Malnutrition
-
పోషకాహార లోపాన్ని అధిగమించడానికి.. ఏం తినాలో తెలుసా!?
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఆహార సమస్యకు పరిష్కారంగా హరిత విప్లవం వచ్చింది. హరిత విప్లవం ఫలితంగా ఆహార పంటల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత గ్రామీణ భారత స్వయంసమృద్ధి లక్ష్యంతో శ్వేత విప్లవం వచ్చింది. శ్వేత విప్లవం వల్ల దేశంలో పాల ఉత్పత్తి పెరగడమే కాకుండా, ఎందరికో స్వయం ఉపాధి లభించింది. ఈ రెండు విప్లవాలు వచ్చి దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా, నేటికీ మన దేశంలో ఎందరో శిశువులు, చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.దేశవ్యాప్తంగా 2019–21 మధ్య చేపట్టిన ఐదో విడత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) ప్రకారం మన దేశంలో ఐదేళ్ల లోపు వయసు ఉన్నవారిలో ఎదుగుదల లోపించిన చిన్నారులు 36.5 శాతం, బక్కచిక్కిపోయిన చిన్నారులు 19.3 శాతం, తక్కువ బరువుతో ఉన్న చిన్నారులు 32.1 శాతం మంది ఉన్నారు. చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత మధ్యాహ్న భోజన పథకాలను అమలు చేస్తున్నా, చిన్నారుల్లో పోషకాహార లోపం ఈ స్థాయిలో ఉండటం ఆందోళనకరం. ఇదిలా ఉంటే, మన దేశంలో ఐదేళ్ల లోపు చిన్నారుల్లో 2.4 శాతం మంది స్థూలకాయంతో బాధడుతున్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి పోషకాహార నిపుణులు చెబుతున్న జాగ్రత్తలు ‘జాతీయ పోషకాహార వారోత్సవం’ సందర్భంగా మీ కోసం...నేటి బాలలే రేపటి పౌరులు. దేశ భవితవ్యానికి చిన్నారుల ఆరోగ్యమే కీలకం. చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలి. వారు ఏపుగా ఎదగాలి. అప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగానే కాకుండా, మన దేశంలోని చిన్నారుల్లో పోషకాహార లోపానికి గల కారణాలను, చిన్నారుల్లో పోషకాహార లోపం వల్ల తలెత్తే పరిణామాలను కూలంకషంగా అర్థం చేసుకుని, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని భర్తీ చేసేందుకు వారికి ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలో, వారిలోని ఎదుగుదల లోపాలను అరికట్టేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.చిన్నారుల్లో పోషకాహార లోపం సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలంటే, ప్రపంచవ్యాప్త పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వెనుకబడిన దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఈ సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. అంతర్జాతీయ గణాంకాలను చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయసు గల చిన్నారుల్లో 14.9 కోట్ల మంది పోషకాహార లోపం కారణంగా ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. మరో 4.5 కోట్ల మంది చిన్నారులు పోషకాహారం అందక బక్కచిక్కి ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న బాలల మరణాల్లో 45 శాతం మరణాలు పోషకాహార లోపం వల్ల సంభవిస్తున్నవే! చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే! మరోవైపు, 3.7 కోట్ల మంది చిన్నారులు స్థూలకాయంతో బాధపడుతున్నారు.పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే, రోజువారీ ఆహారంలో వీలైనంత వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. తృణధాన్యాలు, గింజధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు, గుడ్లు, చికెన్ వంటివి తీసుకోవాలి. ఐరన్, జింక్, అయోడిన్ తదితర ఖనిజ లవణాలు, విటమిన్–ఎ, విటిమన్–బి, విటమిన్–సి తదితర సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉండే పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.చక్కని పోషకాహారం తీసుకోవడమే కాకుండా, ఆహారం సరిగా జీర్ణమవడానికి ప్రతిరోజూ తగినంత నీరు తాగాలి. ప్రతిరోజూ నిర్ణీత వేళల్లో భోజనం చేయడం వల్ల ఆహార జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అలాగే, కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేయడం వల్ల తినడంలో ఆరోగ్యకరమైన పద్ధతులు అలవడటమే కాకుండా, సామాజిక అనుబంధాలు పెరుగుతాయి. ఆకలి వేసినప్పుడు తినే పదార్థాల మీద పూర్తిగా దృష్టిపెట్టి తృప్తిగా భోజనం చేయాలి. తినే సమయంలో టీవీ చూడటం సహా ఇతరత్రా దృష్టి మళ్లించే పనులు చేయకుండా ఉండటం మంచిది.పోషకాహార లోపానికి కారణాలు..చిన్నారుల్లో పోషకాహార లోపానికి అనేక కారణాలు ఉన్నాయి. శిశువులకు తల్లిపాలు అందకపోవడం మొదలుకొని ఆహార భద్రతలేమి వరకు గల పలు కారణాలు చిన్నారులకు తీరని శాపంగా మారుతున్నాయి. భారత్ సహా పలు దేశాల్లోని పిల్లలకు పేదరికం వల్ల ఎదిగే వయసులో ఉన్నప్పుడు తగినంత పోషకాహారం అందడంలేదు. కడుపు నింపుకోవడమే సమస్యగా ఉన్న కుటుంబాల్లోని చిన్నారులకు పోషకాహారం దొరకడం గగనంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఆరునెలల లోపు వయసు ఉన్న శిశువుల్లో 44 శాతం మందికి మాత్రమే తల్లిపాలు అందుతున్నాయి. మన దేశంలో ఇదే వయసులో ఉన్న శిశువుల్లో దాదాపు 55 శాతం మందికి తల్లిపాలు అందుతున్నట్లు ‘ఎన్ఎఫ్హెచ్ఎస్–5’ గణాంకాలు చెబుతున్నాయి. బాల్యంలో పోషకాహార లోపం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అవి:– కండరాలు పెరగక బాగా బక్కచిక్కిపోతారు.– ఎదుగుదల లోపించి, వయసుకు తగినంతగా పెరగరు.– పెద్దయిన తర్వాత డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, ఎముకల బలహీనత, రకరకాల క్యాన్సర్లు వంటి ఆరోగ్య సమస్యలకు లోనవుతారు.డైటరీ సప్లిమెంట్ల ఉపయోగాలు..మూడు పూటలా క్రమం తప్పకుండా భోజనం చేసినా, మన శరీరానికి కావలసిన సూక్ష్మపోషకాలు తగినంత మోతాదులో అందే అవకాశాలు తక్కువ. అందువల్ల వైద్య నిపుణులను సంప్రదించి, వయసుకు తగిన మోతాదుల్లో సూక్ష్మపోషకాలను అందించే డైటరీ సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా చిన్నారులకు విటమిన్–ఎ, ఐరన్ సప్లిమెంట్లు ఎక్కువగా అవసరమవుతాయి. విటమిన్–ఎ సప్లిమెంట్‌ను చిన్నప్పటి నుంచి తగిన మోతాదులో ఇస్తున్నట్లయితే, కళ్ల సమస్యలు, దృష్టి లోపాలు రాకుండా ఉంటాయి.ఐరన్ సప్లిమెంట్లు ఇచ్చినట్లయితే, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అన్ని పోషకాలు సమృద్ధిగా దొరికే ఆహారం తీసుకోవడం, అవసరం మేరకు డైటరీ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మంచి ఆరోగ్యం కోసం రోజువారీ భోజనంలో కూరగాయలు, ఆకుకూరలు, గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాలు ఎక్కువ పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. వీటికి తోడు కొద్ది పరిమాణంలో నట్స్, డ్రైఫ్రూట్స్, పండ్లు, పెరుగు ఉండేలా చూసుకోవాలి. నూనెలు, ఇతర కొవ్వు పదార్థాలు, ఉప్పు అవసరమైన మేరకే తప్ప ఎక్కువగా వాడకుండా ఉండాలి.పిల్లల ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సినవి..ఎదిగే వయసులో ఉన్న చిన్నారులు పుష్టిగా ఎదగాలంటే, వారి ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండాలి. వారు తినే ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా కూడా ఉండాలి. పిల్లలకు అందించే ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన పదార్థాలు ఇవి:– పిల్లల భోజనంలో పప్పుధాన్యాలు, గింజధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఆకుకూరలు, కాలానికి తగిన పండ్లు, గుడ్లు, పాలు, పెరుగు తప్పనిసరిగా ఉండాలి.– పిల్లలు చురుకుగా ఉండటానికి, ఆరోగ్యకరంగా ఎదగడానికి వారిని ఆరుబయట ఆటలు ఆడుకోనివ్వాలి. శారీరక వ్యాయామం చేసేలా, ఆటలాడేలా, ఇంటి పనుల్లో పాలు పంచుకునేలా పిల్లలను ప్రోత్సహించాలి.– పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పించాలి. వారు వ్యక్తిగత శుభ్రత పాటించేలా అలవాటు చేయాలి.– అతిగా తినడం, వేళాపాళా లేకుండా తినడం వంటి అలవాట్లను చిన్న వయసులోనే మాన్పించాలి. ఈ అలవాట్లను నిర్లక్ష్యం చేస్తే పిల్లలు స్థూలకాయం బారినపడే ప్రమాదం ఉంటుంది.– ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు మితిమీరి ఉండే జంక్‌ఫుడ్‌కు పిల్లలు దూరంగా ఉండేలా చూడాలి.కుకింగ్ క్లాసెస్‌తో.. "విద్యార్థులకు ఆకు కూరలు, కూరగాయలు, పళ్లు, ఇతర ఆహారపదార్థాల్లోని పోషకవిలువల పట్ల అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లోని విద్యారణ్య, ఓక్రిజ్ స్కూళ్లలో కుకింగ్ క్లాసెస్నూ నిర్వహిస్తున్నారు." – అడ్డు కిరణ్మయి, సీనియర్ న్యూట్రిషనిస్ట్, లైఫ్‌స్టైల్ కన్సల్టంట్ -
కష్టాలకు గొడుగు పట్టారు
కేరళలోని అట్టపాడి గిరిజనప్రాంతంలో నవజాత శిశువుల మరణాలు అనేకం చోటు చేసుకున్నాయి. కారణం పౌష్టికాహార లోపం. పోషకాలు ఇచ్చే అటవీ ఆహారం నశించిపోయి గర్భిణులకు తిండి కరువైంది. దాంతో ఒక స్వచ్ఛంద సంస్థ వారిని గొడుగుల తయారీలో శిక్షణ ఇచ్చింది. 2015 నుంచి ‘కార్తుంబి’ (తూనీగ) అనే బ్రాండ్ కింద ఆ గిరిజన మహిళలు తయారు చేస్తున్న గొడుగులు దేశమంతా అమ్ముడుపోతున్నాయి. తాజాగా ప్రధాని మోడి తన ‘మన్ కీ బాత్’లో వీరిని శ్లాఘించారు. కర్తుంబి గురించి....‘కేరళ సంస్కృతిలో గొడుగులు ఒక భాగం. అక్కడి కార్తుంబి గొడుగుల గురించి నేను ప్రస్తావించ దలుచుకున్నాను. రంగు రంగుల ఆకర్షణీయమైన ఈ గొడుగులను ఆదివాసి మహిళలు తయారు చేస్తారు. కేరళలోని చిన్న పల్లె నుంచి తయారయ్యే ఈ గొడుగులు నేడు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలకు చేరుతున్నాయి. ఓకల్ ఫర్ లోకల్‌కు ఇంతకుమించిన ఉదాహరణ ఏం కావాలి’ అని జూన్ 30న తన 111వ ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోడి కర్తుంబి గొడుగుల గురించి చేసిన ప్రస్తావన అక్కడి గిరిజన మహిళల ముఖాన చిర్నవ్వులు తేవడమే కాదు దేశవ్యాప్తంగా వారు సాగిస్తున్న కృషిని తెలిపింది. చాలామంది నేడు కార్తుంబి గొడుగుల గురించి తెలుసుకుంటున్నారు. ఆ గాథతో స్ఫూర్తి పొందుతున్నారు.పాలక్కాడ్‌లో గిరిజనులుపాలక్కాడ్లోని లోపలి పల్లెల్లో ముడుగ, ఇరుల, కర్ముగ తదితర గిరిజనులు ఉంటారు. చాలా ఏళ్లపాటు వీరికి డబ్బు అవసరం ఏర్పడలేదు. అటవీ ఆహారమే వీరి ఆహారం. అయితే 2012 నుంచి ఈప్రాంతంలో నవజాత శిశువుల మరణాలు ఎక్కువగా నమోదవడం స్వచ్ఛంద సంస్థలు గమనించాయి. 