
'సినిమాల్లో నటించే ఆలోచన లేదు'
విజయవాడ: తనకు సినిమాల్లో నటించే ఆలోచన లేదని విజయవాడకు చెందిన మిస్ అమెరికా నీనా దావులూరి అన్నారు. మిస్ అమెరికాగా ఎంపికైన తర్వాత విజయవాడ వచ్చిన ఆమె శనివారం మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా మిస్ యూనివర్స్, మిస్ అమెరికా వంటి పోటీల్లో విజేతలకు సినిమా అవకాశాలు వస్తాయి కదా.. మీకూ వచ్చాయా అన్ని విలేకరులు అడగగా ఆమె పైవిధంగా బదులిచ్చారు.