Special State
-
త్రిపుర ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్.. బీజేపీకి కొత్త సవాల్!
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గ్రేటర్ టిప్రాల్యాండ్ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం వేడెక్కుతోంది. ఒకప్పుడు త్రిపురని ఏలిన మాణిక్య వంశానికి చెందిన ప్రద్యోత్ మాణిక్య డెబ్బార్మాన్కు చెందిన టిప్రా మోతా పార్టీ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తోంది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేస్తున్న సంస్థలన్నీ కలిసి టిప్రా ఇండీజెనస్ ప్రోగ్రసివ్ రీజనల్ అలయెన్స్ (టిప్రా మోతా)గా ఏకతాటిపైకి వచ్చారు. ఇన్నాళ్లూ సామాజిక సంస్థగా ఉన్న ఈ కూటమి, రాజకీయ పార్టీగా రూపొంతరం చెందింది. అధికారంలోకి వస్తే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చిన వారితోనే తాము పొత్తు పెట్టుకుంటామని ప్రద్యోత్ తేల్చి చెబుతూ అధికార బీజేపీకి సవాల్ విసురుతున్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్న గిరిజనులు, స్థానిక తెగల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకి మద్దతుగా ఉంటూ గత రెండేళ్లలోనే ఢిల్లీ వేదికగా ప్రద్యోత్ ఎన్నో ధర్నాలు, ఉద్యమాలు చేశారు. గత వారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షాతో ప్రద్యోత్ నేతృత్వంలోని టిప్రా మోతా ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి చేసిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ప్రద్యోత్ తాము ఒంటరిపోరాటానికి సిద్ధమై 35 నుంచి 40 సీట్లలో పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్రం అంశం అత్యంత ప్రభావం చూపించబోతోంది. ఏమిటీ గ్రేటర్ టిప్రాల్యాండ్ ? 1949లో త్రిపురభారత దేశంలో విలీనం అవడానికి అంగీకరించింది. అప్పటికే తూర్పు బంగ్లాదేశ్ నుంచి త్రిపురలోకి భారీగా బెంగాలీల తాకిడి మొదలైంది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధం సమయంలో కూడా బెంగాలీ శరణార్థులు భారీగా వచ్చి చేరారు. ఫలితంగా స్థానికంగా నివసించే గిరిజనులు మైనార్టీలో పడిపోయారు. 1881లో 63.77శాతం ఉండే గిరిజనుల జనాభా 2011 నాటికి 31.80శాతానికి పడిపోయింది. 2011 నాటి భాషాపరమైన జనాభా లెక్కల ప్రకారం త్రిపుర మొత్తం జనాభా 36.74 లక్షలైతే, వారిలో బెంగాలీ మాతృభాష కలిగిన వారి సంఖ్య ఏకంగా 24.14 లక్షలు. స్థానిక ఆదివాసీల మాతృభాష కొక్»ొరాక్ మాట్లాడేవారు 8.87 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే బయట నుంచి వలస వచి్చన బెంగాలీలే వీరి కంటే మూడు రెట్లు ఎక్కువ. దాంతో స్థానికంగా ఉండేవారి హక్కులు, సంస్కృతి సంప్రదాయాలు, భూమిపై హక్కులు ప్రమాదంలో పడ్డాయి. దాంతో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ పుట్టింది. ఏయే ప్రాంతాలతో ప్రత్యేక రాష్ట్రం త్రిపురలో గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలన్నింటితో 1985లో త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డి్రస్టిక్ట్ కౌన్సిల్ (టీటీఏఏడీసీ) ఏర్పాటైంది. రాష్ట్ర వైశాల్యంలో మూడింట రెండువంతుల్లో విస్తరించింది. గిరిజన తెగల హక్కులు, సంస్కృతి కాపాడడం కోసం ఏర్పాటైన టీటీఏడీసీకి శాసన, కార్యనిర్వాహక అధికారాలున్నాయి. టీటీఏఏడీసీ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న డిమాండ్ ఉంది. ఎప్పట్నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్? 2000 సంవత్సరంలో ఏర్పాటైన ఇండిజెనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) పార్టీ తొలిసారిగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై గళమెత్తింది. రెండేళ్ల తర్వాత ఐపీఎఫ్టీ గిరిజనుల మరో పార్టీ త్రిపుర ఉపజాతి జ్యూబా సమితి(టీయూజేఎస్)లో విలీనమై నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ ట్విప్రా (ఐఎన్పీటీ)గా ఆవిర్భవించింది. వేర్పాటు వాద నాయకుడు బిజోయ్ కుమార్ హరంగ్ఖ్వల్ నేతృత్వం వహించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పెద్దగా ముందుకు వెళ్లకపోవడంతో 2009లో ఎన్సీ డెబ్రామా ఆధ్వర్యంలో మళ్లీ ఐపీఎఫ్టీను పునరుద్ధరించారు. ˘ ఎన్నికల్లో ప్రభావం ఎంత? మొత్తం 60 శాసనసభ స్థానాలున్న రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం ఆశిస్తున్న ఆదివాసీలు 20 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించగలరు. ఇప్పటివరకు ఐపీఎఫ్టీయే ఈ నియోజకవర్గాల్లో అత్యంత కీలకంగా ఉంది. త్రిపురలో అద్భుతమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుని రెండు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ఏలిన మాణిక్ సర్కార్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వివిధ స్థానిక పార్టీలతో జత కలిసింది. దీంతో ఈ ప్రాంతంలోని 20 స్థానాలకు గాను బీజేపీ 10సీట్లు, ఐపీటీఎఫ్ 8 ,, సీపీఐ(ఎం) రెండు స్థానాల్లోనూ గెలుపొందింది. మాణిక్ సర్కార్ ఓటమికి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను నిర్లక్ష్యం చేయడం కూడా ఒక కారణంగా మారింది. ఎన్నికలకు ముందు ప్రత్యేక రాష్ట్రం కోసం విస్తృతంగా ప్రచారం చేసిన ఐపీటీఎఫ్ ఎన్నికల తర్వాత అధికార బీజేపీలో చేరింది. ఆ పార్టీ నాయకుడు ఎన్సీ డెబర్మా మంత్రిగా కూడా పని చేసి 2022 జనవరి 1న కన్నుమూశారు. గిరిజన హక్కుల మండలి (టీటీఏఏడీసీ)కి 2021 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో టిప్రా మోతా పార్టీ 28 స్థానాల్లో పోటీ చేస్తే 18 నెగ్గింది. ప్రస్తుత అసెంబ్లీలో 36 స్థానాలతో ఉన్న అధికార బీజేపీ, 16 స్థానాలతో ప్రతిపక్ష పార్టీగా ఉన్న సీపీఐ(ఎం) ఉంటే, ఐపీటీఎఫ్ ఎనిమిది స్థానాలను నెగ్గింది. టిప్రా మోతా ఒంటరిపోరాటానికి సిద్ధమై అధికార బీజేపీకి వణుకు పుట్టిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాజధాని రాష్ట్ర పరిధిలోనిదే..
సాక్షి, అమరావతి: రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర పరిధిలోని విషయమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ మేరకు గురువారంనాడు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. రాజధాని విషయం తమ పరిధిలోనిది కాదని, రాష్ట్ర పరిధిలోనిదని కేంద్ర ప్రభుత్వం కూడా హైకోర్టుకు తన కౌంటర్లో చాలా స్పష్టంగా తెలిపిందని గుర్తుచేసింది. రాజధానితో సహా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను, ప్రణాళికలను సమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందని అందులో పేర్కొంది. ప్రత్యేక హోదా డిమాండ్‌ను విడిచిపెట్టలేదు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీని అమలుపరిచేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నామని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ను తాము విడిచిపెట్టలేదని, ప్రతీ సమావేశంలోనూ, పార్లమెంట్లో సందర్భం వచ్చినప్పుడల్లా ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నామని కోర్టుకు తెలిపింది. ప్రత్యేక హోదా పునర్విభజన చట్టంలో భాగంగా ఉందని, అది లేకుండా రాష్ట్ర విభజన పరిపూర్ణం కాదంది. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయంది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం భరించే వ్యయంలో 90 శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, మిగిలిన 10 శాతాన్ని కూడా వడ్డీ లేకుండా రాష్ట్రానికి రుణంగా ఇస్తుందని తెలిపింది. కేంద్ర నిధుల్లో ప్రాధాన్యత ఉంటుందని, ఎక్సైజ్ డ్యూటీ రాయితీలు, కస్టమ్స్, కార్పొరేట్, ఇన్కమ్ ట్యాక్స్‌లలో పలు మినహాయింపులు ఉంటాయని వివరించింది. ఇందుకోసమే ప్రత్యేక హోదా కోసం కేంద్రం వెంటపడుతూనే ఉన్నామని చెప్పింది. కార్యాలయాల తరలించరాదనడం న్యాయసమ్మతం కాదు.. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దుపై చట్టాలు అమల్లోకి వచ్చాయని, ఇవి అమల్లో ఉండగా కార్యాలయాలను ఎక్కడికీ తరలించరాదని పిటిషనర్ కోరడం న్యాయసమ్మతం కాదని తెలిపింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదానివ్వడంతో పాటు పునర్విభజన చట్టంలోని పలు నిబంధనలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన పోలూరి శ్రీనివాసరావు హైకోర్టులో 2018లో పిటిషన్ దాఖలు చేశారు. అమరావతిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఎక్కడికీ తరలించకుండా ఉత్తర్వులివ్వాలంటూ 2020లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల రాజధాని కేసుల విచారణ సందర్భంగా ఈ వ్యాజ్యం విచారణకు రాగా, కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కౌంటర్ వేసింది. ప్రభుత్వం తరఫున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.రామమనోహరరావు కౌంటర్ దాఖలు చేశారు. హైకోర్టు ప్రిన్సిపల్ సీటు, బెంచ్‌లు ఎక్కడ ఉండాలన్న విషయం పునర్విభజన చట్టం, వికేంద్రీకరణ చట్టంలో చాలా స్పష్టంగా ఉందన్నారు. ఈ అంశంపై మహారాష్ట్ర వర్సెస్ నారాయణ శ్యాంరాం పురాణిక్ కేసులో సుప్రీంకోర్టు 1982లో చాలా స్పష్టమైన తీర్పునిచ్చిందన్నారు. -
హోదా కోసం కదం తొక్కిన యువత
సాక్షి, కాకినాడ సిటీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ మంగళవారం పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు కాకినాడలో కదం తొక్కారు. ప్రత్యేక హోదా, విభజన సాధన సమితి ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. స్థానిక బాలాజీ చెరువు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ నినాదాలు చేస్తూ వారు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా వారు కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేశారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌ను , వైజాగ్ చెన్నై కారిడార్లను వెంటనే మొదలు పెట్టాలని, కేంద్ర ప్రభుత్వ రంగంలోనే కడప ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని, రామయ్యపట్నం పోర్టు కట్టాలని, పోలవరం ప్రాజెక్ట్‌ను వెంటనే పూర్తి చేయాలని వారు నినాదాలు చేశారు. మోదీ దేశ ప్రధానిగా వ్యహరించాలే తప్ప గుజరాత్ ప్రధానిగా వ్యవహరించడం తగదని ఆందోళనకారులు అన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన పొరపాట్ల వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పోయిందని పేర్కొన్నారు. అప్పట్లో చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి మొగ్గుచూపడం వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు రాకుండా పోవడానికి చంద్రబాబు నాయుడు నిర్ణయాలే కారణమంటూ పలువురు విమర్శించారు. జేఈఈ పరీక్షలు తెలుగు, తమిళంలో నిర్వహించకుండా గుజరాతీలో నిర్వహించడాన్ని మోదీ ఆయన అనుచరులు ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. గోదావరి నదీ జలాల మళ్లింపుపై వెంటనే అఖిల పక్షం వేయాలని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తు కోసం రాయితీతో కూడిన హోదా అవసరం హోదా, విభజన సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ యువత భవిష్యత్తు కోసం రాష్ట్రానికి రాయితీతో కూడిన హోదా అవసరమన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన బీజేపీ నాయకుడు అద్వానీ మారలేదా? తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదా, రైల్వే జోన్ సాధ్యం కాదన్న వారు రైల్వే జోన్ మంజూరు చేయలేదా? అని ఆయన గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడుగుతుంటే కేంద్ర నాయకులు సాధ్యం కాదని చెప్పడం సరికాదన్నారు. ‘ప్రధాని మోదీ, అమిత్‌షాలు గొప్ప అంటూ గుజరాతీ పాటలు పాడుకుంటుంటే వారి ఇష్టం. కానీ ఏపీకి వ్యతిరేకంగా బీజేపీ నేతలు మాట్లాడడం భావ్యం కాద’న్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. అనేక పథకాలు అమలు చేయాలి. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాలి, సహాయం చేయకపోగా ఈ ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందులు పెట్టడానికి కేంద్రం ప్రయత్నించడం సరికాదని శ్రీనివాస్ అన్నారు. సీఎం జగన్‌ను వెంటనే మోదీని ఢీకొనమని తాము అనబోమన్నారు. కొంత సమయం ఇవ్వండి. అప్పుడు కూడా కేంద్రం ఏపీపై కక్ష సాధింపులు మానకపోతే, అందరూ కలసి పోరాడదాం అని చలసాని శ్రీనివాస్ అన్నారు. ఉమ్మడి పోరాటానికి తాము మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. సమావేశానికి రాష్ట్ర విద్యార్థి యువజన నేతలు పి. బులిరాజు, పెంకే రవితేజ, సిద్ధార్థ సందీప్ చిట్టిబాబు, ఆసీఫ్ జాన్, భరత్ పాల్గొన్నారు. -
బంద్ పేరుతో విద్యార్థులకు పస్తులు
గొల్లప్రోలు (పిఠాపురం): ప్రత్యేక హోదా కోసం చేపట్టిన బంద్ విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం ఫలితంగా విద్యార్థులతో ఆకలి కేకలు వేయించింది. మండలంలోని 42 మండల పరిషత్ పాఠశాలలు, 7 జిల్లా పరిషత్ పాఠశాలల్లో శుక్రవారం మధ్యాహ్న భోజనం సరఫరా నిలిచిపోయింది. భోజనం సరఫరా చేసే అల్లూరి సీతారామరాజు ట్రస్ట్ బంద్ పేరుతో భోజనాన్ని సరఫరా చేయకపోవడంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. మండలంలో బంద్ ప్రభావం లేకపోవడంతో యథావిధిగా పాఠశాలలు పనిచేశాయి. విద్యార్థులు సైతం పాఠశాలలకు వచ్చారు. తీరా పాఠశాలకు వచ్చిన తరువాత మధ్యాహ్న భోజనం సరఫరా లేదని చెప్పడంతో విద్యార్థులు పస్తులతో ఉండాల్సి వచ్చింది. మండలంలోని 1 నుంచి 5వ తరగతి వరకు 2082 మంది, 6 నుంచి 8వ తరగతి వరకు 2145 మంది, హైస్కూల్ విద్యార్థులు 1656 మంది ఉన్నారు. వీరిలో 5 వేల మంది వరకు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. భోజనం సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. తాటిపర్తి, వన్నెపూడి, దుర్గాడ జెడ్పీ పాఠశాలలకు సమీపంలోని కొడవలి, చెందుర్తి, చినజగ్గంపేట, ఎ.విజయనగరం గ్రామాలకు చెందిన విద్యార్థులు సైకిళ్లు, ఆటోలపై వస్తున్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేద్దామనే ఉద్దేశంతో ఇంటి వద్ద నుంచి భోజనం తీసుకురాలేదు. తీరా భోజనం సరఫరా లేదని చెప్పడంతో ఉసూరుమంటూ ఆకలితో సాయంత్రం వరకు పాఠశాలలో కాలం వెళ్లదీశారు. ముందస్తు సమాచారం లేదు వాస్తవానికి బంద్, ఇతర సందర్భాల్లో ముందు రోజు పాఠశాలలకు భోజనం సరఫరా సమగ్ర సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. శుక్రవారం ఉదయం 10 గంటల వరకు భోజనం సరఫరా చేసే ట్రస్ట్ నుంచి గానీ, విద్యాశాఖాధికారుల నుంచి కానీ భోజనం సరఫరా నిలిపివేస్తున్నట్లు సమాచారం రాకపోవడం విశేషం. దీంతో విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకోలేదు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరఫరా చేయకపోవడంపై విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విద్యాశాఖాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే భోజనం సరఫరా అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపించారు. విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేదించాం పాఠశాలకు మధ్యాహ్న భోజనం సరఫరా నిలిపివేస్తున్నామనే సమాచారం ట్రస్ట్ నుంచి ఆలస్యంగా వచ్చింది. దీంతో పాఠశాలలకు కూడా సమాచారం ఆలస్యంగా అందింది. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. ట్రస్ట్ వారు డీఈఓ దగ్గర అనుమతి తీసుకున్నారు. – సలాది సుధాకర్, ఎంఈఓ, గొల్లప్రోలు -
స్పెషల్ సేట్
-
స్పెషల్ స్టేట్
-
సుదీర్ఘ పోరాటాల ఫలితం తెలంగాణ
ఎన్జీవోస్కాలనీ, న్యూస్‌లైన్ : సుదీర్ఘ పోరాటాలు... అనేక త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీడబ్ల్యూసీ, యూపీఏ నిర్ణయం తీసుకున్న క్రమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన సంఘాలు, జేఏసీలతో బుధవారం ఆయన ‘ఆత్మీయ పలకరింపు’ నిర్వహించారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ముందుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి పొన్నాల లక్ష్మయ్య అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన కుటుంబాలు, ఉద్యమంలో పాల్గొని ఇబ్బందులు చవిచూసిన ఉద్యోగులను మరవలేమని, వారిని అన్ని విధా లా ఆదుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. వారి శ్రేయస్సు కోసం అవసరమైతే పోరాటం చేసేందుకు తాను సిద్ధం గా ఉన్నానన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తానని, ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. ఎలాంటి సందేహాలు అక్కరలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం 2001లో 41 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసినప్పుడు తనపై కొందరు సందేహపడ్డారని తెలిపారు. అయితే మొదట సంతకం చేసింది తనేనని.. తన తర్వాతే చిన్నారెడ్డి రెండో సంతకం చేశారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో తన వంతు కర్తవ్యంగా ప్రొఫెసర్ జయశంకర్‌ను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రణబ్‌ముఖర్జీని, సోనియాగాంధీని కలిపించి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిం పజేశానని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం జరిగిపోయిందని.. దాన్ని తిరగదోడే ది లేదని చెప్పారు. లక్ష్యానికి విఘాతం కలగకుండా సంయమనం పాటిద్ధామని పిలుపునిచ్చారు. కొనిశక్తుల ప్రమేయంతోనే సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం జరుగుతోందని, వారిది కృత్రిమ ఉద్యమం.. ఎంతోకాలం కొనసాగద న్నారు. ప్రపంచంలో తెలుగు వారికి ఎవరూ సాటిలేరన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా భాషా, సంస్కృతి పరంగా ఒక్కటిగా కలుసుం దామన్నారు. కాగా హన్మకొండ అమర వీరుల జంక్షన్ వద్ద తెలంగాణ అమరులకు, కాళోజీ, జయశంకర్ విగ్రహాలకు నివాళులర్పించారు. కాంగ్రెస్‌పై సందేహాలున్నాయి : పరిటాల సుబ్బారావు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలపై అనేక సందేహాలున్నాయని ఉద్యోగ జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు అన్నారు. ఆత్మీయ పలకరింపులో పాల్గొన్న ఆయన పలు అంశాలను మంత్రి పొన్నాల దృష్టికి తీసుకొచ్చారు. కాంగ్రెస్‌లో ఎవరు ఎటు వెళతారో తెలియని పరిస్థితి ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన ఉద్యోగులు... ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో భాగంగా త్యాగాలు చేసిన కుటుంబాలను పట్టించుకోవడంపై అందరిలో సందేహాలున్నాయన్నారు. ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందనే నమ్మకం లేదన్నారు. అందుకే ఉద్యమ పితామహుడు కేసీఆర్ వద్దకు తాము వెళుతున్నామన్నారు. ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులపై కేసులు ఇంకా నడుస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉద్యమకారులను కనిపెడుతూ ఉండాలనే చారిత్రక కర్తవ్యం మంత్రిగా పొన్నాల లక్ష్మయ్యపై ఉందన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులను నమ్మొద్దని, శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టేలా చూడాలని సుబ్బారావు సూచించారు. అప్పుడే కాంగ్రెస్‌కు తిరుగుండదన్నారు. కార్యక్రమ అనంతరం మంత్రి పొన్నాల లక్ష్మయ్యను ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు, ఎంపీడీఓల సంఘం, విద్యార్థి జేఏసీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, కాంగ్రెస్ నాయకులు రాజారపు ప్రతాప్, వరదరాజేశ్వర్‌రావు, ఈవీ శ్రీనివాస్‌రావు బత్తిని శ్రీనివాస్, రాజనాల శ్రీహరి, కరాబు రాజేశ్వర్‌రావు, మండల సమ్మయ్య, బుచ్చిరెడ్డి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రావు, మాజీ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్, టీఎన్జీవోస్ యూనియన్ నాయకులు కోల రాజేశ్‌కుమార్, రత్నవీరాచారి, ఈగ వెంకటేశ్వర్లు, నరేందర్, అమ్జద్ అలీ, సదానందం, ధరంసింగ్, శ్యాంసుందర్, ఎంపీడీఓల సంఘం నాయకులు వెంకటేశ్వర్రావు, పారిజాతం, రమాదేవి, డిప్లమా ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మహిపాల్‌రెడ్డి, పులి ప్రభాకర్, విద్యార్థి జేఏసీ నాయకులు వీరేందర్, దుప్పటి కిశోర్, కన్నం సునీల్, కుమార్, రంజిత్, విజయ్, మధుకర్, శ్రీనివాస్, రాజేందర్, రాజేష్ పాల్గొన్నారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే ప్రత్యేక రాష్ట్రం:ఉండవల్లి