2012 నుంచి 2015 వరకు ఇక్కడ అనధికారికంగా 200 శిశుమరణాలు జరిగి ఉంటాయని అంచనా. ఇందుకు కారణం గర్భిణులకు పౌష్టికాహారం లేకపోవడమే. ‘మేము తినే కందమూలాలు, పండ్లు, ఆకుకూరలు ఇప్పుడు అడవుల్లో లేవు. క్రూరమృగాల భయం వల్ల మేము వ్యవసాయం చేయము. మాకు అంతిమంగా డబ్బుతో అవసరం ఏర్పడింది. అది మా దగ్గర లేదు. కాబట్టి మేము ఆహారం కొనుక్కుని తినే పరిస్థితుల్లో లేము’ అని అక్కడ మహిళలు చె΄్పారు. దాంతో పాలక్కాడ్‌లో గిరిజనుల కోసం పని చేసే ‘తంపు’ అనే స్వచ్ఛంద సంస్థ వీరి సమస్యను లోకానికి తెలియచేసింది. గల్ఫ్‌లో పని చేస్తున్న కేరళీయుల బృందం వీరి సాయానికి ముందుకు వచ్చింది. ఫలితంగా ఏర్పడిందే ‘కార్తుంబి’ గొడుగుల బ్రాండ్.రంగుల తూనీగపాలక్కాడ్లో పిల్లల కోసం పని చేసే ఒక సంస్థ ‘కార్తుంబి’ (తూనీగ) పేరుతో అందరికీ తెలుసు. అందరినీ ఆకర్షించే ఈ పేరుతోనే బ్రాండ్ ఏర్పాటు చేసి ఆదివాసీ మహిళలకు గొడుగుల తయారీలో శిక్షణ ఇచ్చారు. మొదట 70 మందిని ఎంపిక చేసి వారికి మెటీరియల్ సరఫరా చేస్తే గొడుగులు ఎలా చేయాలో నేర్పారు. ఆ తర్వాత వారు తమ రోజువారీ పనులు చేసుకుంటూనే ఇంట్లో వీలైనప్పుడల్లా గొడుగులు తయారు చేసే వెసులుబాటు ఇచ్చారు. ఒక గొడుగు తయారు చేస్తే 30 రూపాయల కూలీతో ఈ పని మొదలైంది. 2017 నుంచి కేరళ గిరిజన సంక్షేమ శాఖ ఫండ్ రిలీజ్ చేస్తోంది. వీరి నుంచి తయారైన గొడుగులు వివిధ సంస్థల ద్వారా మార్కెటింగ్ అవుతున్నాయి.సీజన్లో 17 వేల గొడుగులు70 మంది మహిళలతో మొదలైన ఈ పని నేడు 350 గిరిజన మహిళలకు చేరుకుంది. వీరు జనవరి నుంచి మే చివరి వరకు మాత్రమే పని చేస్తారు. జూన్ మొదటి వారంలో మాన్సూన్ రావడంతో గొడుగుల అమ్మకాలు ఉంటాయి కాబట్టి. ఒక సీజన్లో వీరంతా కనీసం 17 వేల గొడుగులు తయారు చేస్తున్నారు. ఒక్కొక్క మహిళ రోజుకు 700 నుంచి వేయి రూపాయల వరకు సంపాదిస్తుంది. ఈ త్రీఫోల్డ్ గొడుగులు మెటీరియల్‌ను బట్టి 350 రూపాయల నుంచి 649 రూపాయల వరకూ అందుబాటులో ఉన్నాయి.గొడుగుల దానంచలికాలంలో రగ్గుల దానం ఎంత అవసరమో వానాకాలంలో గొడుగుల దానం అంత అవసరం. కార్తుంబి గొడుగుల మార్కెటింగ్ కోసం ఒక టెకీ సంస్థ కార్పొరేట్ సంస్థలను సంప్రదించి వారిచేత గొడుగులు కొనేలా చేస్తోంది. ఉద్యోగులకు, పేదవారికి ఉచితంగా ఇచ్చేలా చూస్తుంది. అలాగే కేరళలో వానాకాలంలో స్కూళ్లకు వచ్చిపోయే పేద పిల్లలకు గొడుగులు చాలా అవసరం. అందుకే ‘స్కూలు పిల్లలకు కార్తుంబి గొడుగులు’ పేరుతో కూడా క్యాంపెయిన్లు జరుగుతుంటాయి. సీజన్ మొదట్లో బల్క్‌గా ఈ గొడుగులు కొని పిల్లలు పంచుతుంటారు చాలామంది. ఇప్పుడు ప్రధాని ప్రసంగం వల్ల కేరళలోని ఇతర మహిళలు కూడా ఈ గొడుగుల తయారీ పట్ల ఆసక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో వానలొస్తే రంగు రంగుల కార్తుంబి తూనీగలు ప్రతి ఒక్కరి నెత్తిమీద ఎగురుతుంటాయని ఆశిద్దాం. -
పొగచూరుతున్న బాల్యం!
సాక్షి, హైదరాబాద్: వాయు కాలుష్యంతో పసి మొగ్గలు రాలిపోతున్నాయి. ఐదేళ్లలోపు పిల్లల ఊపిరితిత్తులు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఫలితంగా దేశంలో రోజూ సగటున 464 మంది మృత్యువాత పడుతున్నారు. అమెరికాకు చెందిన లాభాపేక్షలేని పరిశోధనా సంస్థ ‘హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్’తొలిసారిగా ‘స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ ఎయిర్–2024’ నివేదికను విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలివీ..పిల్లలకు న్యుమోనియా, పెద్దలకు ఆస్తమామానవ ఆరోగ్యంపై పీఎం (పర్టిక్యులేట్ మ్యాటర్)–2.5, నైట్రోజన్ డయాక్సైడ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గాలి కాలుష్యంతో పిల్లలు న్యుమోనియా బారిన, పెద్దలు ఆస్తమా బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది కాలంలో వాయు కాలుష్యం సంబంధమైన వ్యాధుల కారణంగా 81 లక్షల మంది మరణించగా.. ఇందులో 7 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులే. ఇందులో సుమారు 5 లక్షల మంది పిల్లలు గృహాల నుంచి విడుదలయ్యే కాలుష్యం కారణంగానే మృత్యువాతపడ్డారు. ఇక, మన దేశంలో 21 లక్షల మంది చనిపోగా.. అత్యధికంగా చైనాలో 23 లక్షల మంది కన్నుమూశారు.శ్వాస, నాడీ వ్యవస్థలపై ప్రభావం అడ్డూఅదుపు లేని మానవ చర్యల కారణంగా వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. స్వచ్ఛమైన గాలి కరువైపోతోంది. ఫలితంగా అనునిత్యం భారీగా కాలుష్యకారకాలు ఊపిరితిత్తుల్లోకి చేరిపోతున్నాయి. ప్రధానంగా ఇది చిన్నారులపై తీవ్ర దుష్ర్పభావాన్ని చూపిస్తోంది. ఎదుగుతున్న దశలో ఉన్న వారి శ్వాస, నాడీ వ్యవస్థలను దెబ్బతీసి, ప్రాణసంకటంగా మారుతోంది. ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాలకు ప్రధాన కారణం పోషకాహార లోపం కాగా.. రెండో అత్యంత ప్రమాదకారి వాయు కాలుష్యమే. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులు నెలలు నిండకముందే పుట్టడం, తక్కువ బరువుతో జని్మంచడం, ఉబ్బసం, ఊపిరితిత్తుల వ్యాధులు వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.ప్రమాద ఘంటికలిలా.. ⇒ బాల్యంలో అధిక మోతాదులో వాయు కాలుష్యం బారినపడితే పెద్దయ్యాక గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. ⇒ వాయు కాలుష్యం ఎక్కువైతే చిన్నారుల్లో మెదడు, నాడీ వ్యవస్థలో వృద్ధి మందగిస్తుంది. విషయ పరిజ్ఞాన సామర్థ్యం తగ్గుతుంది. ⇒ఉబ్బసం ముప్పు పెరుగుతుంది. చిన్నతనంలోనే కేన్సర్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. ⇒నవజాత శిశువులకు ఇళ్లల్లోని వాయు కాలుష్యం ముప్పు ఎక్కువ. ⇒ గర్భిణీలు కలుíÙతమైన గాలికి గురైతే.. వారికి నెలలు నిండకుండానే కాన్పు అయి తక్కువ బరువుతో శిశువులు జన్మించే ప్రమాదం ఉంది.ఏం చేయాలంటే.. ⇒ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన వాయు నాణ్యత ప్రమాణాలను చేరుకోవడానికి ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలి. ⇒ శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలి. ఇంధన సమర్థతను పెంచడంపై పెట్టుబడులు పెంచాలి. ⇒ పునరి్వనియోగ వనరులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ⇒ బహిరంగంగా వ్యర్థాలను కాల్చడం తగ్గించాలి. వ్యర్థాల నిర్వహణ మెరుగుపడాలి. ⇒ రద్దీగా ఉండే రోడ్లు, కర్మాగారాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు వాయు కాలుష్యానికి ప్రధాన కారణం. కాబట్టి విద్యా సంస్థలు, క్రీడా మైదానాలు వీటికి దూరంగా ఏర్పాటు చేస్తే చిన్నారులను ఈ విషతుల్య వాయువుల నుంచి కాపాడొచ్చు. ⇒ రహదారుల వెంబడి ఆక్సిజన్ జనరేటర్లు, బూస్టర్లను ఏర్పాటు చేయాలి. ⇒ఎలక్ట్రిక్ వాహనాలను లేదా సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించాలి. -
ఇంతుల ఆరోగ్యం మరింత మెరుగ్గా...
కుటుంబ సంరక్షణలో తలమునకలయ్యే మహిళలు సొంత ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటారు. సరైన పద్ధతిలో ఆహారం తీసుకోకపోవడం... అందులోనూ పోషకాహారం లోపించడం... అవసరమైన మేరకు వ్యాయామం లేకపోవడం... సమయపాలన పాటించకపోవడం... ఇలాంటి సమస్యల వల్ల వారు లేనిపోని రుగ్మతలకు గురవుతుంటారు.నిత్యం వ్యాయామం లేకపోయినా... ఓ పద్ధతిలో ఆహారం తీసుకోవడం ద్వారా ఫిట్‌గా ఉండటానికి కొన్ని పద్ధతులు పాటించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) చెబుతోంది. అందుకోసం ఓ డైట్ చార్ట్‌ను కూడా రూపొందించింది. దీని ద్వారా వారు చాలా వరకూ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని అభిప్రాయపడింది.సాక్షి, అమరావతి: మహిళలు సంపూర్ణ పోషకాలు పొందేలా ప్రత్యేక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్(ఐసీఎంఆర్) చెబుతోంది. ఇందుకోసం రోజుకు 1670 కిలో కేలరీలు అందించే భోజనాన్ని సిఫారసు చేస్తోంది. తాము చేసే సూచనల ద్వారా బరువును అదుపులో ఉంచడంతో పాటు గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులనుంచి దూరంగా ఉండవచ్చని చెబుతోంది. వంట చేయడానికీ ఓ పద్ధతుందిదేశంలో 56.4శాతం వ్యాధులు అనారోగ్యకర ఆహారపు అలవాట్లతోనే వస్తున్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) చెబుతోంది. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల స్థూలకాయం, మధుమేహం, కరోనరీ హార్ట్ డిసీజ్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని స్పష్టం చేసింది. సమతుల్య ఆహారంతో పాటు రోజువారీ దినచర్యల్లో చిన్నపాటి శారీరక శ్రమ తప్పనిసరిగా అలవర్చుకోవాలని ఐసీఎంఆర్ సూచిస్తోంది. ముఖ్యంగా మెట్లు ఎక్కడం, విరామ సమయంలో చిన్నపాటి నడక, శరీర కదలికలతో కూడిన ఇంటి పనులు చేయాలని అభిప్రాయపడింది. తగినంత సమయం నిద్రపోవడం, శారీరక, మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారానికి దూరంగా ఉండాలని చెబుతోంది. దీనికోసం వంట చేయడానికి ఓ పద్ధతి అవసరమని స్పష్టం చేసింది. తినే ఆహారాన్ని స్టీమింగ్, ఉడకబెట్టడం, బేకింగ్ వంటి పద్ధతుల్లో వండాలనీ తద్వారా పోషక విలువలు కాపాడుకోవచ్చని వివరించింది.ఐసీఎంఆర్ సిఫారసు చేసిన డైట్ ఇలా..⇒ అల్పాహారం కోసం (ఉదయం 8–10 గంటల మధ్య): నానబెట్టిన/ఉడకబెట్టిన తృణధాన్యాలు(60గ్రా), ఉడకబెట్టిన నలుపు/ఎరుపు బీన్స్, లోబియా(బ్లాక్–ఐడ్ బఠానీలు)/చిక్పీస్(30గ్రా), పచ్చి ఆకు కూరలు(100గ్రా), గింజల(20గ్రా)తో కూడిన భోజనం చేయాలని. దీనిద్వారా ఉదయం 470 కిలో కేలరీలు లభ్యమవుతాయి.⇒ మధ్యాహ్న భోజనం (మధ్యాహ్నం 1–2 గంటల మధ్య): తృణధాన్యాలు(80గ్రా), గింజలు/విత్తనాల నూనెలతో వండిన కూరగాయలు(150గ్రా), పప్పు/మాంసం(20గ్రా), పెరుగు/పనీర్(150 మి.లీ), చివర్లో పండ్లు (50గ్రా) తిసుకోవాలి. ఈ భోజనం రోజుకు 750 కిలో కేలరీలు అందజేస్తుంది.⇒ సాయంత్రం స్నాక్స్ కోసం (సాయంత్రం 5 గంటలకు): శరీరానికి శక్తిని అందించడానికి ఎల్లప్పుడూ ఒక గ్లాసు పాలు తాగడం మంచిది. 50 మిల్లీలీటర్ల పాలు ఒక మహిళ శరీరానికి 35 కిలో కేలరీలు అందిస్తుంది.⇒ రాత్రి భోజనం (రాత్రి 7–8 గంటల మధ్య): మధ్యాహ్నం మాదిరిగానే రాత్రి భోజనంలో తృణధాన్యాలు(60గ్రా), పప్పులు (15గ్రా), గింజలు/విత్తనాల నూనె (5గ్రా), పెరుగు (100 మి.లీ), పండ్ల (50గ్రా)లో తీసుకోవాలి. ఇవి రోజుకు మొత్తం 415 కిలో కేలరీలు అందజేస్తాయని నివేదికలో పేర్కొంది. -
పేదల ఊసు పెద్దలకు పట్టదా?
భారతదేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. పౌష్టికాహార లోపంతో పిల్లలు, స్త్రీలు, బాలింతలు బాధపడుతున్నారు. కోట్లాది కార్మికులకు పనిలేదు. ఉద్యోగాలు లేక యువతకు పెళ్లిళ్ళు కూడా జరగడం లేదు. ఇదొక సామాజిక సమస్యగా రూపుదిద్దుకుంటోంది. బీజేపీ ఇచ్చిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అడ్రస్ గల్లంతైంది. మతం మనిషికి తిండి పెట్టదు అని ప్రజలు తెలుసుకుంటున్నారు. అలాంటి పార్టీతో చంద్రబాబు అంటకాగు తున్నారు. దేశంలో తమ పేరు మీద సాగుభూమి లేనివారు ఎందరో! ఊరు పేరేగాని ఊరిలో సెంటు భూమి లేదు. ‘ఇండియా’ కూటమి కూడా తన ప్రణా ళికలో భూమి పంపకాన్ని గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భూమి పంపకాన్ని నిరాకరించటం అంటే సామ్యవాదాన్ని నిరాకరించటమే!18వ సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు విడతలుగా జరుగుతున్నాయి. తిరిగి మళ్లీ మూడోసారి అధికారంలోనికి రావడానికి మోదీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఉత్తరప్రదేశ్ మీద అయితే వాళ్లు ఎక్కువ ఆధారపడి ఉన్నారో అక్కడ సామాజిక రాజకీయ చైతన్యం పెల్లుబికింది. ముఖ్యంగా ముస్లింలలో ఎంతో మార్పు రావడం వల్లే రాయబరేలీలో రాహుల్ గాంధీ నిలబడటానికి పూనుకున్నారు. మతోన్మాద దాడులు, మహిళా సాధికారతను పునాదులతో తొలిచే భావజాలం, కార్పొరేట్ శక్తులకు దేశాన్ని తాకట్టు పెడుతున్న బీజేపీ విధానాలు లౌకికవాదులను, ఓబీసీలను, దళితులను, స్త్రీలను ఆలో చింపజేస్తున్నాయని చెప్పక తప్పదు. ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దు ద్వారా జమ్మూ కశ్మీర్ శాసనసభను రద్దుచేసి, ఆ రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విడగొట్టిన ఉదంతాన్ని ప్రజాస్వామిక వాదులు అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రాల ఆదాయాన్ని తగ్గించి, జీఎస్టీ ద్వారా కేంద్రీకృత ఆర్థిక పెత్తనాన్ని పెంచి, రాష్ట్రాల ఉనికిని నామమాత్రం చేయా లని చేస్తున్న ప్రయత్నాలను కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు కలిగిన భాష, సంస్కృతి, విద్య, విద్యుత్, మానవ వనరులపై కూడా కేంద్ర ప్రభుత్వమే పెత్తనం చేయాలనే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలు చైతన్యవంతంగా ఆలోచిస్తు న్నాయి. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన పత్రికల మీద చేస్తున్న దాడి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా జరగలేదని జర్నలిస్టు మేధావులు వాపోతున్నారు.ఏప్రిల్ చివరి వారంలో వచ్చిన ‘గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్’ ప్రకారం, భారతదేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. పౌష్టికాహార లోపంతో పిల్లలు, స్త్రీలు, బాలింతలు బాధపడుతు న్నారు. అత్యధిక స్త్రీలు రక్తలేమితో ఇబ్బంది పడుతున్నారు. కోట్లాది మంది కార్మికులకు పనిలేదు. భారతదేశం మొత్తం వలసలతో అన్నా ర్తులై పొట్ట చేత పట్టుకుని నగర శివారుల్లోని మురికివాడలలో జీవిస్తు న్నారు. నిజానికి పంజాబ్ రైతులు చేసిన రైతు ఉద్యమ ప్రభావం భారతదేశం మొత్తం మీద ఉంది. సంయుక్త కిసాన్ మోర్చా హోరా హోరీ రైతు ఉద్యమాన్ని నడిపింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టా లను రద్దు చేయాలనే డిమాండ్‌పై రాజీలేని పోరాటం చేసింది.ముఖ్యంగా అడవుల నరికివేత వల్ల, నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల దేశంలో తీవ్రంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మండుటెండల్లో ప్రజలు ఆహారం కోసం పని చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. మతం మనిషికి అన్నం పెట్టదు అని ప్రజలు తెలుసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా భారతదేశంలో 75 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా గ్రామాలలో మంచి నీళ్ళు దొరకడం లేదు. మద్యాన్ని అందించటంలో సఫలమైన ప్రభు త్వాలు, మంచినీళ్లు అందించడంలో విఫలమయ్యాయి.ఇకపోతే దేశంలో నిరుద్యోగం విలయ తాండవం చేస్తోంది. ఉద్యో గాలు లేక యువతకు పెళ్లిళ్ళు కూడా జరగడం లేదు. ఇదొక సామాజిక సమస్యగా రూపుదిద్దుకుంటోంది. కాగా ఎన్నికల నేపథ్యంలో నిరు ద్యోగం ప్రధాన అంశంగా చర్చకొస్తోంది. ప్రతిపక్ష నేతలు నిరుద్యోగ సమస్యపై నిలదీస్తుండగా అధికార బీజేపీ నేతలు సమస్యను పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రధాని మోదీ ప్రసంగాలు, బీజేపీ మేనిఫెస్టో యువతకు భరోసా కల్పించలేదు. పైగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అడ్రస్ గల్లంతైంది. నిరుద్యోగ రేటు పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఇకపోతే ‘ఇండియా’ కూటమి కూడా తన ప్రణాళికలో భూమి పంపకాన్ని గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో కోట్లాది మందికి సాగుభూమి సెంటు కూడా లేదు. ఊరు పేరేగాని ఊరిలో సెంటు భూమి లేదు. ఇంటి స్థలం లేదు. మంచినీళ్ల వసతి లేదు. చనిపోతే పాతిపెట్టడానికి శ్మశానం లేదు. దేశంలోని సుమారు 7 లక్షల గ్రామాల్లో అంటరానితనం కొనసాగు తూనే వుంది. భారతదేశంలో దళితులు ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం లేక పేదరికంలో, అస్పృశ్యతలో, అవిద్యలో మగ్గిపోతున్నారు. బీటెక్‌లు, ఎంటెక్‌లు, బీఏలు, ఎంఏలు చదివినా నిరుద్యోగు లుగా, ఉపాధి హామీ కూలీలుగా జీవిస్తున్నారు. ఈ రోజున దళిత వాడల్లో విద్యార్థులు, స్త్రీలు నిరాశా నిస్పృహలలో జీవిస్తున్నారు. వారి కుటుంబానికి తలా రెండెకరాల భూమి ఇవ్వటం ద్వారా ఆర్థిక సాధికారతను కల్గిస్తాం అని ఏ ప్రభుత్వమూ చెప్పటం లేదు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు అంబేడ్కర్ ఆలోచనకు భిన్నంగా ఉన్నాయి.భూమి పంపకాన్ని నిరాకరించటం అంటే సామ్యవాదాన్ని నిరాకరించటమే. ఇప్పుడు ఎన్నికల్లో ప్రకటించిన ఏ మేనిఫెస్టోలో కూడా భూమి పంపకం గురించి రాయక పోవటం, అస్పృశ్యతా నివా రణ ఒక ఎన్నికల ఎజెండాగా లేకపోవటం, కుల నిర్మూలన కార్యక్రమం ఎవరి లక్ష్యంగా లేకపోవటాన్ని దళిత మేధావులు, ఆలోచనాపరులు అర్థం చేసుకుంటున్నారు. రాజ్యాధికారమే వీటన్ని టికీ పరిష్కారం అని ఆలోచిస్తున్నారు. నిజానికి ప్రసిద్ధమైన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో, ఐఐటీల్లో, వైద్య విశ్వవిద్యాలయాల్లో, అన్ని కళా శాలల్లో దళిత విద్యార్థులు ఎంతో వివక్షకు గురి అవుతున్నారు.మోదీ ఇంత తిరోగమన చర్యలతో ముందుకు వెళ్తుంటే, నారా చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమిలో చేరటం ఆయనకున్న దళిత వ్యతిరేకతనూ, హిందూ మతోన్మాద భావజాలాన్నీ, కులాధి పత్య వైఖరినీ, మైనారిటీల పట్ల ద్వేషాన్నీ తెలియజేస్తున్నాయి. చంద్రబాబు నాయుడుకూ, మోదీకీ మధ్య భావజాలంలో, దళితులు, స్త్రీల పట్ల వ్యతిరేకతలో ఏ విధమైన తేడాలేదు అని అర్థం అవుతోంది. ముఖ్యంగా మోదీ యూనివర్సిటీల్లో జీవపరిణామ, మానవ పరిణామ చారిత్రక సిద్ధాంతాల బోధనకు భిన్నంగా మతవాద భావజాలాన్ని ప్రోత్సహించటం లౌకిక భావజాల వ్యాప్తికి గొడ్డలి పెట్టు అవుతుంది.ఇకపోతే అంబేడ్కర్ భావజాల ప్రచారంలో తమిళనాడు ముందుంది. తమిళనాడులోని అన్ని థియేటర్లలో సినిమా ప్రారంభంలో అంబేడ్కర్ జీవిత పోరాటం గురించి ఐదు నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీ ప్రదర్శించాలని అక్కడి ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆదేశించారు. అంబేడ్కర్ ఆ రాజ్యాంగం ద్వారానే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ముఖ్యమంత్రులు ప్రధానులు, రాష్ట్రపతులు అవుతున్నారని గ్రహించాలి.అంబేడ్కర్ రాజ్యాంగం భారతదేశ పునర్ నిర్మాణానికి ఆయువు పోసింది. ఏ దేశంలో స్త్రీ వ్యక్తిత్వంతో జీవిస్తుందో, ఏ దేశంలోకుటుంబ వ్యవస్థ బలంగా నిలబడుతుందో, ఏ దేశంలో స్త్రీ ఉత్పత్తి శక్తి దేశ సౌభాగ్యానికి ఊపిరి పోస్తుందో ఆ దేశం ఆర్థిక సంపదవున్న ప్రపంచ పంక్తిలో నిలబడగలుగుతుంది. నిజానికి అంబేడ్కర్ అడుగు అడుగులో స్త్రీ సమానత్వం కోసం పోరాడారు. వారి అభ్యున్నతి కోసం, వారి విద్యాభ్యాసం కోసం, వారి సాధికారిత కోసం, వారి భావ చైతన్యం కోసం, వారి రాజకీయ హక్కుల కోసం పోరాడారు. హిందూ కోడ్ బిల్లు విషయంలో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా రాజీనామా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి హిందూ కోడ్ బిల్లును సాధించారు. ఈనాడు ప్రభుత్వాలు స్త్రీ సాధికారితను నిలబెట్టాలి అంటే నిరుద్యోగులయిన స్త్రీలకు ఉద్యోగ వసతి కల్పించాలి. విధవరాండ్రకు నెలకు పది వేల రూపాయల పింఛన్ ఇవ్వ గలిగిన స్థాయికి రావాలి. ప్రతి దళిత స్త్రీకి రెండు ఎకరాల భూమి ఇచ్చి భారతదేశంలో వ్యవసాయ విస్తృతికి కృషి చేయాలి. ఇంటింటికీ మంచినీటి వసతి, విద్యుత్ వసతి కల్పించి, ఆరోగ్య సంరక్షణ కోసం పౌష్టికాహారాన్ని అందించి స్త్రీ శారీరక మానసిక శక్తిని పెంచి దేశ సౌభాగ్యానికి బాటలు వేయాలి. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
ప్రపంచ ఆకలి సూచీలో...మనకు 111వ స్థానం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆహార సూచీ–2023లో భారత్ 111వ స్థానంలో నిలిచింది. గురువారం విడుదల చేసిన ఈ సూచీలో మొత్తం 125 దేశాల్లో మనకు ఈ ర్యాంకు దక్కింది. దీన్ని లోపభూయిష్టమైనదిగా కేంద్రం కొట్టిపారేసింది. ‘ఇది తప్పుడు ర్యాంకింగ్. దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన బాపతు‘ అంటూ మండిపడింది. అన్ని రకాలుగా పీకల్లోతు సంక్షోభంలో మునిగిన పాకిస్తాన్ (102), అంతే సంక్షోభంలో ఉన్న శ్రీలంక (60)తో పాటు బంగ్లాదేశ్ (81), నేపాల్ (61) మనకంటే చాలా మెరుగైన ర్యాంకుల్లో ఉండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 28.7 స్కోరుతో ఆకలి విషయంలో భారత్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని నివేదిక చెప్పుకొచ్చింది. 27 స్కోరుతో దక్షిణాసియా, సహారాకు దక్షిణాన ఉన్న ఆఫ్రికా ప్రాంతాలు ఆకలి సూచీలో టాప్‌లో ఉన్నట్టు చెప్పింది. ‘భారత బాలల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా 18.7గా ఉంది. ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాల రేటు 3.1 శాతం, 15–24 ఏళ్ల లోపు మహిళల్లో రక్తహీనత ఉన్నవారి సంఖ్య ఏకంగా 58.1 శాతం ఉన్నాయి‘ అని పేర్కొంది. వాతావరణ మార్పులు, కల్లోలాలు, మహమ్మారులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటివి ఆకలి సమస్యను ఎదుర్కోవడంలో అవరోధాలుగా నిలిచాయని సర్వే పేర్కొంది. ఇదంతా అభూత కల్పన అంటూ కేంద్రం మండిపడింది. ‘ఇది తప్పుడు పద్ధతులు వాడి రూపొందించిన సూచీ. కేవలం 3,000 మందిపై నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఆధారంగా పౌష్టికాహార లోపం శాతాన్ని నిర్ధారించడం క్షమార్హం కాని విషయం. దాంతో బాలల్లో వాస్తవంగా కేవలం 7.2 శాతమున్న పౌష్టికాహార లోపాన్ని ఏకంగా 18.7గా చిత్రించింది. దీని వెనక దురుద్దేశాలు ఉన్నాయన్నది సుస్పష్టం‘ అంటూ విమర్శించింది. -
