భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం | husaband died in track crossing in unda nagar railway station | Sakshi
Sakshi News home page

భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం

Published Tue, Feb 18 2014 12:17 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

husaband died in track crossing in unda nagar railway station

 ఉందానగర్ రైల్వేస్టేషన్‌లో పట్టాలు దాటుతుండగా ఢీకొన్న రైలు  
 
 శంషాబాద్, న్యూస్‌లైన్:
 ఏడడుగులు తనతో కలిసి నడిచిన భర్త కళ్లెదుటే రెప్పపాటు క్షణంలో దుర్మరణం పాలవడంతో ఆ భార్య గుండెలవిసేలా రోదించింది. పట్టాలు దాటుతున్న వ్యక్తిని రైలు ఢీకొనడంతో తల, మొండెం వేరై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన సోమవారం శంషాబాద్ (ఉందానగర్) రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు, మృతుడి భార్య కథనం ప్రకారం.. మండల పరిధిలోని పెద్దషాపూర్ తండాకు చెందిన సబావత్ సేవియా(45), లక్ష్మి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం వారు శంషాబాద్‌కు వచ్చారు. ఇంటికి సంబంధించిన సామగ్రి కొనుగోలు చేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో భార్యాభర్తలు శంషాబాద్ రైల్వేస్టేషన్ వద్దకు చేరుకున్నారు. అటువైపు వెళ్లేందుకు ఫుట్‌ఓవర్ బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సి ఉండగా వారు పట్టాలు మీదుగా వెళ్తున్నారు. అప్పటికే లక్ష్మి పట్టాలు దాటి ఫ్లాట్‌ఫాంపైకి చేరుకుంది. పట్టాల మీది నుంచి ఫ్లాట్‌ఫాం ఎక్కేందుకు యత్నిస్తున్న సేవియాను కాచిగూడ నుంచి వచ్చిన చెన్నై ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. దీంతో ఆయన తల, మొండెం వేరుకావడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. రెప్పపాటు సమయంలో తన కళ్లేదుటే భర్త దుర్మరణం చెందడంతో లక్ష్మి గుండెలు బాదుకుంది. ఆమె రోదనలు ఆపడం ఎవరితరం కాలేదు.
 
 సేవియా మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, తండావాసులు పెద్దసంఖ్యంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాచిగూడ రైల్వే ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement