సుమన్ రాథోడ్కు హైకోర్టులో చుక్కెదురు | high court rejects suman rathod plea | Sakshi
Sakshi News home page

సుమన్ రాథోడ్కు హైకోర్టులో చుక్కెదురు

Published Tue, Dec 24 2013 6:17 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

సుమన్ రాథోడ్కు హైకోర్టులో చుక్కెదురు - Sakshi

సుమన్ రాథోడ్కు హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ టీడీపీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆమె ఎస్టీ కాదని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. ఈ వ్యవహారంలో కలెక్టర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుమన్ రాథోడ్ దాఖలు చేసిన పిటీషన్ను కోర్టు కొట్టివేసింది. ఆమె గిరిజనుల కోటాలో ఎన్నికయ్యారని ఆ ఎన్నికను సవాలుచేస్తూ కోర్టులో పిటీషన్‌ దాఖలు కావటంతో కోర్టు ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ చేసిన ప్రభుత్వం ఆమె మహారాష్ట్ర లంబాడాలకు చెందినవారని అక్కడ ఆ కులం బీసీల కిందకు వస్తుందని తెలిపింది. దీంతో విచారించిన హైకోర్టు..ఆమె ఎస్టీ కాదని తేల్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement