సుదీర్ఘ పోరాటాల ఫలితం తెలంగాణ | Here the result of a long struggle | Sakshi
Sakshi News home page

సుదీర్ఘ పోరాటాల ఫలితం తెలంగాణ

Published Thu, Aug 15 2013 3:48 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

Here the result of a long struggle

ఎన్జీవోస్‌కాలనీ, న్యూస్‌లైన్ : సుదీర్ఘ పోరాటాలు... అనేక త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీడబ్ల్యూసీ, యూపీఏ నిర్ణయం తీసుకున్న క్రమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన సంఘాలు, జేఏసీలతో బుధవారం ఆయన ‘ఆత్మీయ పలకరింపు’ నిర్వహించారు. హన్మకొండలోని  అంబేద్కర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముందుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి పొన్నాల లక్ష్మయ్య అభినందనలు తెలిపారు.

అనంతరం మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన కుటుంబాలు, ఉద్యమంలో పాల్గొని ఇబ్బందులు చవిచూసిన ఉద్యోగులను మరవలేమని, వారిని అన్ని విధా లా ఆదుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. వారి శ్రేయస్సు కోసం అవసరమైతే పోరాటం చేసేందుకు తాను సిద్ధం గా ఉన్నానన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తానని, ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. ఎలాంటి సందేహాలు అక్కరలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం 2001లో 41 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసినప్పుడు తనపై కొందరు సందేహపడ్డారని తెలిపారు.

అయితే మొదట సంతకం చేసింది తనేనని.. తన తర్వాతే చిన్నారెడ్డి రెండో సంతకం చేశారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో తన వంతు కర్తవ్యంగా ప్రొఫెసర్ జయశంకర్‌ను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రణబ్‌ముఖర్జీని, సోనియాగాంధీని కలిపించి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిం పజేశానని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం జరిగిపోయిందని.. దాన్ని తిరగదోడే ది లేదని చెప్పారు. లక్ష్యానికి విఘాతం కలగకుండా సంయమనం పాటిద్ధామని పిలుపునిచ్చారు. కొనిశక్తుల ప్రమేయంతోనే సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం జరుగుతోందని, వారిది కృత్రిమ ఉద్యమం.. ఎంతోకాలం కొనసాగద న్నారు. ప్రపంచంలో తెలుగు వారికి ఎవరూ సాటిలేరన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా భాషా, సంస్కృతి పరంగా ఒక్కటిగా కలుసుం దామన్నారు. కాగా హన్మకొండ అమర వీరుల జంక్షన్ వద్ద తెలంగాణ అమరులకు, కాళోజీ, జయశంకర్ విగ్రహాలకు నివాళులర్పించారు.
 
కాంగ్రెస్‌పై సందేహాలున్నాయి :  పరిటాల సుబ్బారావు
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలపై అనేక సందేహాలున్నాయని ఉద్యోగ జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు అన్నారు. ఆత్మీయ పలకరింపులో పాల్గొన్న ఆయన పలు అంశాలను మంత్రి పొన్నాల దృష్టికి తీసుకొచ్చారు. కాంగ్రెస్‌లో ఎవరు ఎటు వెళతారో తెలియని పరిస్థితి ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన ఉద్యోగులు... ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో భాగంగా త్యాగాలు చేసిన కుటుంబాలను పట్టించుకోవడంపై అందరిలో సందేహాలున్నాయన్నారు.

ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందనే నమ్మకం లేదన్నారు. అందుకే ఉద్యమ పితామహుడు కేసీఆర్ వద్దకు తాము వెళుతున్నామన్నారు. ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులపై కేసులు ఇంకా నడుస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉద్యమకారులను కనిపెడుతూ ఉండాలనే  చారిత్రక కర్తవ్యం మంత్రిగా పొన్నాల లక్ష్మయ్యపై ఉందన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులను నమ్మొద్దని, శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టేలా చూడాలని సుబ్బారావు సూచించారు. అప్పుడే కాంగ్రెస్‌కు తిరుగుండదన్నారు. కార్యక్రమ అనంతరం మంత్రి పొన్నాల లక్ష్మయ్యను ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు, ఎంపీడీఓల సంఘం, విద్యార్థి జేఏసీ నాయకులు ఘనంగా సన్మానించారు.

ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, కాంగ్రెస్ నాయకులు రాజారపు ప్రతాప్, వరదరాజేశ్వర్‌రావు, ఈవీ శ్రీనివాస్‌రావు బత్తిని శ్రీనివాస్, రాజనాల శ్రీహరి, కరాబు రాజేశ్వర్‌రావు, మండల సమ్మయ్య, బుచ్చిరెడ్డి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్‌మోహన్‌రావు, మాజీ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్, టీఎన్జీవోస్ యూనియన్ నాయకులు కోల రాజేశ్‌కుమార్, రత్నవీరాచారి, ఈగ వెంకటేశ్వర్లు, నరేందర్, అమ్జద్ అలీ, సదానందం, ధరంసింగ్, శ్యాంసుందర్, ఎంపీడీఓల సంఘం నాయకులు వెంకటేశ్వర్‌రావు, పారిజాతం, రమాదేవి, డిప్లమా ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మహిపాల్‌రెడ్డి, పులి ప్రభాకర్, విద్యార్థి జేఏసీ నాయకులు వీరేందర్, దుప్పటి కిశోర్, కన్నం సునీల్, కుమార్, రంజిత్, విజయ్, మధుకర్, శ్రీనివాస్, రాజేందర్, రాజేష్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement