనుగోలు చేసే పనిలో పడ్డారు. కొంతమంది ఆన్లైన్లో వివిధ రకాల మోడల్స్ వెతుకుతుండగా, మరికొంత మంది నగరంలోని షాపుల్లో సరికొత్త మోడల్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నగరంలోని కమాన్, కోతిరాంపూర్తో పాటు వివిధ ప్రాంతాల్లోని ఆటోస్టోర్స్ దుకాణాలు సహా బస్టాండ్, కమాన్, తెలంగాణచౌక్, ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్, కోర్టురోడ్డు, ఎస్సారార్ కాలేజీ రోడ్, ఆర్టీసీ వర్క్‌షాప్ ప్రాంతాల్లో హెల్మెట్లు అమ్ముతున్నారు. అలాగే కరీంనగర్ నుంచి హైదరాబాద్ రోడ్, సిరిసిల్ల రోడ్, జగిత్యాల రోడ్డు, గోదావరిఖని రోడ్లలో ప్రత్యేకంగా ఫుట్‌పాత్ దుకాణాలు వెలిశాయి. శుక్రవారం నుంచి హెల్మెట్ యాక్టు అమలు చేస్తుండడంతో గత వారం రోజులుగా హెల్మెట్లకు గిరాకీ పెరిగిందని దుకాణాదారులు తెలిపారు. మునుపెన్నడూ లేనివి«ధంగా భారీగా హెల్మెట్ల అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం. సరికొత్త రకాల హెల్మెట్లు... నగరంలోని దుకాణాలు, ఫుట్‌పాత్ షాపుల్లో సాధారణ హెల్మెట్లతో పాటు స్పోర్ట్స్, షార్ట్ హెల్మెట్, ఓపెన్ పేస్ హెల్మెట్, ఫుల్‌ఫేస్ హెల్మెట్, ఫ్లిప్ అప్ హెల్మెట్ వంటి వివిధ రకాల హెల్మెట్లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు హెల్మెట్లు నాణ్యతను బట్టి రూ.350 నుంచి రూ.2000లకు పైగానే లభిస్తుందని వ్యాపారులు చెప్తున్నారు. ఐఎస్ఐ మార్క్‌తో పాటు నాణ్యమైన హెల్మెట్ వాడితేనే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఆన్లైన్లో కూడా కరీంనగర్ వాసులు చాలా మంది హెల్మెట్లను ఆర్డర్ చేస్తున్నారు. దాదాపు గత 15 రోజుల నుంచి సుమారు రూ.కోటి వరకు వ్యాపారం జరిగిందని అంచనా. ఈ నెల 1వ తేదీ నుంచి కరీంనగర్లో హెల్మెట్ యాక్టు అమలు చేస్తున్నాం. ప్రమాదానికి గురైనప్పుడు ద్విచక్ర వాహనదారులు కిందపడగా ముందుగా తలకే గాయాలవుతాయి. ఇలాంటి ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. తల మనదే... రక్షణ మనదే అన్న సంగతి మరువరాదు. -
హెల్మెట్ ఉంటేనే..బైక్‌పై రోడ్డెక్కాలి
‘‘ఖాకీ దుస్తుల్లో పోలీసులు బైకుపై వెళ్లాలంటే.. కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే. హెల్మెట్ లేకుండా రోడ్లపై కనిపించొద్దు’’ అన్న ఉన్నతాధికారుల ఆదేశాలను జిల్లా పోలీసులు పాటిస్తున్నారు. హెల్మెట్ లేకుండా బండిని రోడ్డెక్కించడానికి వెనుకాడుతున్నారు. బైక్‌పై దాదాపుగా తలకు హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్నారు.సాక్షి, కామారెడ్డి: హెల్మెట్ వాడకాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హెల్మెట్ ధరించకుండా బైక్‌లు నడిపేవారికి జరిమానాలు విధిస్తూ, కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయితే అందరికీ అవగాహన కల్పించడం, నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానాలు విధించేముందు మనం కూడా నిబంధనలు పాటించాల్సిందే అని, ఖా కీ దుస్తుల్లో బైక్‌పై వెళ్లేవారందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల తో జిల్లాలోని పోలీసులు హెల్మెట్ ధరిస్తున్నా రు. జిల్లా పోలీసు కార్యాలయానికిగాని, సబ్ డివిజనల్ కార్యాలయాలు, సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లకు, కోర్టు డ్యూటీలకు వెళ్లేవారుకాని, పెట్రోలింగ్ డ్యూటీలు చేసేవారు కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందేనని స్పష్టంగా పేర్కొనడంతో ఇటీవల చాలా మంది పోలీసు సిబ్బంది హెల్మెట్లు కొనుగోలు చేశారు. ప్రతిరోజు ఇంటి నుంచి వెళ్లేటపుడు కచ్చితంగా హెల్మెట్‌తోనే కనిపిస్తున్నారు. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో డీపీవోలో పనిచేసే సిబ్బంది, సబ్ డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది కూడా హెల్మెట్లు ధరిస్తున్నారు. ఎక్కడైనా హెల్మెట్ లేకుండా ఖాకీ దుస్తుల్లో పోలీసు కనిపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో అందరూ హెల్మెట్ వాడకానికి అలవాటు పడుతున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ హోంగార్డు తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మరణించాడు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాపాయం తప్పేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ హెల్మెట్ తప్పనిసరి చేశారు. హెల్మెట్ లేకుండా జిల్లా పోలీసు కార్యాలయ గేట్లోనికి అనుమతి కూడా ఇవ్వడం లేదు. ‘నో హెల్మెట్.. నో ఎంట్రీ’ అన్న బోర్డులు ఏర్పాటు చేశారు. హెల్మెట్ లేకుండా వెళ్లినపుడు ఏం జరిగినా అధికారుల నుంచి చివాట్లు తప్పవన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ను వాడుతున్నారు. మహిళా కానిస్టేబుళ్లు కూడా హెల్మెట్ ధరిస్తున్నారు. పోలీసులు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రజలకు ఆదర్శంగా ఉండవచ్చని, తద్వారా హెల్మెట్ ధరించమని ప్రజలకు చెప్పడానికి అవకాశం ఉంటుందని ఓ పోలీసు అధికారి తెలిపారు. పోలీసులందరూ హెల్మెట్ ధరిస్తూ ప్రజలు కూడా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు. -
నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి
హైదరాబాద్ : నవంబరు 1 నుంచి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకం తప్పనిసరని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. నేటి నుంచి హెల్మెట్ లేకుండా ప్రయాణించేవారికి జరిమానా విధించనుంది. మొదటిసారి జరిమానా వేయాలని, మరోసారి పట్టుబడితే వాహనం సీజ్ చేయాలని నిర్ణయించారు.ఇప్పటికే రెండు దఫాలుగా హెల్మెట్ వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా వివిధ కారణాలతో వాయిదా వేస్తూ వచ్చింది. ఇక ఆదివారం నుంచి హెల్మెట్ వాడకం తప్పనిసరి కావడంతో హెల్మెట్ ధరలకు రెక్కలొచ్చాయి. ఉన్నట్టుండి హెల్మెట్ వ్యాపారులకు గిరాకీ పెరిగింది. -
హెల్మెట్ ఉండాల్సిందే!
జూలై 1 నుంచి అన్ని పట్టణాల్లో అమలు పోలీసు, రవాణా శాఖకు ఆదేశాలు జిల్లాలో ద్విచక్ర వాహనాలు 3,75,000 కర్నూలు : ద్విచక్ర వాహనదారులు ఇకపై రోడ్డెక్కితే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. జూలై 1 నుంచి జిల్లాలోని అన్ని పట్టణాల్లో ఈ విధానం తప్పకుండా అమలు చేయాలని పోలీసు రవాణా శాఖలకు ఆదేశాలు అందాయి. రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు, రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంతో కలసి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో జాతీయ రహదారులు పట్టణాలు నగర పరిధిలో రోడ్డు ప్రమాదాలు పెరిగిన వైనం చర్చకు వచ్చింది. ప్రమాదాల్లో ద్విచక్ర వాహన దారుల మరణాల శాతాన్ని తగ్గితంచేందుకు జూలై 1 నుంచి హెల్మెట్ తప్పనిసరి చేయాలని డీజీపీ ఆదేశించారు. హెల్మెట్ వినియోగం ఆవశ్యకతపై తక్షణమే ప్రజల్లో ముమ్మర ప్రచారంతో చైతన్యం పెంపొందించేందుకు జిల్లా ట్రాఫిక్ పోలీసులు కార్యాచరణను రూపొందిస్తున్నారు. జిల్లాలో 3,75,000 ద్విచక్రవాహనాలు ఉన్నాయి. కర్నూలు కార్పొరేషన్‌తో పాటు ఆదోని, నంద్యాల, ఆత్మకూరు, డోన్, ఎమ్మిగనూరు మున్సిపల్ పట్టణాల్లో హెల్మెట్ రూల్ వచ్చేస్తుంది. దీనికి తోడు నెలలో 5 రోజులు పోలీసు, రెవెన్యూ శాఖ సంయుక్తంగా రోడ్డు భద్రతా తనిఖీలు చేపట్టనున్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పదేపదే దొరికితే లెసైన్స్ రద్దు తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే ఇప్పటివరకు జరిమానా, జైలుకు పంపుతున్నారు. ఇకపై పదేపదే ట్రాఫిక్ పోలీసులకు దొరికినవారి లెసైన్సులను రద్దు చేయాలని రవాణా శాఖ యోచిస్తోంది. నగరంలో ప్రతిరోజూ 20 నుంచి 40 మంది దాకా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్నారు. గత రెండేళ్లుగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు భారీగా నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నెల నుంచి ఇప్పటి వరకు 956 డ్రంకన్‌డ్రైవ్ కేసులు నమోదు కాగా, దాదాపు రూ. 11 లక్షల జరిమానా విధించారు. ఇప్పటికే వంద మందికి పైగా రెండు, మూడు రోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. ఎక్కువ భాగం ద్విచక్ర వాహనదారులే డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడుతున్నారు. జరిమానా, జైలు శిక్ష పడుతున్నా సరే పరిస్థితిలో ఆశించిన స్థాయిలో మార్పు కనిపించడం లేదు. దీంతో తొలుత డ్రైవింగ్ లెసైన్స్‌లు సస్పెండ్ చేయాలని అధికారులు భావి స్తున్నారు. ఒకసారి రద్దు చేసిన తర్వాత మళ్లీ పొందేందుకు వీలు కాదు. జీవితాంతం వాహనాలు నడిపే అర్హతను సదరు వ్యక్తి కోల్పోతాడు. -
మహిళలకు ‘హెల్మెట్’తప్పనిసరి చేయాలి
నోయిడా: ఢిల్లీలో ద్విచక్రవాహనదారులకు(మహిళలకు) హెల్మెట్లను తప్పనిసరి చేస్తూ ఇటీవల ఆ ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. ద్విచక్ర వాహనాన్ని నడిపే మహిళతోపాటు, వెనుక కూర్చున్న మహిళ కూడా హెల్మెట్ ధరించాల్సిందే. సిక్కు మహిళలకు మినహా మిగతా మహిళలకూ ఈ నిబంధన వర్తిస్తోంది. హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాన్ని నడిపితే జరిమానా విధిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇది ఎంతో దోహదపడుతోంది. కానీ నోయిడాల్లో ఇలాంటి చట్టాలు లేవు. హెల్మెట్ లేకుండా వెళ్లే ద్విచక్ర వాహనదారులకు కనీసం (మహిళలకు) జరిమానా విధించడానికి కూడా ఇష్టపడడం లేదు. మహిళా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మహిళలకు హెల్మెట్ తప్పనిసరి చేస్తూ చేసిన చట్టం ఢిల్లీలో సత్ఫలితాలు ఇవ్వడంతో ఇక్కడ కూడా అలాంటి చట్టాల్ని అమలు చేయాలని పట్టణ ప్రజలు కోరుకొంటున్నారు. అభిప్రాయాలు వారి మాటల్లోనే... హెల్మెట్ వాడడం తప్పనిసరి నోయిడా స్పెషల్ ఎకనామిక్ జోన్‌లోని ఓ పబ్లికేషన్‌లో పనిచేస్తున్న అగ్రిమా సింగ్ మాట్లాడుతూ..ఢిల్లీ ప్రభుత్వం మహిళా రైడర్స్‌కు హెల్మెట్ త ప్పని సరి చేయడంతో, అక్కడ హెల్మెట్ వినియోగం పెరిగింది. ఇంతకు ముందు హెల్మెట్ లేకుండానే వెళ్లేదాన్ని, ప్రమాదాల నివారణకు హెల్మెట్ తప్పని సరి అని తెలుసుకొన్నానన్నారు. వాహనదారులకు మేలు ఎంఎన్సీలో పనిచేస్తున్న జగృతి గుప్తా మాట్లాడుతూ.. హెల్మెట్ వాడడటం ద్విచక్రవాహనదారులకు సురక్షితంగా ఉంటుంది. హెల్మ్‌ట్ తప్పని సరి చేయకపోవడంతో ప్రమాదం జరిగినప్పుడు తలకు తీవ్ర గాయాలు అయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి ప్రాణాలు పోవచ్చు..వికలాంగులుగా మారే ప్రమాదం ఉంది. నోయిడాలో కూడా హెల్మెట్ వాడడాన్ని తప్పని సరి చేయాలని అన్నారు. నోయిడాలో అమలు చేయాలి మరికొందరు మహిళలు మాట్లాడుతూ..హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలపై వెళ్లే మహిళలను నోయిడా ట్రాఫిక్ సిబ్బంది నియంత్రించడం లేదంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా పట్టించుకోవడం లేదన్నారు. నోయిడాలో డిల్లీ ట్రాఫిక్ నిబంధనలు ఇక్కడ అమలు చేయడం లేదని కాలేజీ విద్యార్థిని అంకితాసింగ్ అన్నారు. గతవారం ఢిల్లీలో ద్విచక్ర వాహనంపై వెళ్లే మహిళలు హెల్మెట్‌ను తప్పకుండా వినియోగించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. సిక్కు మహిళలను మాత్రం మతప్రాదికన మినహాయించిందన్నారు. ఆదేశాలొస్తే.. ఇక్కడా అమలు చేస్తాం: ట్రాఫిక్ పోలీస్ అధికారి ట్రాఫిక్ పోలీసు అధికారి ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ..ఢిల్లీ ప్రభుత్వం హెల్మెట్ తప్పనిసరి చేస్తూ తీసుకొన్న నిర్ణయం కొత్తదేమీ కాదు. కానీ అక్కడ ప్రస్తుతం ట్రాఫిక్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నోయిడాలో అలాంటి ఆదేశాలు ఏమీ రాలేదు. మాకు ఉన్నతాధికారుల నుంచి వస్తే ఇక్కడ కూడా అమలు చేయడానికి వెనుకాడబోమని అన్నారు.