‘సంపూర్ణ’ ఆరోగ్యం
సాక్షి, అమరావతి: ఆరోగ్యవంతమైన భావి తరాల కోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. డబ్బులకు వెనుకాడకుండా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఖర్చు చేస్తూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. డ్రై రేషన్ కింద అందించే సరుకుల నాణ్యతను నిరంతరం సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు పరీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఫౌండేషన్ స్కూళ్లలో చిన్నారుల బోధనపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఆంగ్ల భాషలో పరిజ్ఞానం, ఉచ్చారణ బాగుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతల కోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ టేక్ హోం రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించి లబ్ధిదారులకు స్వయంగా సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. గతంతో పోలిస్తే ఐదు రెట్లు అధికంగా వ్యయం రక్తహీనత, పౌష్టికాహారలేమి రాష్ట్రంలో పూర్తి తొలగిపోవాలనే లక్ష్యంతో భారీ ఖర్చు గర్భిణిలు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహారం కోసం గత ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.450 – రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు ఏటా సుమారు రూ.2,300 కోట్లు వ్యయం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. పౌష్టికాహారాన్ని అందించేందుకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద ఒక్కొక్కరికీ రూ.850 చొప్పున ఖర్చు చేస్తుండగా సంపూర్ణ పోషణ ప్లస్ కోసం రూ.1,150 చొప్పున వ్యయం చేస్తున్నట్లు చెప్పారు. రక్తహీనత, పౌష్టికాహార లేమి లాంటి సమస్యలు రాష్ట్రంలో పూర్తిగా తొలగిపోవాలన్న లక్ష్యంతో ఇంత ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలన్నీ మంచి ఫలితాలనిచ్చేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఫ్యామిలీ డాక్టర్లు అంగన్వాడీల సందర్శన తప్పనిసరి ఫ్యామిలీ డాక్టర్లు గ్రామాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా అంగన్వాడీలను సందర్శించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. పిల్లలు, తల్లులు, బాలింతల ఆరోగ్యాన్ని పరిశీలించి ఏమైనా సమస్యలుంటే మంచి వైద్యాన్ని అందించాలని సూచించారు. బాలికా విద్య ప్రోత్సాహ పథకాలపై అవగాహన బాల్య వివాహాల నిరోధం, అక్షరాస్యత పెంపు, బాలికలు ఉన్నత చదువులు అభ్యసించేలా ప్రోత్సహించే లక్ష్యంతో తెచ్చిన అమ్మ ఒడి, కళ్యాణమస్తు, వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు ఎలా ఉపయోగపడతాయో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా పథకాలు బాల్య వివాహాలను ఎలా నిరోధిస్తాయో వివరించాలన్నారు. కళ్యాణమస్తు కింద లబ్ధి పొందాలంటే వధూవరులు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్న నిబంధన అందుకే విధించామన్నారు. రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలపై ముమ్మరంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. అంగన్వాడీల్లో పరిశుభ్ర వాతావరణం అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందుకోసం క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలన్నారు. టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండాలని, అంగన్వాడీ కేంద్రాలకు మరమ్మతుల సమయంలో ఈ అంశాన్ని ప్రాధాన్యతగా పరిగణించాలని సూచించారు. చిన్నారులకు బోధనలో నాణ్యతకు పెద్దపీట ఫౌండేషన్ స్కూల్ చిన్నారులకు విద్యా బోధనలో నాణ్యతకు పెద్దపీట వేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇప్పుడున్న విద్యా విధానం కాకుండా ఇతర మార్గాలను కూడా పరిశీలించాలని సూచించారు. ఫౌండేషన్ స్కూల్ (పీపీ–1, పీపీ–2) పిల్లల్లో ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం, ఫోనిటిక్స్, ఉచ్ఛారణ లాంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. నిర్దేశించుకున్న సిలబస్‌ను వినూత్న బోధనా విధానాలతో నేర్పించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. పునాది బాగుంటే పై తరగతుల్లో సాఫీగా చిన్నారులకు మూడో తరగతి నుంచే టోఫెల్ పరీక్షకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం మొదలైందని సీఎం జగన్ చెప్పారు. ఇప్పుడు పీపీ–1 నుంచి రెండో తరగతి పిల్లల మీద దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల మెదడు గరిష్టంగా వికసించే వయసు కాబట్టి వినూత్న బోధనా విధానాల ద్వారా మంచి భాషా జ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వయసులో పునాది గట్టిగా ఉంటే పై తరగతుల్లో విద్యార్థుల ప్రయాణం సాఫీగా సాగుతుందన్నారు. మాంటిస్సోరి విద్యా విధానంపై సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ చర్చించారు. అధికారులు తొలుత మాంటిస్సోరి స్కూళ్లను పరిశీలించాలని సూచించారు. సమీక్షలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ ఎండీ ఏ.బాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతులు కల్పన) కమిషనర్ కాటమనేని భాస్కర్, పౌర సరఫరాల శాఖ ఎండీ జి.వీరపాండ్యన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఏ.విజయ సునీత తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణతో నెలకు అందించే రేషన్ సరుకులు – 2 కిలోలు రాగి పిండి – 1 కేజీ అటుకులు – 250 గ్రాముల బెల్లం – 250 గ్రాముల చిక్కీ – 250 గ్రాముల ఎండు ఖర్జూరం – 3 కేజీల బియ్యం – 1 కేజీ పప్పు – అర లీటర్ వంటనూనె – 25 గుడ్లు – 5 లీటర్ల పాలు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్‌తో నెలకు అందే రేషన్ సరుకులు – 1 కేజీ రాగి పిండి – 2 కిలోలు మల్టీ గ్రెయిన్ ఆటా – 500 గ్రాముల బెల్లం – 500 గ్రాముల చిక్కీ – 500 గ్రాముల ఎండు ఖర్జూరం – 3 కేజీల బియ్యం – 1 కేజీ పప్పు – అర లీటరు వంటనూనె – 25 గుడ్లు – 5 లీటర్ల పాలు -
‘బంగారు కొండ’లకు పోషకాహారం!
సాక్షి, రాజమహేంద్రవరం : చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించి, సంపూర్ణ పోషణ అందించేందుకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె.మాధవీలత వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ‘బంగారుకొండ’ పేరుతో నూతన విధానానికి బుధవారం నాంది పలికారు. వయసుకు తగ్గ బరువు, ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లల్ని బాల మిత్రల ద్వారా గుర్తించి సాధారణ స్థితికి తెచ్చే వరకూ 6 నెలల పాటు నెలకు రూ.300 విలువ చేసే 8 రకాల పోషక పదార్థాలను దాతల సాయంతో అందివ్వాలన్నదే కార్యక్రమ ఉద్దేశం. కలెక్టరేట్ వేదికగా వెబ్సైట్, ఆండ్రాయిడ్ యాప్‌ను హోం మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావ్, కలెక్టర్ కె.మాధవీలతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే పిల్లల్లో పౌష్టికాహార సమస్యను దూరం చేయాలని సీఎం జగన్.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ లాంటి పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి కనీసం ఇద్దరు ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని వారి ఎదుగుదల, పౌష్టికాహార సమస్యను అధిగమించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం దాతలు నెలకు రూ.500 చొప్పున ఆరు నెలలకు రూ.3,000 వేలు చెల్లించి బాలమిత్రగా నమోదు కావాలని సూచించారు. పలువురు చిన్నారుల బాధ్యత తీసుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు పౌష్టికాహార సమస్యతో బాధపడుతున్న పిల్లల్ని ఆరు నెలల పాటు పోషణ నిమిత్తం దత్తత తీసుకునేందుకు ప్రజా ప్రతినిధులు ఉత్సాహం చూపారు. హోం మంత్రి వనిత ఓ చిన్నారిని, ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఇద్దరిని, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావ్‌లు ఇద్దరు చొప్పున, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, కమిషనర్ దినే‹Ùకుమార్‌లు చెరో చిన్నారిని దత్తత తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 85,700 మంది పిల్లలుంటే.. వారిలో తక్కువ బరువు ఉన్న పిల్లలు 368 మంది, వయస్సుకు తగ్గ ఎత్తు లేని వారు 506 మంది, బరువుకు తగ్గ ఎత్తు లేని వారు 409 మందిని గుర్తించినట్లు తెలిపారు. ఆ మేరకు 1,283 మంది పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేందుకు 1,283 మంది బాల మిత్రలుగా అధికారులు, ప్రజా ప్రతినిధులు పేర్లు నమోదు చేసుకున్నారు. -
ఆరోగ్య సిరులు.. పోషకాహార లోపాన్ని నివారించే చిరుధాన్యాలు
సాక్షి, అమరావతి: పోషకాహార లోపాన్ని నివారించి, ఆరోగ్యాన్ని పెంపొందించే చిరు ధాన్యాల (మిల్లెట్స్)ఉత్పత్తి పెంపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశంలో ఏడు రాష్ట్రాలు మిల్లెట్ మిషన్లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, అస్సోం, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు మిల్లెట్ మిషన్లు ఏర్పాటు చేశాయని వివరించింది. ఈ ఏడాది అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా జరుపుకుంటున్న నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాలు చిరుధాన్యాల ఉత్పత్తిని, స్థానిక వినియోగాన్ని పెంచడంపై దృష్టి సారించినట్లు కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చిరుధాన్యాల ఉత్పత్తి, డిమాండ్‌ను పెంచేందుకు రాష్ట్రాలకు సహకారం అందిస్తున్నట్లు తెలిపింది. దేశంలో 170.67 లక్షల టన్నుల చిరుధాన్యాల ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్రంలో 4.64 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచంలో అత్యధికంగా చిరుధాన్యాలు పండించేంది భారతదేశంలోనే. భారతదేశంలోనే 41 శాతం చిరుధాన్యాలు పండిస్తున్నారు. దేశవ్యాప్తంగా చిరు ధాన్యాల వేడుకలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంవత్సరం అంతా చిరుధాన్యాల వేడుకలను నిర్వహిస్తున్నాయి. 2023–24లో దేశాన్ని చిరుధాన్యాలకు గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాయి. మిల్లెట్స్ ఉత్పత్తి, డిమాండ్ పెంచేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఉత్పాదకతను పెంచడం, వినియోగం, ఎగుమతి, విలువను బలోపేతం చేయడం, బ్రాండింగ్, సృష్టించడం వంటి వాటిపై దృష్టి పెట్టాయి. వీటి వినియోగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నెలవారీ కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నాయి. చిరుధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు అవసరమైన సాంకేతికత, మెరుగైన వ్యవసాయ పనిముట్లు, వనరులు, సీడ్ హబ్‌ల ఏర్పాటులో విషయంలో కేంద్రం రాష్ట్రాలకు సహకారం అందిస్తోంది. 2023–24 సంవత్సరమంతా కేంద్ర మంత్రిత్వ శాఖలు చిరుధాన్యాలతో కూడిన తినుబండారాలనే అందించనున్నాయి. విమానాలు, రైళ్లలో చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందించనున్నారు. అన్ని బహిరంగ ప్రదేశాల్లో మిల్లెట్ వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేస్తారు. డిఫెన్స్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ల్యాబ్, పోలీస్ ఫోర్స్ క్యాంటీన్లలోనూ చిరుధాన్యాల ఆహారాన్ని అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చర్యలు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగం పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉత్పత్తిని, వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా మిల్లెట్ మిషన్ ఏర్పాటు చేసింది. చిరుధాన్యాలు పండించే రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. పోషకాహార లోపం నివారణకు చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తోంది. జగనన్న గోరుముద్దలో భాగంగా పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి మార్చి 2 నుంచి రాగి జావ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాదంతా చిరుధాన్యాల వేడుకలను నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. -
ఫోర్టిఫైడ్ రైస్.. బియ్యానికి బలం
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజల్లో రక్తహీనత సమస్య చాపకింద నీరులా విస్తరిస్తోంది. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులతోపాటు మైదాన ప్రాంతాల్లోని పేదలు, పాఠశాల విద్యార్థుల్లో ఈ సమస్య అధికంగా ఉంటోంది. పోషకాహార లోపం వల్ల సంభవించే రక్తహీనత సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బలవర్థక బియ్యాన్ని (ఫోర్టిఫైడ్ రైస్) ప్రజలకు అందించాలని నిర్ణయించింది. ఐసీడీఎస్, పీఎం పోషణ్ పథకాలతోపాటు దేశంలోని 151 జిల్లాల్లో గతేడాది ఏప్రిల్ నుంచే ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ అందిస్తోంది. అందులో తెలంగాణలోని ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాలతోపాటు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని రేషన్ షాపులు కూడా ఉన్నాయి. ఏప్రిల్ నుంచి రాష్ట్రంలోని మిగతా 27 జిల్లాల్లోనూ పీడీఎస్ ద్వారా ఫోర్టిఫైడ్ రైస్‌నే ఇవ్వాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్‌ను సాధారణ బియ్యంలో కలపడం వల్ల వచ్చేవే బలవర్థక బియ్యం. అసలు దీన్ని ఎలా తయారుచేస్తారు.. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ తయారీ ఇలా... ►98 శాతం బియ్యపు పిండికి 2 శాతం ఖనిజాలను కలిపి హాట్ ఎక్స్‌ట్రూషన్ టెక్నాలజీ ద్వారా 90 డిగ్రీలకన్నా తక్కువ వేడిలో జెలటనైజేషన్ (జెల్గా తయారు) చేసి దాన్ని బియ్యం ఆకారంలోకి మారిస్తే వచ్చేవే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్. 10 గ్రాముల ఎఫ్ఆర్కే కోసం 28 మిల్లీగ్రాముల నుంచి 48 మిల్లీగ్రాముల ఐర¯Œ 75 మైక్రో గ్రాముల నుంచి 125 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్ (బీ–9 విటమిన్), 0.75 మైక్రో గ్రాముల నుంచి 1.25 మైక్రో గ్రాముల బీ–12 విటమిన్ (కొబాలమైన్ )ను కలుపుతారు. ఈ నిష్పత్తిలో కలిపే ఖనిజాలు, విటమిన్లతో కుర్కురే వంటి తినుబండారాలు తయారు చేసే తరహాలో ప్రత్యేక యంత్రాల ద్వారా బియ్యం అచ్చుల్లో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ తయారు చేస్తారు. బలవర్థక బియ్యం కలిపే తీరిదీ... ►సాధారణ బియ్యానికి 1:100 నిష్పత్తిలో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్‌ను మిల్లుల్లో కలుపుతారు. అంటే క్వింటాలు బియ్యానికి కిలో ఎఫ్ఆర్కే కలుపుతారన్నమాట. సాధారణ బియ్యం తరహాలోనే ఉండే ఈ ఎఫ్ఆర్కే బియ్యంలో కలిసిపోతాయి. వండిన అన్నం తరహాలోనే... ►ఎఫ్ఆర్కేతో కూడిన బియ్యాన్ని వండినప్పుడు వాటి పోషకాలు ఆవిరవ్వడం, అన్నం వార్చినప్పుడు గంజితో కలిసి బయటకు పోవడం జరగదని పౌరసరఫరాల సంస్థకు ఫోర్టిఫైడ్ రైస్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న బాలగంగాధర్ తిలక్ చెబుతున్నారు. ఒకవేళ పోషకాలు పోయినా 10 శాతం లోపేనని, మిగతా 90 శాతం అన్నంతోపాటే ఉంటాయని ఆయన ‘సాక్షి’కి చెప్పారు. ఈ నేపథ్యంలో బియ్యాన్ని ప్రెషర్ కుక్కర్లో వండాలని కేంద్రం సూచిస్తోందన్నారు. రాష్ట్రంలో 7 యూనిట్లు... ►ఎఫ్ఆర్కే తయారు చేసే యూనిట్లు ఎక్కువగా పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌లలో ఉన్నాయి. తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, ములుగు, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎఫ్ఆర్కే యూనిట్లు ఉన్నాయి. మనకు కొత్తేం కాదు... ►మనం నిత్యం ఆహారంలో వినియోగించే పలు పదార్థాలు ఫోర్టి ఫైడ్ విధానంలో రూపొందినవే. నిత్యం వాడే ప్యాకెట్ పాలతోపాటు అయోడిన్గల ఉప్పు, గోధుమపిండి, వంట నూనె ఫోర్టిఫైడ్ విధానంలో ఖనిజాలు, విటమిన్లను కలిపి తయారు చేస్తారు. ఈ నాలుగింటితోపాటు ఇప్పుడు దేశంలో వినియోగించే బియ్యం కూడా ఫోర్టిఫైడ్ విధానంలోనే తయారు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 30 దేశాల్లో... ►మన దేశంలో గతేడాది నుంచి ఫోర్టిఫైడ్ రైస్‌ను వినియోగంలోకి తెచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల్లో ఇప్పటికే ఈ రకమైన బియ్యాన్ని వాడుతున్నారు. అమెరికాలో 2019లోనే 80 వేల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్‌ను వినియోగించినట్లు తెలుస్తోంది. కోస్టారికా, నికరగ్వా, పనామా, పాపువా న్యూగినియా, సోలొమన్ దీవులు, ఫిలిప్పీన్స్లలో బలవర్థక బియ్యం వాడకం తప్పనిసరి. అలాగే మరికొన్ని ఆఫ్రికా దేశాలతోపాటు కిర్గిస్తాన్, లావోస్, నేపాల్‌లలోనూ ఫోర్టిఫైడ్ రైస్‌ను వినియోగిస్తున్నారు. -
పిల్లల్లో పోషకాహార లోపం.. తెలంగాణలో 1.20 లక్షల మందిలో గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. మొత్తం 1.20 లక్షల మందిలో పోషకాహార లోపం ఉందని తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ (గణాంక నివేదిక)–2022 వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 19.79 లక్షల మంది పిల్లలు ఉంటే, అందులో 6.09 శాతం మంది పోషకాహార (న్యూట్రిషన్) లోపంతో బాధపడుతున్నారు. 1.83 శాతం మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని నివేదిక పేర్కొంది. కాగా 12.18 లక్షల మంది పిల్లలు న్యూట్రిషన్ సప్లిమెంటరీలు (అదనపు పోషకాలు) తీసుకుంటున్నారు. అత్యధి కంగా సిద్దిపేట జిల్లాలో 78.4 శాతం మంది పిల్లలు సప్లిమెంటరీలు తీసుకుంటుండగా, అత్యంత తక్కువగా కామారెడ్డి జిల్లాలో 20.9 శాతం మంది తీసుకుంటున్నారు.2021–22 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 4.92 లక్షల మంది తల్లులు సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కింద నమోదయ్యారు. అందులో 2.58 లక్షల మంది న్యూట్రిషన్ సప్లిమెంటరీలు తీసుకుంటున్నారని నివేదిక వెల్లడించింది. న్యూట్రిషన్ సప్లిమెంటరీలు తీసుకునేవారిలో అత్యధికంగా జగిత్యాలలో 62.9 శాతం మంది ఉండగా, అత్యంత తక్కువగా కామారెడ్డి జిల్లాలో 26.9 శాతం మంది ఉన్నారు. 97,448 మందికి కేసీఆర్ కిట్... రాష్ట్రంలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నాటికి 97,448 మందికి కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. కేసీఆర్ కిట్ పథకం 2017 జూన్ రెండో తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. మాతృత్వ, శిశు మరణాల రేటును తగ్గించాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. మగ బిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడిపిల్ల పుడితే రూ.13 వేలు తల్లులకు అందజేస్తున్నారు. అలాగే టవళ్లు, సబ్బులు, పౌడర్‌తో కూడిన కిట్‌ను కూడా ఇస్తున్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు... ► జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 (ఎన్ఎఫ్ హెచ్ఎస్–5) ప్రకారం రాష్ట్రంలో 6–59 నెలల మధ్య చిన్నారుల్లో 70 శాతం మంది రక్తహీన తతో బాధపడుతున్నారు. ఎన్ఎఫ్హెచ్ఎస్–4 ప్రకారం అది 60.7 శాతంగా ఉంది. ► ఎన్ఎఫ్హెచ్ఎస్–5 ప్రకారం రాష్ట్రంలో 15–49 ఏళ్ల మధ్య వయస్సు గల గర్భిణుల్లో 53.2 శాతం మందిలో రక్తహీనత నమోదయ్యింది. ► అన్ని కేటగిరీలకు చెందిన 15–49 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో 57.6 శాతం మంది, పురుషుల్లో 15.3 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ► మహిళల్లో అత్యంత తీవ్రమైన బ్లడ్ షుగర్ లెవల్స్ ఉన్నవారు ఎన్ఎఫ్హెచ్ఎస్–4 ప్రకారం 3.9 శాతం మంది ఉండగా, ఎన్ఎఫ్హెచ్ఎస్–5 ప్రకారం 7 శాతం ఉన్నారు. ► పురుషుల్లో ఎన్ఎఫ్హెచ్ఎస్–4 ప్రకారం అత్యంత తీవ్రమైన బ్లడ్ షుగర్ లెవల్స్ ఉన్నవారు 4.1 శాతం ఉండగా, ఎన్ఎఫ్హెచ్ఎస్–5 ప్రకారం రెట్టింపునకు పైగా 9.3 శాతం ఉన్నారు. ► ఎన్ఎఫ్హెచ్ఎస్–4 ప్రకారం మహిళల్లో మధ్యస్తం నుంచి తీవ్రమైన బీపీ ఉన్నవారు 1.7 శాతం ఉండగా, ఎన్ఎఫ్హెచ్ఎస్–5 ప్రకారం ఏకంగా 6.3 శాతం ఉన్నారు. ► ఎన్ఎఫ్హెచ్ఎస్–4 ప్రకారం పురుషుల్లో మధ్యస్థం నుంచి తీవ్రమైన బీపీ ఉన్నవారు 3.5 శాతం ఉండగా, ఎన్ఎఫ్హెచ్ఎస్–5 ప్రకారం 8.1 శాతం ఉన్నారు. ► రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు 1.33 లక్షల మంది ఉన్నారు. చదవండి: తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య ఎంతో తెలుసా? -
