మంత్రాలయం: కర్నూలు జిల్లా, మంత్రాలయం లోని శ్రీ రాఘవేంద్రస్వామిని హైకోర్టు జడ్జి సీతారామమూర్తి సోమవారం దర్శించుకున్నారు. ఉదయం మంత్రాలయం వచ్చిన ఆయన ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనంను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆయన వెంట అనంతపురం జిల్లా జడ్జి హరిహరనాథ్ శర్మ కూడా స్వామిని దర్శించుకున్నారు. శ్రీ మఠం పీఆర్వో వ్యాసరాజాచార్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
కాగా శ్రీమఠంలో ఈ రోజు ద్వాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రీ మఠం దివాన్ బండాచార్ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి రాఘవేంద్రస్వామికి సుప్పభాతసేవ, నిర్మల విసర్జన, సంస్థాన పూజ, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. బృందావన ప్రతిమను బంగారు పల్లకిలో ఊరేగించారు. సాయంత్రం ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులను చెక్క, వెండి, బంగారు రధోత్సవాలపై ఊరేగించనున్నారు. ద్వాదశి వేడుకల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
శ్రీమఠంలో హైకోర్టు న్యాయమూర్తి
Published Mon, Apr 4 2016 11:36 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 PM
Advertisement
Advertisement