Raghavendra Swami
-
రాఘవేంద్రుడి ఆశీస్సులతోనే...
ఆయన చుట్టూ మందీ మార్బలం లేరు.. ఎవరికీ ముందస్తు సమాచారం లేదు... సామాన్య భక్తుల్లో ఒకరిగా, సడన్‌గా మంగళవారం ఉదయం మంత్రాలయంలో ప్రత్యక్షమయ్యారు రజనీకాంత్. ఆయనకు రాఘవేంద్ర స్వామి అంటే ఎంత భక్తి అనేది అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడూ కర్నూల్లోని మంత్రాలయంలో గల ఆలయానికి వచ్చి రాఘవేంద్ర స్వామిని దర్శించుకుంటుంటారు రజనీ. మంగళవారం కూడా అలానే వచ్చి, తుంగభద్ర నదిలో పుణ్యస్నానం ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన రజనీకి స్వామివారి జ్ఞాపిక, శేష వస్త్రం, ప్రసాదాలు అంద జేశారు. మఠాధికారులు రజనీని పూర్ణకుంభంతో ఆహ్వానించారు. స్వామివారి కరుణాకటాక్షంతోనే సినిమా రంగంలో ఈ స్థాయికి చేరుకున్నాన ని రజనీ పేర్కొన్నారు. అన్నట్లు... రజనీ ‘శ్రీ రాఘవేంద్రర్’(తెలుగులో ‘శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం’)లో టైటిల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. -
శ్రీమఠంలో హైకోర్టు న్యాయమూర్తి
మంత్రాలయం: కర్నూలు జిల్లా, మంత్రాలయం లోని శ్రీ రాఘవేంద్రస్వామిని హైకోర్టు జడ్జి సీతారామమూర్తి సోమవారం దర్శించుకున్నారు. ఉదయం మంత్రాలయం వచ్చిన ఆయన ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనంను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆయన వెంట అనంతపురం జిల్లా జడ్జి హరిహరనాథ్ శర్మ కూడా స్వామిని దర్శించుకున్నారు. శ్రీ మఠం పీఆర్వో వ్యాసరాజాచార్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కాగా శ్రీమఠంలో ఈ రోజు ద్వాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రీ మఠం దివాన్ బండాచార్ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి రాఘవేంద్రస్వామికి సుప్పభాతసేవ, నిర్మల విసర్జన, సంస్థాన పూజ, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. బృందావన ప్రతిమను బంగారు పల్లకిలో ఊరేగించారు. సాయంత్రం ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులను చెక్క, వెండి, బంగారు రధోత్సవాలపై ఊరేగించనున్నారు. ద్వాదశి వేడుకల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. -
రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నకీరవాణి
మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామిని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి బుధవారం ఉదయం వచ్చిన కీరవాణి ముందుగా గ్రామదేవత మాంచాలమ్మ దర్శనం చేసుకుని అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావనం దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వారికి ఆలయ సహాయక ప్రజా సంబంధాల అధికారి స్వాగతం పలికారు. -
రాఘవేంద్ర స్వామి సేవలో స్పీకర్ మధుసూదనాచారి
కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామిని సోమవారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి దర్శించుకున్నారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, కర్నాటక రాష్ట్రం కడూరు వై.ఎస్.వి దత్త, కర్నూలు డీఐజీ రమణకుమార్, జార్ఖండ్ ఎస్పీ రమేష్ వేర్వేరు సమాయాల్లో మంత్రాలయం వచ్చారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకున్నారు. అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూలబృందావనంను దర్శించుకున్నారు. వీరికి శ్రీ మఠం పీఠాధిపతి ఆశీర్వాచనం అందజేశారు. -
రాఘవేంద్రునికి తితిదే పట్టువస్త్రాలు
మంత్రాలయం: తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) తరపున ఆలయ అధికారులు మంత్రాలయ రాఘవేంద్రస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సోమవారం ఉదయం పట్టువస్త్రాలు తీసుకువచ్చిన ఈవో సాంబశివరావుకు శ్రీ పీఠం అధిపతి శ్రీసుబుధేంద్ర స్వామి ఘనంగా స్వాగతం పలికారు. ఏటా జరిగే సప్తరాత్రోత్సవాల సందర్భంగా మధ్యారాధన రోజున తితిదే పట్టువస్త్రాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు తితిదే అధికారులు పట్టు వస్ర్తాలు అందజేశారు. -
శ్రీ రాఘవేంద్రుల సప్తరాత్రోత్సవాలు
మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రాఘవేంద్రస్వామి ఆలయంలో ఏడురోజుల పాటు సప్తరాత్రోత్సవాలను నిర్వహించనున్నట్టు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తెలిపారు. శుక్రవారం నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించన్నునారు. ఆగస్టు 31న మధ్యారాధన సందర్భంగా టీటీడీ పట్టువస్త్రాల సమర్పణ, మహా పంచామృతాభిషేకం, రజత, స్వర్ణ, నవరత్న రథోత్సవాలు జరుపుతారు. సెప్టెంబర్ 1న ఉత్తరారాధన సందర్భంగా మహా రథోత్సవం సంస్కృత పాఠశాల వరకు ఉత్సవ మూర్తి ప్రహాల్లాదరాయుల ఊరేగింపు నిర్వహిస్తారు. -
రాఘవేంద్రుని సన్నిధిలో ఆర్బీఐ జీఎం
మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామిని ఆర్బీఐ జనరల్ మేనేజర్ విజయసింగ్ షెకావత్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం మంత్రాలయం చేరుకున్నారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆర్బీఐ ఇంచార్జీ ఆర్ఎన్. దాసు స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా గ్రామదేవత మాంచాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బృందావనం చేరుకొని రాఘవేంద్రస్వామి పూజలు నిర్వహించారు. వీరికి శ్రీమఠం ఫిఠాదిపతి సుభుదేంద్రతీర్థులు ఫలమంత్ర అక్షింతలు సమర్చించారు. -
జోరు తగ్గని సమైక్య పోరు
తిరుపతి, న్యూస్‌లైన్ : జిల్లాలో సమైక్య పోరు ఉధృతమవుతోంది. 93 రోజులైనా ఎన్జీవోలు, వైఎస్సార్సీపీ శ్రేణులు, విద్యార్థులు పట్టువదలని విక్రమార్కుల్లా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించారు. గురువారం తిరుపతి తుడా సర్కిల్లో వైఎస్సార్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు స్థానిక సత్యనారాయణపురానికి చెందిన కార్యకర్తలు హాజర య్యారు. ఎమ్మెల్యే కరుణాక రరెడ్డి వారికి సంఘీభావం ప్రకటించి, కొంత సేపు దీక్షలో కూర్చున్నారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు రిలే దీక్షలు కొనసాగించారు. పుంగనూరులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, సమైక్యవాదులు ఎన్టీఆర్ సర్కిల్లో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. రవీంద్రభారతి స్కూల్ విద్యార్థులు మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. వీఆర్వో మురళి రాఘవేంద్రస్వామి అవతారంలో నిరసన తెలిపారు. సమైక్యవాదులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. చిత్తూరులో ఎన్జీవోలు మధ్నాహ్నం భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మదనపల్లెలో జ్ఞానోదయ స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ జేఏసీ, మిట్స్‌తో కలసి మల్లికార్జున సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేశారు. పుత్తూరులో వెంకటేశ్వర ఐటీఐ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ సర్కిల్లో ధర్నా చేపట్టారు.