సీఎం, పీఎం పదవో కాదు, తెలంగాణ కావాలి: కేసీఆర్
హైదరాబాద్ : పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఎవరూ అడ్డుకోలేరని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా తీర్మానం నెగ్గదని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా అంగీకరించామని, సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల గురించి ఆ ప్రాంత నేతలే మాట్లాడలన్నారు. తనకు సీఎం, పీఎం పదవో కాదని.... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ముఖ్యమన్నారు.
పార్లమెంట్కు 56 మంది 26మంది ఓటు వేసినా తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని కేసీఆర్ అన్నారు. తమది ఎగువ రాష్ట్రమని, సీమాంధ్రది దిగువ రాష్ట్రామని .... తగువు పెట్టుకుంటే మీరే నష్టపోతారంటూ ఆయన సీమాంధ్ర నేతలను ఈ సందర్భంగా హెచ్చరించారు. ముఖ్యమంత్రికి రాజ్యాంగంపై అవగాహన లేదని... కిరణ్ సీఎం పదవికి అనర్హుడంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చకు ఒక్కరోజు చాలని అన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏడు అంశాల సవరణపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు....కేసీఆర్ లేఖ రాశారు.