Suman Rathod
-
ఇంకా వారు ‘దేశం’లోనేనా..!
రాష్ట్రానికి హైటెక్ హంగులు తెచ్చింది తానేనని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకోని రోజు లేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా ఏకంగా దేశంలోనే సమాచార, సాంకేతిక విప్లవానికి తానే కారణమని అప్పుడు ఇప్పుడని లేకుండా నేటికీ డబ్బా కొట్టుకుంటూనే ఉన్నారు. కానీ హైటెక్ బాబు సొంత పార్టీ కార్యాలయంలోనే తెగులు పట్టిస్తున్నారు. టీడీపీ అధికారిక వెబ్సైట్ ‘్ట్ఛఠజఠఛ్ఛీట్చఝ.ౌటజ’ లో టీడీపీ లీడర్స్ అనే ఆప్షన్‌లోకి వెళితే పార్టీకి చెందిన చట్టసభ సభ్యులు, పార్టీ ముఖ్యనేతల వివరాలుంటాయి. పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా ఆయా పార్టీల తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న వారు కూడా పసుపు కండువాలతో పార్టీ వెబ్సైట్లో దర్శనమివ్వడం గమనార్హం. రెండు నెలల క్రితమే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నందమూరి హరికృష్ణ పేరు కూడా జాబితాలో ఫొటోసహా ఉంది. 2009లో టీడీపీ తెలంగాణ ప్రాంతంలో గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో 19 మంది వేరే పార్టీల తీర్థం తీసేసుకున్నారు. పార్టీలో మిగిలింది 21 మందే! కానీ టీడీపీ వెబ్సైట్లో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు చూపుతోంది. టీఆర్ఎస్ నుంచి పోటీచేస్తున్న సుమన్ రాథోడ్ టీడీపీ ఖానాపూర్ ఎమ్మెల్యేనని జాబితాలో ఉంది. రెండు నెలల క్రిత మే టీఆర్ఎస్లో చేరిన బోథ్ ఎమ్మెల్యే గోడం న గేష్, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య, టీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న మైనంపల్లి హన్మంతరావు, కె. ఎస్ రత్నం, పి మహేందర్ రెడ్డి, ఎల్కోటి ఎల్లారెడ్డి, జి. జైపాల్ యాదవ్, సత్యవతిరాథోడ్, ఊకే అబ్బయ్యలను టీడీపీ ఎమ్మెల్యేలుగానే వెబ్సైట్లో పేర్కొంటున్నారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ పౌరులకు చెవిలో పువ్వు పెట్టేందుకో, లేక ఆ పార్టీ ఐటీ శాఖ నిద్రాణంలో ఉందో.. -న్యూస్‌లైన్, హైదరాబాద్ -
సుమన్ రాథోడ్‌కు చుక్కెదురు
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్ ఎస్టీ వివాదంపై హైకోర్టు ఇచ్చిన స్టేను మంగళవారం ఎత్తివేసింది. ఎస్టీ కాదంటూ అప్పటి జిల్లా కలెక్టర్ అహ్మద్ నదీం ఇచ్చిన తీర్పుపై సుమన్ రాథోడ్ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్న విషయం విధితమే. 2009 సాధారణ ఎన్నికల్లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన సుమన్‌రాథోడ్ ఎస్టీ కాదంటూ అప్పటి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు ఉయికే సంజీ వ్తోపాటు పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటి కలెక్టర్ నదీం విచారణ చేపట్టి ఆమె మహారాష్ట్రలోని బీసీ కులానికి చెందిన మహిళ అని 2009 అక్టోబర్‌లో తీర్పునిచ్చారు. కలెక్టర్ తీర్పును సవాలు చేస్తూ సుమన్‌రాథోడ్ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఇదే సమయంలో 2009 ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ అభ్యర్థి అజ్మిరా హరినాయక్ హైకోర్టులో కేసు వేయడంతో 2010 డిసెంబర్లో సుమన్‌రాథోడ్ ఎస్టీ కాదంటూ తీర్పు వెలువడింది. పైకోర్టుకు అప్పీ లు చేసుకునే అవకాశం కల్పించడంతో అదే నెలలో సుమన్‌రాథోడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం 2012 సెప్టెం బర్లో కేసును పూర్తి స్థాయిలో విచారణ జరపాలని విస్తృత ధర్మాసనం త్రిసభ్య కమిటీకి అప్పగించింది. అయితే మంగళవారం 2009 అక్టోబర్‌లో అప్పటి కలెక్టర్ అహ్మద్ నదీం ఇచ్చిన తీర్పుపై విధించిన స్టేను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. అయితే సుప్రీంకోర్టులో కేసు యథావిధిగా ఉంది. అత్యున్నత న్యాయస్థానంపై నమ్మకం ఉంది.. - సుమన్‌రాథోడ్ మంగళవారం సాయంత్రం సుమన్‌రాథోడ్ తన నివాసం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తనపై ఉన్న ఎస్టీ కాదనే వివాదంపై కలెక్టర్ ఇచ్చిన తీర్పుకు సంబంధించిన స్టేను మాత్రమే హైకోర్టు రద్దు చేసిందని సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. -
సుమన్ రాథోడ్ఎస్టీ కాదు: హైకోర్టు
-
సుమన్ రాథోడ్‌కు హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ టీడీపీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆమె ఎస్టీ కాదని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. ఈ వ్యవహారంలో కలెక్టర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుమన్ రాథోడ్ దాఖలు చేసిన పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఆమె గిరిజనుల కోటాలో ఎన్నికయ్యారని ఆ ఎన్నికను సవాలుచేస్తూ కోర్టులో పిటీషన్ దాఖలు కావటంతో కోర్టు ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ చేసిన ప్రభుత్వం ఆమె మహారాష్ట్ర లంబాడాలకు చెందినవారని అక్కడ ఆ కులం బీసీల కిందకు వస్తుందని తెలిపింది. దీంతో విచారించిన హైకోర్టు..ఆమె ఎస్టీ కాదని తేల్చింది. -
ఘనంగా కొమురం భీమ్ వర్ధంతి
ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ : మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయ ప్రాంగణంలో ఉన్న కొమురం భీమ్ విగ్రహం మంగళవారం ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కేస్లాపూర్ కొమురం భీమ్ కమిటీ, సర్పంచ్ మెస్రం నాగ్నాథ్ ఆధ్వర్యంలో 73వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్, ఉట్నూర్ ఏఎస్పీ అంబర్‌కిశోర్‌ఝాలకు కేస్లాపూర్ గిరిజనులు ఘన స్వాగతం పలికారు. ముందుగా నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, అనంతరం భీమ్ వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు. భీమ్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దర్బార్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ మాట్లాడుతూ, గిరిజన యువత ఐక్యంగా ఉండి కొమురం భీమ్ ఆశయ సాధనకు కృషి చేయూలన్నారు. కాగా, గిరిజన గ్రామాల అభివృద్ధికి సబ్‌ప్లాన్ నిధుల విడుదల కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అవి వస్తే గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు. ఈ సందదర్భంగా గిరిజన నాయకులు సిడాం భీమ్రావ్, కనక తుకారం, కనక లక్కేరావ్ గిరిజన గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, పోలీసు శాఖలో ప్రభుత్వం విడుదల చేస్తున్న ఐఏపీ నిధులతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయూలని ఏఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన.. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అలాగే గిరిజన యువకులు శాంతిభద్రతల విషయంలో పోలీసులకు సహకరించాలని కోరారు. రాయిసెంటర్ జిల్లా మెడి మెస్రం దుర్గు, మాజీ ఎంపీపీ కనక తుకారం, టీఆర్ఎస్ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యాదర్శి కనక లక్కేరావ్, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు దీపక్‌సింగ్ షెకావత్, జాతీయ మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆత్రం భుజంగ్‌రావ్, పీఆర్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ రాథోడ్, కేస్లాపూర్ సర్పంచ్ మెస్రం నాగ్నాథ్, కేస్లాపూర్ గ్రామపటేల్ మెస్రం వెంకట్రావ్, ఐటీడీఏ మాజీ చైర్మన్ సిడాం భీమ్రావ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మీర్జా యూకూబ్‌బేగ్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకుడు మధు, మాజీ ఎంపీటీసీ కినక జంగు, ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకట్రావ్, అర్క ఖమ్ము పాల్గొన్నారు. గిరిరాజులుగా బతకాలి ఆదివాసీ గిరిజనులుగా కాకుండా గిరి రాజులుగా సమాజంలో గర్వంగా బతకాలని ఏఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా అన్నారు. కేస్లాపూర్లో భీమ్ వర్ధంతి కార్యక్రమానికి ముందుగా గిరిజనులు, గిరిజన నాయకులతో సమావేశమయ్యారు. గిరిజనుల కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.