దసరా ధమాకా ఎక్సైజ్‌శాఖకు భారీగా ఆదాయం | huge income on the occassion of dasara | Sakshi
Sakshi News home page

దసరా ధమాకా ఎక్సైజ్‌శాఖకు భారీగా ఆదాయం

Published Fri, Oct 18 2013 2:43 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

huge income on the occassion of dasara

నల్లగొండ, న్యూస్‌లైన్
 దసరా పండగ జిల్లా ఎక్సైజ్ శాఖకు ధమాకా మోగించింది. పండగ సీజన్‌లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ దఫా అమ్మకాలు ఊపందుకున్నాయి. జిల్లాలో 241మద్యం దుకాణాలుండగా 8దుకాణాలకు ఎవరూ ముందుకురాకపోవడంతో ప్రస్తుతం 233 దుకాణాల ద్వారా వ్యాపారం కొనసాగుతుంది. వీటిలో నల్లగొండ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 154, మిర్యాలగూడ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 79దుకాణాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా గతేడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి 15 తేదీ వరకు *38 కోట్ల 94లక్షల 49వేల మద్యం అమ్మకాలు జరిగితే, ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి 15 తేదీ వరకు *46 కోట్ల 18లక్షల14వేల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే 15రోజుల్లోనే ఎక్సైజ్‌శాఖకు *7కోట్ల 23లక్షల65వేల మేర ఆదాయం వచ్చింది. తాజా మద్యం అమ్మకాల్లో లిక్కర్‌కు మించి బీర్లు అధికంగా అమ్ముడయ్యాయి. వాస్తవంగా గత ఏడాది కంటే లిక్కర్ అమ్మకాలు చాలా వరకు తగ్గాయి.  
 
 మిర్యాలగూడ ఈఎస్ పరిధిలో..
 గతేడాది అక్టోబర్‌లో మిర్యాలగూడ సర్కిల్ పరిధిలో 7,340 కాటన్ల లిక్కర్ అమ్ముడుకాగా, ఈ ఏడాది అక్టోబర్‌లో 5,502 కాటన్లు అమ్ముడైనాయి. హుజూర్‌నగర్ సర్కిల్ పరిధిలో గతేడాది 5,974 కాటన్లు అమ్ముడైతే ఈసారి 3,561 కాటన్లు, కోదాడ సర్కిల్‌లో4,447 కాటన్ల నుం చి 2,797కాటన్లకు పడిపోయింది. హాలియా సర్కిల్‌లో 4,355కాటన్ల నుంచి 3,559కాటన్లకు తగ్గింది. దేవరకొండ సర్కిల్ పరిధిలో మాత్రం 5,122 కాటన్ల నుంచి 5,555కాటన్లకు పెరిగిం ది. నాంపల్లి సర్కిల్‌లో గతేడాది అక్టోబర్‌లో 1,567కాటన్ల లిక్కర్ అమ్ముడుకాగా ఈ ఏడాది అక్టోబర్‌లో 1,860 కాటన్లు అమ్ముడయ్యాయి.  
 
 గతేడాది అక్టోబర్‌లో నల్లగొండ సర్కిల్ పరి ధిలో13,509 లిక్కర్ కాటన్లు అమ్ముడు కాగా, ఈ ఏడాది అక్టోబర్‌లో 11,643 కా టన్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అదే విధంగా సూర్యాపేట సర్కిల్ పరిధిలో 7,072కాటన్ల లిక్కర్ అమ్ముడు కాగా, ఈ సారి 6,106 కాటన్లు అమ్ముడయ్యాయి. తుంగతుర్తి సర్కిల్ పరిధిలో 2,983 కాటన్ల లిక్కర్ అమ్ముడుకాగా ఈసారి 2,547 కా టన్ల విక్రయాలు జరిగాయి. నకిరేకల్ సర్కి ల్ పరిధిలో 4,452 కాటన్లు అమ్ముడు కాగా, ఈ ఏడాది 3,069కాటన్లు అమ్ముడయ్యాయి. చండూరు సర్కిల్ పరిధిలో 2,548 కాటన్లు అమ్ముడుకాగా, ఈ ఏడాది 3,293 కాటన్లు అమ్ముడయ్యాయి. భువనగిరి సర్కిల్ పరిధి లో 8,377 కాటన్లు నుంచి ఈ ఏడాది 9,179 కాటన్లు పెరిగాయి. రామన్నపేట సర్కిల్ పరిధిలో 5,530 కాటన్ల లిక్కర్ అమ్ముడుకాగా, ఈ ఏడాది 5,915 కాటన్లు అమ్ముడయ్యాయి. ఆలేరు సర్కిల్ పరిధిలో 3,271 కాటన్లు అమ్ముడుకాగా ఈ ఏడాది 4,440 కాటన్లు పెరిగాయి. మోత్కూరు సర్కిల్ పరిధిలో 2,675 కాటన్లు అమ్ముడుకాగా ఈ ఏడాది 2,255 కాటన్లు అమ్ముడయ్యాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement