
'తెలంగాణ సర్కారుకు సుప్రీం మంచి సందేశమిచ్చింది'
హైదరాబాద్:స్థానికతపై తెలంగాణ సర్కారుకు దేశ అత్యున్నత న్యాయస్థాయం సుప్రీంకోర్టు మంచి సందేశాన్నే ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.తెలంగాణ సర్కారు చెప్పినట్లు 1956 స్థానికతను అమలు చేస్తే ఆ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ వాళ్లు కాకుండా పోతారని ఆయన తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి రాజ్యాంగ విరుద్దమని గంటా తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన గంటా.. కౌన్సిలింగ్ పై సుప్రీం తీర్పును తెలంగాణ ప్రభుత్వం గౌరవించాలన్నారు.