రాజమండ్రి సిటీ :‘హుదూద్’తుపాను ప్రభావంతో ఆదివారం జిల్లాలో రవాణా వ్యవస్థ అగమ్యగోచరంగా మార నుంది. దూర ప్రాంతాలకు వివిధ పనుల కోసం వెళ్లేందుకు రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికుల పరిస్థితి అర్థం కాకుండా ఉంది. తుపాను హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా రాజమండ్రి మీదుగా వెళ్లాల్సిన 23 రైళ్లు, రాజమండ్రి నుంచి బయలు దేరి విశాఖపట్నం-7, ఇచ్చాపురం- 2 వెళ్లే బస్సులను ఆదివారం సాయంత్రం వరకూ రద్దు చేస్తున్నట్టు ఆర్టీసీ ఆర్‌ఎం రమాకాంత్ ప్రకటించారు. దీంతో సుమారు 500 మంది విశాఖపట్నం వెళ్లే అవకాశం లేకుండా పోయింది. బస్సుల రద్దుతో రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికులు అవ స్థలు పడ్డారు.
తుపాను ప్రభావం జిల్లా వ్యాప్తంగా ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మారనుంది. జాతీయ రహదారిపై వాహనాలు రద్దు చేసినట్టయితే రాజమండ్రికి జిల్లా వ్యాప్తంగా తరలివచ్చే పలు రకాల వస్తువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడనుంది. ఆదివారం ప్రయాణం చేసేందుకు దాదాపు 60 రోజుల క్రితం నుంచి కష్టపడి చేయించుకున్న రిజర్వేషన్లు తుపాను ప్రభావంతో రైళ్లు రద్దు కావడం ప్రయాణికులు నిరాశలో ఉన్నారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని పరిగణించిన రైల్వే శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. రాజమండ్రి మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్లను ఖరగ్‌ఫూర్, నాగపూర్ మీదుగా దారి మళ్లించారు.
పలురైళ్ల దారి మళ్లింపు
తుపాను ప్రభావంతో ఆదివారం రాజమండ్రి మీదుగా న డవాల్సిన పలు రైళ్లను నాగపూర్, ఖరగ్‌పూర్‌ల మీదుగా దారి మళ్లించారు. రాజమండ్రి మీదుగా నడవబోవని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. 12863 హౌరా-యశ్వంతపూర్ ,18047 అమరావతి ఎక్స్‌ప్రెస్, 12839 హౌరా-చెన్నై (మెయిల్), 15902 డిబ్రుఘర్-యశ్వంతపూర్, 12704 ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్, 12703 ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్, 12245 దురంతో హౌరా-యశ్వంతపూర్,18645 హౌరా-హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు.
ప్రత్యేక కౌంటర్లు, హెల్ప్‌లైన్ ఏర్పాటు
ఆదివారం ైరె ళ్ల రద్దు, దారి మళ్లింపు కార ణంగా ప్రయాణికులకు టికెట్ సొమ్ము తిరిగి చెల్లించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు స్టేషన్ మేనేజర్ భమిడిపాటి సుబ్రమణ్యశాస్త్రి తెలిపారు. 0883 -2420543, 0883 02420541,088302420790 ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగ పరుచుకోవాలన్నారు. ఈమేరకు రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
పర్యాటక బోట్లు రద్దు
తుఫాన్ హెచ్చరిక ల నేపథ్యంలో ఆదివారం పాపికొండలు తరలివెళ్లే పర్యాటక బోట్లు, లాంచీలను రద్దు చేయాలని బోటు యజమానులకు ముందుగానే ఆదేశాలు జారీ చేశామని ధవళేశ్వరం బోటు సూపరింటెండెంట్ ప్రసన్నకుమార్ తెలిపారు. తొలుత ఆదివారం మాత్రమే రద్దు చేశామని, తుపాను ప్రభావాన్ని బట్టి తదుపరి చర్యలు చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు.
ఆదివారం రద్దయిన రైళ్ల వివరాలు...
18463 భువనేశ్వర్ - బెంగుళూరు(ప్రశాంతి), 12845 భువనేశ్వర్ -యశ్వంతపూర్, 17015 భువనేశ్వర్-సికింద్రాబాద్ (విశాఖ ఎక్స్‌ప్రెస్), 18401 పూరి-వాకా(వాకా ఎక్స్‌ప్రెస్), 22871 తిరుపతి -భువనేశ్వర్, 17479 హౌరా-తిరుపతి, 11020 భువనేశ్వర్- ముంబయ్(కోనార్క్), 22859 పూరి-మద్రాస్, 12717 విశాఖపట్నం-విజయవాడ (రత్నాచల్ ఎక్స్‌ప్రెస్), 17488 తిరుపతి-విశాఖపట్నం (తిరుమల ఎక్స్‌ప్రెస్), 12861 విశాఖపట్నం -హజరత్ నిజాముద్దీన్ (లింక్ ఎక్స్‌ప్రెస్), 12727 విశాఖపట్నం-సికింద్రాబాద్ (గోదావరి), 08507 విశాఖ-సికింద్రాబాద్ (జనసాధారణ్), 11019 ముంబయ్-భువనేశ్వర్( కోనార్క్), 17480 తిరుపతి -హౌరా ఎక్‌సప్రెస్, 17016 సికింద్రాబాద్ -భువనేశ్వర్ (విశాఖ ఎక్స్‌ప్రెస్), 18464 బెంగళూరు -భువనేశ్వర్ (ప్రశాంతి), 12718 విజయవాడ-విశాఖపట్నం (రత్నాచల్ ఎక్స్‌ప్రెస్), 12740 సికింద్రాబాద్-విశాఖపట్నం (గరీభీరధ్), 12806 సికింద్రాబాద్ -విశాఖపట్నం (జన్మభూమి), 12861 నిజాముద్దీన్ -విశాఖపట్నం (లింక్ ఎక్స్‌ప్రెస్),22204 విశాఖ దురంతో ఎక్స్‌ప్రెస్, 18520 లోకమాన్య తిలక్-విశాఖ (ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్), 17239 గుంటూరు - విశాఖపట్నం (సింహాద్రి ఎక్స్‌ప్రెస్), 17487 విశాఖపట్నం -తిరుపతి (తిరుమల ఎక్స్‌ప్రెస్),
ప్రయాణికుల గుండెల్లో తుపాను
Published Sun, Oct 12 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM
Advertisement
Advertisement