స్టార్ నైట్‌తో విరాళాలు సేకరిస్తాం
ప్రకాశ్‌నగర్ (రాజమండ్రి) : హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు స్టార్ నైట్ కార్యక్రమం నిర్వహించి విరాళాలను సేకరించనున్నట్టు రాజమండ్రి ఎంపీ, మా అధ్యక్షుడు మాగంటి మురళీమోహన్ వెల్లడించారు. విశాఖలో తుపాను బాధితులకోసం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎంపీ మురళీమోహన్ దాతల సహకారంతో టన్ను పాలపొడి, మంచి నీటి ట్యాంకర్లు, బిస్కెట్లు మంగళవారం పంపించారు. ఆ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ తమ ఎంపీ నిధుల నుంచి రూ. 25 లక్షల కేటాయించాలని నిర్ణయించామన్నారు. ఎంపీలందరూ ఒక నెల వేతనాన్ని కూడా విరాళంగా ఇస్తారన్నారు.
స్పందించిన వారికి కృతజ్ఞతలు
జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ రూ. లక్ష, రాజమండ్రి ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ రూ.60 వేలు, మరో ఇద్దరు రూ. 80 వేలు విరాళంగా అందజేశారని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు. ఈ మొత్తంతో టన్ను పాల పొడి కొనుగోలు చేశామని చెప్పారు. బిస్కెట్లు, వాటర్ ప్యాకెట్లు కూడా పంపామని, నగర బీజేపీ కార్యకర్తలు లారీతో వాటర్ ప్యాకెట్లు పంపినట్టు తెలి పారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గన్ని కృష్ణ, నల్లమిల్లి జగన్‌మోహన్‌రెడ్డి, నాళం నరసింహారావు, నేమాని పట్టాభి రామయ్య, జె. నాగేశ్వరరావు, జె. నూకరాజు, ఎ. రామకృష్ణ, బి. దత్తు, నాళం పద్మశ్రీ పాల్గొన్నారు.
అమలాపురం ఎంపీ వితరణ
అమలాపురం : విశాఖ బాధితుల సహా యార్ధం అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు తన రెండు నెలల జీతం రూ.3 లక్షలను విరాళంగా ప్రకటిం చారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.25లక్షలుఅందిస్త్తున్నట్టు తెలిపారు.