నెల్లూరు(నవాబుపేట)/ బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్: వేసవి సెలవుల నేపథ్యంలో రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు నడుపుతున్న ప్రత్యేక రైళ్లు కూడా నిండిపోతున్నాయి. ఇదే అదునుగా భావించిన కొందరు దుండగులు దోపిడీలకు తెగబడుతున్నారు. ఎక్స్‌ప్రెస్, స్పెషల్ రైళ్ల ప్రయాణికులను టార్గెట్ చేసుకుని విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా అర్ధరాత్రి తర్వాత, వేకువ జామున బోగీల్లోకి ప్రవేశించి హల్‌చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున కొడవలూరు మండలం తలమంచి సమీపంలో స్వైర విహారం చేస్తున్న దొంగలను పట్టుకునేందుకు రైల్వే పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ క్రమంలో రైలు ప్రయాణికులు భయం తో హడలిపోతున్నారు.
వరుస ఘటనలు
నెల్లూరు-ఒంగోలు మధ్య జరుగుతున్న వ రుస ఘటనలతో రైలు ప్రయాణికులు హడలిపోతున్నారు. ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ సమీపంలో ఉన్న జువ్వలగుం ట చెరువు ప్రాంతంలో ట్రాక్ మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ రై ళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయి. ఇది తెలుసుకున్న దొంగల ముఠాలు సోమవారం తెల్లవారుజామున ఆ ప్రాంతంలో తిష్టవేశాయి.
ఆ సమయంలో అటుగా వచ్చిన హౌరా- చెన్నై మెయిల్, భువనేశ్వర్-యశ్వంత్‌పూర్ వీక్లీ, చెన్నై-న్యూఢిల్లీ తమిళనాడు ఎక్స్‌ప్రె స్, కాకినాడ-బెంగళూరు శేషాద్రి ఎక్స్‌ప్రెస్ లో ఎక్కి దోపిడీకి యత్నించారు. అయితే ప్రయాణికులు తీవ్రంగా ప్రతిఘటించడం తో చేతికి చిక్కిన సుమారు 15 గ్రాముల ఆ భరణాలతో ఉడాయించారు. అదే సమయంలో రామేశ్వరం-భువనేశ్వర్ ఎక్‌రరపెస్‌ను కొడవలూరు మండలం తలమంచి వద్ద చైన్ లాగి ఆపారు. రైలు నెమ్మదిగా ఆ గుతున్న సమయంలో ఎస్-11,ఎస్-4 బో గీల్లో మహిళలపై దాడి చేశారు. వారి మెడల్లోని 55 గ్రాముల నగలను దోచుకున్నారు.
కిటికీ పక్కనే కూర్చున్న విశాఖపట్టణానికి చెందిన రవి మెడలోని 15 గ్రాముల చైన్‌ను లాక్కెళ్లారు. ఇంతలో మిగిలిన ప్రయాణికు లు కేకలు పెట్టడంతో దుండగులు ఉడాయించారు. మంగళవారం సరిగ్గా అదే సమయంలో తలమంచి వద్ద గౌహతి ఎక్స్‌ప్రెస్‌ను చైన్ లాగి ఆపారు. కిటికీ పక్కన నిద్రపోతున్న వారి మెడల్లో ఆభరణాలను లా గేందుకు ప్రయత్నించగా ప్రయాణికులు కే కలు వేయడంతో రైల్వే ఎస్సై సుభాన్ అప్రమత్తమై గాలిలోకి కాల్పులు జరిపారు. త ప్పించుకున్న దొంగలు గొల్లపాళెం వైపు పా రిపోయారు. అటవీ ప్రాంతం కావడంతో రైల్వే పోలీసులు వెంబడించలేకపోయారు.
15 రోజులుగా తలమంచి
రైల్వే స్టేషన్‌లో సంచారం
గుర్తుతెలియని వ్యక్తులు కొందరు 15 రో జులుగా తలమంచి రైల్వేస్టేషన్‌లో సంచరి స్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ట్రా క్‌పై నడిచి వెళ్లడం, తూములపై కూర్చుని మంతనాలు చేస్తున్నారని తెలిపారు. కొందరు తమిళంలో, మరికొందరు హిందీలో మాట్లాడుతున్నారని తెలియజేయడంతో దొంగలు బీహార్ ముఠా అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ సాగిస్తున్నారు. అయితే 15 రోజులుగా ట్రాక్ పరిసరాల్లో గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తుంటే తలమంచి స్టేషన్‌మాస్టర్, ఇతర సిబ్బంది పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా రైల్వే ప్రయాణికుల భద్రతపై ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
దోపిడీ దొంగల హల్‌చల్
Published Wed, May 28 2014 2:06 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement