సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా 2.5 కోట్ల మంది జన్మిస్తుండగా, వారిలో 50 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) తెలిపింది. ప్రస్తుతం నమోదు అవుతున్న శిశు మరణాల్లో 54 శాతం మంది పౌష్టికాహార లోపంతో చనిపోతున్నట్లు పేర్కొంది. మరణాల రేటు ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 40 శాతం నమోదు అవుతుండటంపై ఐఏపీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘శిశువులు, ఎదిగే పిల్లలో పోషణ’ అనే అంశంపై శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన సదస్సులో సుమారు 300 మంది పిల్లల వైద్య నిపుణులు పాల్గొన్నారు. డా. పి.సుదర్శన్‌రెడ్డి, డా. హిమబిందు సింగ్, డా. ఆర్.కె.అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.