6న వికారాబాద్‌కు హైకోర్టు చీఫ్ జస్టిస్ | High court chief Justice visits to Vikarabad on 6 | Sakshi
Sakshi News home page

6న వికారాబాద్‌కు హైకోర్టు చీఫ్ జస్టిస్

Published Thu, Oct 3 2013 12:36 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM

High court chief Justice visits to Vikarabad on 6

వికారాబాద్, న్యూస్‌లైన్: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ జ్యోతిసేన్‌గుప్త ఈ నెల 6న వికారాబాద్‌కు రానున్నారు. దేశంలోని పలు రకాల చట్టాలపై జిల్లా న్యాయవాదులకు అవగాహన కల్పించేందుకు వికారాబాద్ సమీపంలోని అనంతగిరి హరిత రిసార్ట్‌లో వికారాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమినార్ ఏర్పాటు చేశారు. ఈ సెమినార్‌లో ప్రధాన న్యాయమూర్తితోపాటు హైకోర్టు న్యాయమూర్తులు ఎల్.నర్సింహారెడ్డి, సుభాష్‌రెడ్డి, కేసీ బాన్, రమేష్ రంగరాజన్‌లు పాల్గొని చట్టాలపై అవగాహన కల్పిస్తారని వికారాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకు ఉంటుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని న్యాయవాదులు హాజరుకావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement