హైవే కిల్లర్స్ ఘాతుకం | Highway Killers murder attemt | Sakshi
Sakshi News home page

హైవే కిల్లర్స్ ఘాతుకం

Published Sun, Jun 7 2015 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM

హైవే కిల్లర్స్ ఘాతుకం

హైవే కిల్లర్స్ ఘాతుకం

 కావలి : చెన్నై నుంచి హైదరాబాద్‌కు స్టీల్ సామాన్లతో వెళ్తున్న లారీని కొందరు దుండగులు హైజాక్ చేశారు. ఆ లారీ డ్రైవర్‌ను గొంతు కోసి హత్య చేసి క్యాబిన్‌లోనే పడేశారు.  హైజాక్‌కు గురైన లారీని, దుండగులను పోలీ సులు శనివారం గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల సమాచారం మేరకు.. కావలి, ప్రకాశం జిల్లా పోలీసుల కథనం మేరకు..  చెన్నె నుంచి హైదరాబాద్‌కు స్టీల్ సామానులతో లారీ లోడ్లు ప్రతి రోజూ బయలు దేరుతాయి.

శరవణన్ ట్రావెల్స్‌కు చెందిన ఓ లారీ 4వ తేదీ రాత్రి సామానులతో బయలుదేరింది. ఆ లారీకి దొరవారిసత్రం మండలం ఏకొల్లుకు చెందిన బండిళ్ల దయాసాగర్ (48) డ్రైవర్‌గా వెళుతున్నాడు. మార్గమధ్యలో దయాసాగర్ ఇంటికి వెళ్లి కొద్దిసేపు గడిపి హైదరాబాద్‌కు బయలు దేరాడు. 5వ తేదీ రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరాల్సి ఉంది. కానీ లారీ చేరలేదు. ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద చెన్నై వైపు అదే కంపెనీకి చెందిన మరో లారీ శనివారం ఉదయం వెళుతుంది.

అదే సమయంలో హైదరాబాద్‌కు వెళ్లాల్సిన లారీ తన లారీని క్రాస్‌చేసిపోవడంతో అనుమానం వచ్చిన ఆ లారీ డ్రైవర్ దయాసాగర్‌కు ఫోన్ చేశాడు. అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ ట్రావెల్స్ మేనేజర్ గురువేంద్రకు ఫోన్ చేసి చెప్పాడు. అతను ప్రకాశం, నెల్లూరు జిల్లాల పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు జాతీయ రహదారిపై గాలింపు చర్యలు చేపట్టారు. హైజాక్‌కు గురైన లారీ కావలి వరకు వెళ్లి తిరిగి చాగల్లు వద్ద ఉన్న ఓ డాబా వద్ద ఆగి ఉంది.

కావలి ఒకటో పట్టణ సీఐ వెంకట్రావు, ఇతర సిబ్బంది ఆ లారీని గుర్తించారు. లారీలో పరిశీలించగా క్యాబిన్‌లో డ్రైవర్ దయాసాగర్‌ను గొంతు కోసి హత్య చేసినట్లు గుర్తించా రు. క్యాబిన్‌లో రక్త గాయాలు, రక్తం అంటిన బ్లేడ్లు కనిపించాయి. ఆ లారీని ఎవరు ఆపారని స్థానికంగా విచారించగా పక్కనే ఉన్న ఓ మద్యం దుకాణం పక్కన ఖాళీ స్థలంలో మద్యం సేవిస్తున్న ముగ్గురిని స్థానికులు చూపించినట్లు తెలుస్తుంది. దీంతో వారిని సీఐ వెంకట్రావు అదుపులోకి తీసుకుని కందుకూరు పోలీసులకు అప్పగించారు. ముగ్గురిని ప్రకాశం జిల్లా ఉలవపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

ఈ విషయం తెలిసిన వెంటనే లారీ ట్రావెల్స్ మేనేజర్  గురువేంద్ర సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏడాది క్రితమే కుమార్తెకు వివాహం చేశాడు. కందుకూరు, కావలి సీఐలు లక్ష్మణ్, వెంకటరావు, కందుకూరు ఎస్సై రమణయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ లారీలు వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణవిగా తెలుస్తుంది.   

 తమిళనాడు ముఠా పనే
 ఈ సంఘటకు పాల్పడింది తమిళనాడుకు చెందిన ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. అదుపులో తీసుకున్న వారిలో కళవరమూర్తి, మణివన్నన్, మణిగా పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో వీరు ఇలాగే లారీలను హైజాక్ చేసినట్లు పోలీసులు అనుమానంతో విచారిస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement