నోయిడా: ఢిల్లీలో ద్విచక్రవాహనదారులకు(మహిళలకు) హెల్మెట్లను తప్పనిసరి చేస్తూ ఇటీవల ఆ ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. ద్విచక్ర వాహనాన్ని నడిపే మహిళతోపాటు, వెనుక కూర్చున్న మహిళ కూడా హెల్మెట్ ధరించాల్సిందే. సిక్కు మహిళలకు మినహా మిగతా మహిళలకూ ఈ నిబంధన వర్తిస్తోంది. హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాన్ని నడిపితే జరిమానా విధిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇది ఎంతో దోహదపడుతోంది. కానీ నోయిడాల్లో ఇలాంటి చట్టాలు లేవు. హెల్మెట్ లేకుండా వెళ్లే ద్విచక్ర వాహనదారులకు కనీసం (మహిళలకు) జరిమానా విధించడానికి కూడా ఇష్టపడడం లేదు. మహిళా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మహిళలకు హెల్మెట్ తప్పనిసరి చేస్తూ చేసిన చట్టం ఢిల్లీలో సత్ఫలితాలు ఇవ్వడంతో ఇక్కడ కూడా అలాంటి చట్టాల్ని అమలు చేయాలని పట్టణ ప్రజలు కోరుకొంటున్నారు. అభిప్రాయాలు వారి మాటల్లోనే...
హెల్మెట్ వాడడం తప్పనిసరి
నోయిడా స్పెషల్ ఎకనామిక్ జోన్‌లోని ఓ పబ్లికేషన్‌లో పనిచేస్తున్న అగ్రిమా సింగ్ మాట్లాడుతూ..ఢిల్లీ ప్రభుత్వం మహిళా రైడర్స్‌కు హెల్మెట్ త ప్పని సరి చేయడంతో, అక్కడ హెల్మెట్ వినియోగం పెరిగింది. ఇంతకు ముందు హెల్మెట్ లేకుండానే వెళ్లేదాన్ని, ప్రమాదాల నివారణకు హెల్మెట్ తప్పని సరి అని తెలుసుకొన్నానన్నారు.
వాహనదారులకు మేలు
ఎంఎన్‌సీలో పనిచేస్తున్న జగృతి గుప్తా మాట్లాడుతూ.. హెల్మెట్ వాడడటం ద్విచక్రవాహనదారులకు సురక్షితంగా ఉంటుంది. హెల్మ్‌ట్ తప్పని సరి చేయకపోవడంతో ప్రమాదం జరిగినప్పుడు తలకు తీవ్ర గాయాలు అయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి ప్రాణాలు పోవచ్చు..వికలాంగులుగా మారే ప్రమాదం ఉంది. నోయిడాలో కూడా హెల్మెట్ వాడడాన్ని తప్పని సరి చేయాలని అన్నారు.
నోయిడాలో అమలు చేయాలి
మరికొందరు మహిళలు మాట్లాడుతూ..హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలపై వెళ్లే మహిళలను నోయిడా ట్రాఫిక్ సిబ్బంది నియంత్రించడం లేదంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా పట్టించుకోవడం లేదన్నారు. నోయిడాలో డిల్లీ ట్రాఫిక్ నిబంధనలు ఇక్కడ అమలు చేయడం లేదని కాలేజీ విద్యార్థిని అంకితాసింగ్ అన్నారు. గతవారం ఢిల్లీలో ద్విచక్ర వాహనంపై వెళ్లే మహిళలు హెల్మెట్‌ను తప్పకుండా వినియోగించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. సిక్కు మహిళలను మాత్రం మతప్రాదికన మినహాయించిందన్నారు.
ఆదేశాలొస్తే.. ఇక్కడా అమలు చేస్తాం: ట్రాఫిక్ పోలీస్ అధికారి
ట్రాఫిక్ పోలీసు అధికారి ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ..ఢిల్లీ ప్రభుత్వం హెల్మెట్ తప్పనిసరి చేస్తూ తీసుకొన్న నిర్ణయం కొత్తదేమీ కాదు. కానీ అక్కడ ప్రస్తుతం ట్రాఫిక్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నోయిడాలో అలాంటి ఆదేశాలు ఏమీ రాలేదు. మాకు ఉన్నతాధికారుల నుంచి వస్తే ఇక్కడ కూడా అమలు చేయడానికి వెనుకాడబోమని అన్నారు.
మహిళలకు ‘హెల్మెట్’తప్పనిసరి చేయాలి
Published Sun, Sep 14 2014 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM
Advertisement
Advertisement