పాలకొల్లు సెంట్రల్ (పశ్చిమగోదావరి జిల్లా) :పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయానికి హైకోర్టు జడ్జి బి.వ్యాఘ్రేశ్వర శివశంకర శర్మ సోమవారం విచ్చేశారు. క్షీరా రామలింగేశ్వరునికి, జనార్దనస్వామికి, లక్ష్మి, పార్వతి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ రెడ్డి నరసింహమూర్తి, ఈవో యర్రంశెట్టి భద్రాజీలు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.