షాకింగ్! మంచి తిండికి దూరంగా 300,00,00,000 మంది
- కంచర్ల యాదగిరిరెడ్డి తిండి కలిగితే కండగలదోయ్... కండ కలవాడేను మనిషోయ్.. అని మహాకవి ఎప్పుడో చెప్పాడు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కొద్దోగొప్పో అందరూ తిండి తినడమైతే తింటున్నారు కానీ, ఈ భూమి మీద సుమారు 300 కోట్ల మంది ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారానికి దూరంగా ఉన్నారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ఈ విషయాన్ని స్పష్టం చేయడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 138 దేశాల సమాచారాన్ని ఈ సంస్థ విశ్లేషించింది. తన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికల్లా భూమ్మీద ఆకలన్నది లేకుండా చేయాలని ఎఫ్ఏఓ తీర్మానం చేసుకుంది. అయితే ఏటేటా ఆరోగ్యకరమైన తిండికి దూరమవుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏడాదిలో11.2 కోట్ల పెరుగుదల తిండి లేని పేదల గురించి తరచూ వార్తలు వస్తుంటాయి కానీ, తిన్న తిండితో ఆరోగ్యంగా ఉండలేని వారి గురించి తెలిసింది తక్కువే. ఈ క్రమంలోనే ఎఫ్ఏఓ ప్రతి దేశంలో ఆరోగ్యకరమైన తిండి తినగలిగిన వాళ్లు ఎంతమంది? అసలు ఆరోగ్యకరమైన తిండి అంటే ఏమిటన్నది తెలుసుకుని వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం 2020లో ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేని వారి సంఖ్య 300 కోట్లు. 2019 గణాంకాలతో పోలిస్తే 11.2 కోట్లు ఎక్కువ. దీనికి ప్రధాన కారణం ఆహారపు ధరలు పెరగడమేనని సంస్థ చెపుతోంది. ఈ మేరకు ఆదాయం పెరగకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించింది. దీని ప్రభావం ధనిక దేశాలపై కాకుండా, ఆహార ద్రవ్యోల్బణం అదుపు తప్పడం ద్వారా పేద దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తుందని తేల్చి చెప్పింది. శక్తి అవసరాలను తీర్చగలగాలి ఒక మనిషి రోజువారీ శక్తి అవసరాలను తీర్చగలిగేదే ఆరోగ్యకరమైన ఆహారమని ఎఫ్ఏఓ నిర్వచిస్తోంది. అలాగే ఆయా దేశాల్లో నిర్వచించుకున్న పౌష్టికాహార మార్గదర్శకాలనూ సంతృప్తి పరచాలి. ఉదాహరణకు భారత్‌లో ప్రతి ఒక్కరు రోజుకు కనీసం 400 గ్రాముల కాయగూరలు, పండ్లు తినడం అవసరమని జాతీయ పోషకాహార సంస్థ పేర్కొంటోంది. చాలామంది ఈ స్థాయిలో వీటిని తీసుకోవడం లేదు. పైగా ఈ మోతాదుల్లో కాయగూరలు, పండ్లు తీసుకునే స్థోమత కూడా కొందరికి ఉండదు. ఒక కుటుంబం రోజువారీ ఆదాయంలో 52% లేదా అంతకంటే ఎక్కువను ఆహారానికి వెచి్చంచాల్సిన పరి స్థితి ఉంటే, దాన్ని స్థోమతకు మించిందిగా ఎఫ్ఏఓ చెపుతోంది. ఆఫ్రికాలోనే సగం దేశాలు సర్వే చేసిన 138 దేశాల్లో కనీసం 52 దేశాల జనాభాలో సగం మందికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత లేదని ఎఫ్ఏఓ సర్వే వెల్లడించింది. ఇందులో అత్యధికం ఆఫ్రికా ఖండంలో ఉండగా మిగిలినవి ఆసియా, ఓషియానా, ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ఉన్నాయి. ఆహార కొరత అన్నది ఆఫ్రికా ఖండంలో ఎప్పుడూ సమస్యే కానీ, సహారా ఎడారి పరిసర దేశాల్లోని జనాభాలో 90 శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. కరువు ప్రాంతాల్లో మూడింట ఒక వంతు ఇక్కడే ఉండటం, వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉండటం వల్ల ఆహార ధరలు భారీగా హెచ్చుతగ్గులకు గురవుతుండటం ఈ పరిస్థితికి కారణమని ఎఫ్ఏఓ విశ్లేషించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని ఇప్పుడు ఆఫ్రికా దేశాలకు గోధుమ దిగుమతులు సగం కంటే ఎక్కువ పడిపోయాయి. ఫలితంగా చాలా దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణం అధికమైంది. సమస్యను మరింత జటిలం చేసింది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత లేని వారు ఒక్క భారత దేశంలోనే 97.3 కోట్ల మంది ఉన్నట్లు ఎఫ్ఏఓ దగ్గర ఉన్న సమాచారం చెపుతోంది. ఆసియా మొత్తం మీద 189 కోట్లు, ఆఫ్రికాలో సుమారు 100 కోట్ల మంది ఉన్నారు. అమెరికా, ఓషియానాల్లో సుమారు 15.1 కోట్ల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆజర్బైజాన్, ఐస్లాండ్, స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మాత్రమే జనాభా మొత్తం పుష్టికరమైన ఆహారాన్ని కొనుక్కోగల స్థితిలో ఉన్నట్లు ఆ సర్వే నివేదిక తెలిపింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాల్లో 95 శాతం ప్రజలు కూడా మంచి స్థితిలోనే ఉన్నారు. పెరుగుతున్న జనాభా కూడా కారణమే ఆరోగ్యకరమైన ఆహారం అందుకునే స్థోమత లేకపోవడానికి పెరుగుతున్న జనాభా కూడా ఒక కారణం. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోనుంది. 2050 నాటికి ఇది ఇంకో 35 శాతం పెరగనుంది. అంటే సుమారు 250 కోట్ల మందికి అదనంగా ఆహారం అవసరం. ఈ డిమాండ్‌ను తట్టుకోవాలంటే పంట దిగుబడులు ఇప్పుడున్న స్థాయికి రెట్టింపు కావాలి’అని యునైటెడ్ నేషన్స్ తరఫున అధ్యయనంలో పాల్గొన్న స్టాన్‌ఫర్డ్ వర్సిటీ ఎకనామిక్స్ విభాగం హెడ్ అబ్రమిస్కీ అన్నారు. పెరిగిపోతున్న జనాభాకు తగినంత ఆహారం పండించాలన్నా, పండించిన ఆహారం ప్రజల కడుపులు నింపడం మాత్రమే కాకుండా తగిన పుష్టిని ఇవ్వాలన్నా పలు రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు అవసరమని పేర్కొంటూ యూఎన్‌కు ఆయన ఓ నివేదిక కూడా అందజేశారు. ‘ఆహార వృథాను తగ్గించాలి’ ఆహార వృథాను వీలైనంత వరకూ తగ్గించడం. పండిన పంట వినియోగదారుడి చేతికి చేరేలోపు జరుగుతున్న వృథాను గణనీయంగా తగ్గించడం ద్వారా ఉన్న ఆహారాన్ని ఎక్కువమందికి చేరేలా చేయవచ్చునని ఐరాస ఇటీవల తన సభ్యదేశాలకు సూచించింది. వాతావరణ మార్పులను తట్టుకోగల రీతిలో కొత్త కొత్త వంగడాల సృష్టి, ఉత్పాదకత పెంచడం ద్వారా మాత్రమే భవిష్యత్తు ఆహార సవాళ్లను ఎదుర్కోగలమని నిపుణులు అంటున్నారు. పరిస్థితిని దిగజార్చిన కోవిడ్ ఆకలి కారణంగా 2018లో ఐదేళ్లు నిండకుండానే మరణించిన పిల్లల సంఖ్య 53 లక్షలు. 2020లో విడుదలైన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఈ విషయం చెపుతోంది. ► ఐక్యరాజ్య సమితి నిర్దేశించినసుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో రెండోది‘జీరో హంగర్’. 2030 నాటికి ఆకలిని చెరిపేసేందుకు చేసుకున్న తీర్మానం ఇది. ► కోవిడ్ మహమ్మారి పుణ్యమా అని ప్రపంచమిప్పుడు ‘జీరో హంగర్’లక్ష్యాన్ని అందుకోలేని స్థితిలో ఉంది. ఒకపక్క వాతావరణ సమస్యలు సవాళ్లు విసురుతుండగా, కోవిడ్ పరిస్థితిని మరింత దిగజార్చింది. సమాజంలోని అసమానతలను ఎక్కువ చేయడం ద్వారా మరింత మంది ఆకలి కోరల్లో చిక్కుకునేలా చేసింది. ►ప్రపంచం మొత్తమ్మీద ఏటా 400 కోట్ల టన్నుల ఆహారం ఉత్పత్తి అవుతుండగా, ఇందులో 33 శాతం వృథా అవుతోంది. దీని విలువ ఏకంగా 60 లక్షల కోట్ల రూపాయలు. అభివృద్ధి చెందిన దేశాల్లో తినే ఆహారం ఎక్కువగా వృథా అవుతుండగా, అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో పంటనష్టాలు ఎక్కువ. డిమాండ్‌కు తగ్గ ఆహారం కోసం.. ఆకలిని ఎదుర్కొనేందుకు మన దేశంలో అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే అనేక పథకాలు ఆచరణలో ఉన్నాయి. వాటిలో కొన్ని.. 1.నేషనల్ న్యూట్రిషన్ మిషన్: పోషణ్ అభియాన్ అని పిలిచే ఈ పథకాన్ని 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.గర్భిణులు, పాలిచ్చే తల్లుల్లో పోషకాహార లోపాలను తగ్గించడం, రక్తహీనత, తక్కువ బరువున్న పిల్లలు పుట్టడాన్ని నివారించడం ఈ పథకం ఉద్దేశం 2. జాతీయ ఆహార భద్రత పథకం: 2007లో నేషనల్ డెవలప్మెంటల్ కౌన్సిల్ ప్రారంభించిన పథకం ఇది. 11వ పంచవర్ష ప్రణాళిక ముగిసే సమయానికి దేశంలో వరి ఉత్పత్తి రెండు కోట్ల టన్నులు అధిమించగా, గోధుమల ఉత్పత్తి 80 లక్షల టన్నులకు చేరుకుంది. కాయధాన్యాల దిగుబడి 20 లక్షల టన్నుల పైచిలుకుకు చేరుకుంది. 12వ పంచవర్ష ప్రణాళికలోనూ లక్ష్యానికి మించి దిగుబడులు సాధించాం. భవిష్యత్తులోనూ డిమాండ్‌కు తగ్గ ఆహారాన్ని పండించేందుకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ పలు వ్యూహాలను సిద్ధం చేసి అమలు చేస్తోంది. 3. రెండేళ్ల లోపు పిల్లల్లో పౌష్టికాహార లోపాలను తగ్గించేందుకు, ఏడాది పొడవునా మంచి ఆహారం అందరికీ అందుబాటులో ఉండేలా చేసేందుకు ప్రభుత్వం జీరో హంగర్ పేరుతో ఇంకో పథకాన్ని అమలు చేస్తోంది. పోషకాహార లోపాలను అధిగమించేందుకు ఆహారానికి పోషకాలు జోడించడం కూడా ప్రభుత్వ ప్రయత్నాల్లో ఒకటి. -
పాకిస్తాన్ వరద బాధితులుగా... 1.6 కోట్ల చిన్నారులు!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో సంభవించిన భీకర వరదల ధాటికి 1.6 కోట్ల మంది చిన్నారులు బాధితులుగా మారారని, వీరిలో 34 లక్షల మందికి తక్షణమే సాయం అందించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. ఇప్పటికే పోషకాహార లేమిని ఎదుర్కొంటున్న బాలలు డయేరియా, డెంగ్యూ జ్వరం, చర్మ వ్యాధులతో పోరాడుతున్నారని తెలియజేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి(యునిసెఫ్) ప్రతినిధి అబ్దుల్లా ఫాదిల్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్లో సింధ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఇటీవలే రెండు రోజులపాటు పర్యటించారు. పాకిస్తాన్లో వరదలు 528 మంది చిన్నారులను పొట్టనపెట్టుకున్నాయని చెప్పారు. ఇవన్నీ నివారించగలిగే మరణాలే అయినప్పటికీ ప్రభుత్వం ఆ పని చేయలేకపోయిందని ఆక్షేపించారు. ఆవాసం లేక చిన్నపిల్లలు కుటుంబాలతో కలిసి బహిరంగ ప్రదేశాల్లోనే ఉంటున్నారని, ఆహారం, నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు కూలిపోయాయని అన్నారు. బాధితులను ఆదుకొనేందుకు అంతర్జాతీయ సమాజం తక్షణం ముందుకు రావాలని అబ్దుల్లా ఫాదిల్ విజ్ఞప్తి చేశారు. -
Poshan Abhiyaan: ‘పోషణ్ అభియాన్’ అమల్లో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో గర్భిణులు, పిల్లల్లో పోషకాహార లోపం నివారణకు ఉద్దేశించిన పోషణ్ అభియాన్ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. పథకం మొత్తం అమలులో అత్యధిక విజయాలు సాధించిన రాష్ట్రాల్లో తొలుత మహారాష్ట్ర నిలవగా రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్, మూడో స్థానంలో గుజరాత్ నిలిచాయి. ఈ రాష్ట్రాలు మొత్తం మీద 70 శాతానికి పైగా స్కోర్ సాధించాయి. ఆ తరువాత స్థానాల్లో తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ ఉన్నట్లు నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక వెల్లడించింది. కోవిడ్ సమయంలో కీలకమైన ఆరోగ్య, పోషకాహార సేవల విషయంలో ఆయా రాష్ట్రాలు చేపట్టిన వినూత్న చర్యలపై నీతి ఆయోగ్ అధ్యయనం చేసింది. 2019 అక్టోబర్ నుంచి డిసెంబర్ 2020 వరకు పోషణ్ అభియాన్ అమలులో మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, శిక్షణపై పురోగతి, అమలు సామర్థ్యాలు, కెపాసిటీ బిల్డింగ్, కన్వర్జెన్స్, ప్రోగ్రామ్, ఔట్పుట్ యాక్టివిటీస్, సర్వీస్ డెలివరీలపై నీతి ఆయోగ్ అధ్యయనంచేసి ఆయా రాష్ట్రాలకు స్కోర్లు ఇచ్చింది. ఆ వివరాలు.. మానవ వనరుల నియామకాల్లో ఏపీ టాప్ ► కోవిడ్ సమయంలో పోషణ్ అభియాన్ అమలుకు అవసరమైన మానవ వనరుల నియామకాలను నూరు శాతం చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. జాయింట్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ స్థానాలనూ నూరు శాతం భర్తీచేసిన రాష్ట్రాల్లో ఏపీ ఈ ఘనత సాధించింది. అంగన్వాడీ వర్కర్లకు మొబైల్ ఫోన్లను నూరు శా>తం పంపిణీలోనూ ఏపీ టాప్‌లో నిలిచింది. పిల్లల వృద్ధి పర్యవేక్షణ పరికరాలనూ నూటికి నూరు శాతం ఏపీ పంపిణీ చేసింది. అంతేకాక.. రాష్ట్రస్థాయిలో సిబ్బంది శిక్షణ, సామర్థ్యం పెంపునూ నూరు శాతం అమలుచేసింది. ► ఆరోగ్య సంబంధిత సేవలు, మౌలిక సదుపాయాలు, మానవ వనరులను అంచనా వేయగా.. కమ్యూనిటీ హెల్త్ కేంద్రాలు, పిల్లలు, బాలింతలకు సేవలు, ఏఎన్ఎంల భర్తీలో ఆంధ్రప్రదేశ్ అత్యధిక స్కోర్ సాధించింది. ఆ తరువాత స్థానాల్లో గుజరాత్, కర్ణాటక, కేరళ నిలిచాయి. ► రాష్ట్రస్థాయిలో మౌలిక సదుపాయాలకు సంబంధించి సబ్ సెంటర్లు, కకమ్యూనిటీ హెల్త్ కేంద్రాలు, హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌లో నూటికి నూరు శాతం పనిచేస్తున్నాయి. ఈ విషయంలో దేశంలోని 13 పెద్ద రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. ► ఏపీ సర్కారు ప్రత్యేకంగా సప్లిమెంటరీ పోషకాహారం కూడా పంపిణీ చేసింది. గృహ సందర్శనలు, వర్చువల్‌గా కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు పిల్లలకు వర్చువల్ తరగతులు నిర్వహించింది. కమ్యూనిటీ పద్ధతిలో వర్చువల్ ఈవెంట్లనూ నిర్వహించింది. కోవిడ్ సమయంలో జనసమూహాన్ని నివారించేందుకు టోకెన్ ఆధారిత వ్యవస్థ ద్వారా జింక్, ఓఆర్ఎస్లను పంపిణీ చేసింది. ► కోవిడ్ సంక్షోభ సమయంలో అక్టోబర్ 2019 నుంచి 2020 రెండో త్రైమాసికం వరకు ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయస్సు గల పిల్లలకు సప్లిమెంటరీ పౌష్టికాహారం ఏపీలో 113 శాతం మేర పంపిణీ చేయగా 2020 మూడో త్రైమాసికం నాటికి అది 115 శాతం మేర.. నాలుగో త్రైమాసికం నాటికి అది 119 శాతానికి పెరిగింది. ► ఇక అక్టోబర్ 2019 నుంచి 2020 రెండో త్రైమాసికం వరకు గర్భిణులతో పాటు పాలు ఇచ్చే తల్లులకు సప్లిమెంటరీ పౌష్టికాహారం పంపిణీ 108 శాతం ఉండగా 2020 మూడో త్రైమాసికానికి 111 శాతం, 2020 నాలుగో త్రైమాసికంలోనూ అదే స్థాయిలో పంపిణీ జరిగింది. ► ఇక అక్టోబర్ 2019 నుంచి 2020 రెండో త్రైమాసికం వరకు ఇనిస్టిట్యూషనల్ కాన్పులు ఏపీలో 90 శాతం ఉండగా 2020 మూడో త్రైమాసికంలో 94 శాతానికి.. 2020 నాలుగో త్రైమాసికానికి 100 శాతానికి పెరిగాయి. -
National Nutrition Week: నీరసమూ నిద్ర వదలగొట్టండి
సోఫా కనిపిస్తే నడుము వాల్చాలనిపిస్తోందా? ఏ పనీ చేయలేని నీరసం ముంచుకు వస్తోందా? ఇదేమైనా పోస్ట్ కోవిడ్ లక్షణమా? మరేదైనా సమస్యా? ఇటీవల గృహిణులు నీరసాన్ని ఫిర్యాదు చేస్తున్నారు. పని మాని నిద్ర పోవడానికి ఇష్టపడుతున్నారు. దీనికి పోషకాహార లోపం ఒక కారణం. ఇతర కారణాలు కూడా ఉంటాయి. గృహిణి నీరసంగా ఉంటే ఇల్లు నడవదు. లేవండి. చలాకీగా మారండి. ‘ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్’ అన్నాడు మహాకవి గురజాడ. ఆయన బాధపడింది తగినంత పౌష్టికాహారం లేని తన కాలపు మనుషులను చూసే. సరైన ఆహారమే శక్తి. సరికాని ఆహారం నీరసం. ఫుల్లుగా తిన్నా అసలు తినకపోయినా విలోమ ప్రతిఫలం వస్తుంది. అతి నిద్ర, నీరసం ఇంటి సభ్యులకు ముఖ్యంగా గృహిణులకు ఉంటే పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. కోవిడ్ తర్వాత చాలా ఇళ్లల్లో స్త్రీలు నీరసం అని అంటూ ఉన్నారు. కోవిడ్ బారిన పడ్డ పిల్లలు కూడా అప్పుడప్పుడు నీరసం అని అనువుగాని సమయాలలో నిద్ర అని అంటూ ఉన్నారు. ఈ సమస్యలన్నింటినీ తగిన పౌష్టికాహారంతో ఎదుర్కొనవచ్చు. ఇప్పుడు దేశంలో పౌష్టికాహార చైతన్యం కోసం కోసం సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు ‘పౌష్టికాహార వారోత్సవం’ జరుగుతుంది. సరిౖయెన ఆహారంతో నీరసాన్ని ఎదుర్కోవడం ముఖ్యం. సమతుల ఆహారం: మధుమేహం, గుండె, బి.పి, స్థూలకాయం... వీటిని అదుపు చేసే ఆహారం తినడం గురించి కొందరు శ్రద్ధ పెడతారు. కాని సమగ్రంగా శరీరాన్ని చురుగ్గా ఉంచే ఆహారాన్ని పట్టించుకోరు. అసమతుల ఆహారం శరీరానికి నీరసం తెస్తుంది. కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం అతిగా తింటే మందకొడితనం వస్తుంది. అది కూడా ఒక రకమైన అలసట కలిగిస్తుంది. కేల్షియం, మెగ్నిషియం, ఐరన్, జింక్, విటమిన్లు ఇవన్నీ తగినంతగా తీసుకుంటే సరైన నిద్ర పడుతుంది. తిన్నది ఒంటికి పట్టి ఉదయానికి హుషారు వస్తుంది. లేకుంటే నిద్ర సరిగ్గా పట్టదు. మరుసటి రోజు మత్తు, అలసట, నీరసం ఉంటాయి. జొన్నలు, కొర్రలు, గ్రీన్ టీ: నిదానంగా జీర్ణమయ్యే జొన్నలు, కొర్రలు మంచివి. చికెన్, చేపలు మేలు చేస్తాయి. పాలు, పెరుగు, గుడ్డు, సోయా, పెసలు, అలసందలు ఆహారంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరెంజ్, జామ, బొప్పాయి, స్ట్రాబెర్రీలు నీరసాన్ని, కీర మలబద్ధకాన్నీ తొలగిస్తాయి. అరటిపండు నీరసానికి బద్ధ విరోధి. బ్రొకోలి, క్యాప్సికమ్, క్యారెట్, కాలిఫ్లవర్, టొమాటోలు ఇవి ఉన్న కూరలు ముఖ్యం. ఆకుకూరలు పెంచాలి. మజ్జిగ బాగా తీసుకోవాలి. జొన్న రొట్టె, జొన్న రవ్వ ఒక పూట అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ పోషకాలనిస్తాయి. గ్రీన్ టీ మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఏకాగ్రతను పెంచడంతో పాటు అలసటను తొలగిస్తుంది. మందులు: కొన్ని రకాల మందులు కూడా నిద్ర లేమికి, నీరసానికి కారణం అవుతాయి. బి.పి, యాంగ్జయిటీ, యాంటీ డిప్రెసెంట్లు వంటివి నిద్రకు విఘాతం కలిగిస్తాయి. అందువల్ల అప్పుడప్పుడు డాక్టర్‌ను కలిసి వాడుతున్న మందులు చెక్ చేయించి వాటి మోతాదును సరి చేసుకోవాలి. నిద్ర సమస్యలు ఉంటే మందులు మార్చే వీలుంటే మార్చుకోవాలి. ఆహారం, అలవాట్లు ఇవే మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. గృహిణి ఆరోగ్య బాధ్యత గృహిణిది మాత్రమే కాదు. కుటుంబానిది. అందరూ కలిసి ఇంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తప్పనిసరి. తగినంత నీరు, నిద్ర: జీవక్రియలకు నీరు అవసరం. జీవక్రియలు జరిగే కొద్దీ శరీరంలో నీటి శాతం తగ్గుతూ ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు నీరు తీసుకోవాలి. లేదంటే శరీరంలో రసం పోయి నీరసం వస్తుంది. అలాగే సరిౖయెన నిద్ర కోసం పూర్తిగా ప్రయత్నించాలి. అలజడి, ఒత్తిడి, అనవసర ఆలోచనలు నిద్రకు దూరం చేస్తాయి. నిద్ర లేకపోతే ఆరోగ్యం ఉండదు. కనుక రోజంతా ఎంత పని, చికాకులు ఉన్నా నిద్రా సమయంలో మంచి సంగీతం వింటూ, కుటుంబ సభ్యులతో మంచి మాటలు చెబుతూ, శుభ్రమైన పక్క మీద నిద్ర పోవాలి. అదే నీరసానికి సరైన విరుగుడు. నిద్ర పోయే ముందు ఒక గ్లాసు మంచినీరు తాగితే మంచిది. -
పోషకాహార లోపాన్ని నివారించేందుకు కృషి చేయాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశంలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రజలు కృషి చేయాలని, దానికి సామాజిక అవగాహన కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రతినెల చివరి ఆదివారం నిర్వహించే ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్ స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన ‘అమృత్ మహోత్సవ్’ అమృత ధారలు దేశం నలుమూలలా ప్రవహించాయని పేర్కొన్నారు. ‘పండుగలతోపాటు ఈ సారి సెప్టెంబర్ నెలను పోషకాహారంపై ప్రచారానికి అంకితం చేద్దాం. మనం సెప్టెంబర్ 1 నుంచి 30 తేదీ వరకూ ‘షోషణ్ మాహ్’ ( పోషకాహార మాసం)గా పాటిద్దాం. పోషకాహార నివారణకు చాలా సృజనాత్మక, విభిన్నమైన ప్రయత్నాలు చేస్తున్నాం. పోషణ్ అభియాన్‌లో సాంకేతిక, ప్రజాభాగస్వామ్యాన్ని మెరుగైన పద్ధతుల్లో వాడటం చాలా కీలకం. భారత్‌లో పోషకాహార లోపాన్ని రూపుమాపడంలో ‘జల్‌జీవన్ మిషన్’ భారీగా ప్రభావం చూపనుంది. పోషకాహార లోపాన్ని రూపుమాపటంలో సామాజిక అవగాహన కీలక పాత్ర పోషిస్తుంది.’ అని ప్రధాని మోదీ తెలిపారు. దూరదర్శన్‌లో స్వతంత్ర సమరయోధుల త్యాగాలపై వచ్చే ‘స్వరాజ్’ సీరియల్‌ను వీక్షించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు ప్రధాని మోదీ. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న యోధుల కృషిని యువతరానికి తెలియజేయడానికి ఇదో గొప్ప ప్రయత్నమన్నారు. ఇదీ చదవండి: బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతిపై సీబీఐ దర్యాప్తు? -
పుష్కలంగా ఆహారం.. అయినా పోషకాహార లోపం..
సాక్షి, అమరావతి: దేశంలో ఆహారం పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ పోషకాహార లోపం పిల్లలను, మహిళలను పట్టిపీడిస్తోంది. తిండి కొరతవల్ల కాకుండా ఆహారపు అలవాట్లు కారణంగానే ఎక్కువమంది ఈ లోపం బారిన పడుతున్నారు. నిజానికి.. దేశంలో తలసరి ఆహార ఉత్పత్తి గత కొన్నేళ్లుగా క్రమంగా పెరుగుతోంది. 1980 ప్రారంభంలో ఒక వ్యక్తికి రోజుకు ఒక కిలోకంటే కొంత ఎక్కువగాను.. ఇటీవల కాలంలో 1.73 కిలోల ఆహారం అందుబాటులో ఉన్నప్పటికీ ఆరోగ్య, పోషకాహార సూచికలు పేలవంగా ఉన్నాయని.. ఈ సూచికల క్షీణత ఆందోళన కలిగిస్తోందని నాబార్డు నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–2021 వెల్లడించింది. నివేదికలో పొందుపర్చిన సూచనలు, ఇతర ముఖ్యాంశాలివీ.. ► దేశంలోని ఐదేళ్లలోపు పిల్లల్లో 67.1% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ► 15–49 ఏళ్లలోపు మహిళల్లోని 57 శాతం మందిని కూడా ఇదే సమస్య పట్టిపీడిస్తోంది. 2015–16తో పోలిస్తే పిల్లల్లోనూ, మహిళల్లోనూ ఇది పెరగడం ఆందోళన కలిగించే అంశం. ► ఆహారాన్ని తక్కువగా తీసుకోవడమే పోషకాహార లోపానికి ప్రధాన కారణం. ► పౌష్టికాహారం అందుబాటులో ఉన్నప్పటికీ ఆహారపు అలవాట్లు కారణంగా ఈ లోపాలబారిన పడుతున్నారు. ► ఎక్కువగా కారం, నూనె, చక్కెరతో కూడిన ఆహారం తీసుకోవడమే కారణం. ► ఈ లోపానికి పూర్తిగా కొనుగోలు సామర్థ్యం తక్కువగా ఉండటం కారణం కాదు. ఆర్థికంగా బాగా ఉన్న కుటుంబాల వారిలో కూడా ఈ లోపాలున్నాయి. ► ఈ లోపంతో పిల్లలు బరువు తక్కువగా ఉండటం చాలా సాధారణమైంది. ► శరీరం పోషకాలను గ్రహించడం కూడా ప్రభావితం చేస్తుంది. స్వచ్ఛమైన నీరు, పారిశుధ్యం, పరిశుభ్రతతో పాటు వైవిధ్యభరితమైన ఆహారం తీసుకోవడంలో సమతుల్యత పాటించాలి. ► ఆరోగ్య సూచికలను మెరుగుపరచడానికి పోషకాహారంపై ప్రజల్లో అవగాహన చాలా ముఖ్యం. ► ఆహార భద్రతపై అనేక నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. పంటలు, పశువులు, చేపలలో రసాయనాలు, హార్మోన్లు అధికంగా ఉంటున్నాయి. ► రసాయన అవశేషాల వినియోగంపై కఠినమైన నియంత్రణ ఉండాలి. -
ఫోర్టిఫైడ్ బియ్యంతో ఆరోగ్యం పదిలం
ఏయూక్యాంపస్: ఫోర్టిఫైడ్ బియ్యంతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. బియ్యానికి అదనంగా విటమిన్లు, ఖనిజాలను జోడించడాన్ని రైస్ ఫోర్టిఫికేషన్ అంటారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12 వంటి కీలక సూక్ష్మ పోషకాలను అదనంగా బియ్యంలో చేర్చడం ద్వారా పోషకాహార లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేపట్టింది. కళాశాల ఆచార్యులు, ఏయూ పాలక మండలి సభ్యురాలు ఆచార్య ఎ.కృష్ణమంజరి పవార్ నేతృత్వంలో బి.ఫార్మసీ విద్యార్థులు ప్రాజెక్టులో భాగంగా చేసిన అధ్యయనంలో ఫోర్టిఫైడ్ బియ్యంలో ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా ఉన్నట్లు తేలింది. ఫోర్టిఫైడ్ రైస్ ఎందుకు వాడాలి.. పౌష్టికాహార లోపం బారినపడే మహిళలు, చిన్నారులకు ఫోర్టిఫైడ్ బియ్యం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది. ఐసీడీఎస్, ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజన పథకం వంటి ప్రభుత్వ పథకాల్లో ఫోర్టిఫైడ్ రైస్‌ను పంపిణీ చేయడం వల్ల సూక్ష్మపోషకాలను అందించడం సాధ్యపడుతుంది. ఫోలిక్ యాసిడ్.. ఫోలిక్ యాసిడ్ బాలింత తల్లుల పెరుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. పసిపిల్లలలో మెదడు, వెన్నెముక పెరుగుదలకు తోడ్పడుతుంది. అదే విధంగా విటమిన్ బి 12 మెదడు, నాడీమండలం పనిచేయడానికి, ఎర్రరక్తకణాల ఉత్పత్తిలో కీలక భూమిక పోషిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని సరైన మొత్తంలో ఉంచుతూ రక్తహీనతను అరికట్టడంలో ఐరన్ ప్రధానపాత్ర పోషిస్తుంది. నిత్యం 400 మైక్రో గ్రామ్స్ అవసరం.. మనం నిత్యం తీసుకునే ఆహారంలో 400 మైక్రో గ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ ఉండే విధంగా మనం జాగ్రత్త వహించాలి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా మనం తీసుకునే 100 గ్రాముల అన్నంలో ఫోలిక్ యాసిడ్ 75 నుంచి 125 మైక్రోగ్రామ్స్ మధ్యలో ఉండాలి. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ఫోర్టిఫైడ్ రైస్‌లో 100 గ్రాముల్లో 98 మెక్రో గ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ ఉంది. ఎఫ్ఎస్సీఐ ప్రమాణాల ప్రకారం 100 గ్రాముల అన్నంలో 28–42 మిల్లీ గ్రాముల ఐరన్ ఉండాలి. ప్రభుత్వం అందించే ఫోర్టిఫైడ్ బియ్యంలో 40 మిల్లీగ్రాముల ఐరన్ ఉంది. ఇతర ప్రైవేటు ఫోర్టిఫైడ్ బియ్యంలో 35 నుంచి 36.5 మిల్లీ గ్రాములు ఐరన్ కనిపించింది. కాగా అధికంగా వినియోగించే బ్రాండెడ్ మసూరి రైస్‌లో కేవలం 0.98 శాతం ఐరన్ ఉన్నట్లు తేలింది. నాలుగు రకాల బియ్యంపై అధ్యయనం.. ప్రభుత్వం అందిస్తున్న ఫోర్టిఫైడ్ బియ్యం శాంపిల్‌తో పాటు మార్కెట్లో లభించే మూడు రకాల ఫోర్టిఫైడ్ బియ్యం బ్రాండ్ల శాంపిల్స్‌తోపాటు సాధారణ సోనామసూరి బియ్యం శాంపిల్స్ తీసుకుని అధ్యయనం చేశారు. అధ్యయనం అనంతరం ఫలితాలను విశ్లేషించగా ప్రభుత్వం అందించే ఫోర్టిఫైడ్ బియ్యంలో ఫోలిక్ యాసిడ్ 98 శాతం ఉండగా, మిగిలిన మూడు ఫోర్టిఫైడ్ రైస్ బ్రాండ్లలో ఫోలిక్ యాసిడ్ శాతాలను పరిశీలించగా 96, 97.24,95, ప్రముఖ బ్రాండ్ సోనా మసూరి రైస్‌లో 93 శాతం ఫోలిక్‌యాసిడ్ ఉండడాన్ని గమనించారు. మరింత లోతైన పరిశోధనలు విద్యార్థుల పరిశోధన సమాజానికి ఉపయుక్తంగా నిలపాలనే ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టాం. ప్రభుత్వం కోరితే బి 12 శాతం సైతం గణించి ఇస్తాం. ఈ బియ్యం వినియోగించిన తరువాత శరీరంలో ఐరన్శాతం పెరుగుదలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తే పరిశోధన ప్రాజెక్టుగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. – ఆచార్య ఎ.కృష్ణమంజరి పవార్, ఫార్మసీ కళాశాల, ఏయూ -
పోషకాహార లోపంతోనే వ్యాధులు
జూలూరుపాడు: పోషకాహార లోపమే వ్యాధులకు ప్రధాన కారణమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)– జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్, శాస్త్రవేత్త డాక్టర్ జె.శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామానికి వచ్చిన ఐసీఎంఆర్ – ఎన్ఐఎన్ బృందం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలసి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ..తెలంగాణలో గిరిజన జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశ్రీ, నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే(ఎన్హెచ్ఎఫ్ఎస్), ఇతర జాతీయ సంస్థల నివేదికల్లో వెల్లడైందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మహిళలు, యువతులు, చిన్నారుల్లో 60% మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు సర్వే ద్వారా తేలిందని చెప్పారు. మరోసారి నమూనాల సేకరణ గ్రామంలో కిడ్నీ వ్యాధులతో పలువురు మరణించిన నేపథ్యంలో ‘సాక్షి’ప్రధాన సంచికలో గతేడాది అక్టోబర్ 10న ‘ఆ ఊరికి ఏమైంది?’శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని బృందం అదే నెల 26న గ్రామాన్ని సందర్శించి కిడ్నీ వ్యాధిగ్రస్తుల నుంచి నమూనాలను సేకరించారు. ఈ నేపథ్యంలో గురువారం వ్యాధిగ్రస్తులనుంచి మరోసారి నమూనాలను తీసుకున్నారు. అనంతరం వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ..ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రజలు మిషన్ భగీరథ నీళ్లు తాగాలని సూచించారు. కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ దయానంద్, డీఎంఓ డాక్టర్ భూక్యా వీరబాబు,తహసీల్దార్ లూథర్ విల్సన్, జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
33లక్షల మంది బాలల్లో పౌష్టికాహార లోపం
న్యూఢిల్లీ: దేశంలోని చిన్నారుల్లో 33 లక్షల మంది పౌష్టికాహారలోపంతో బాధపడుతుండగా అందులో దాదాపు సగం మందిలో ఈ సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. పిల్లల్లో పౌష్టికాహారలోపం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, బిహార్, గుజరాత్ అగ్రస్థానంలో ఉన్నట్లు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ సమాధానం ఇచ్చింది. కోవిడ్ మహమ్మారి పేద కుటుంబాల్లోని పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం సమస్యను మరింత తీవ్రతరం చేసిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2021 అక్టోబర్ 14వ తేదీనాటికి దేశంలో 17.76 లక్షల మంది చిన్నారులు తీవ్ర పౌష్టికాహారలోపంతోనూ, 15.46 లక్షల మంది చిన్నారులు మధ్యస్త పోషకాహార లోపంతోనూ బాధపడుతున్నట్లు అంచనా వేసింది. ఈ గణాంకాలు ప్రభుత్వం ప్రారంభించిన ‘పోషణ్ ట్రాకర్’యాప్‌లో నమోదై ఉన్నాయి. ఈ గణాంకాలను నేరుగా అంగన్వాడీ సిబ్బంది నమోదు చేసినవి కావడం గమనార్హం. 2020 గణాంకాలతో పోలిస్తే తీవ్ర పౌష్టికాహారలోపం ఉన్న ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు వయస్సున్న చిన్నారుల సంఖ్యలో ఏడాది కాలంలోనే 91% పెరుగుదల నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, మొహం, పొట్ట తదితర భాగాలు ఉబ్బినట్లు ఉండటం తదితర లక్షణాల ఆధారంగా తీవ్ర, మధ్యస్త పౌష్టికాహారలోపంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచిస్తోంది. ఈ లక్షణాలున్న పిల్లలు త్వరగా అనారోగ్యం పాలయ్యేందుకు అవకాశం ఉంది. తీవ్ర పోషకాహార లోపంతో ఉన్న చిన్నారులు ఆరోగ్యవంతులతో పోలిస్తే మృత్యువాత పడేందుకు 9 రెట్లు ఎక్కువ అవకాశాలుంటాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 6.16 లక్షల మంది చిన్నారుల్లో పౌష్టికాహారలోపంతో బాధపడుతుండగా, వీరిలో 4.58 లక్షల మంది తీవ్రమైన, 1.57 లక్షల మంది మధ్యస్తమైన పౌష్టికాహారలోపంతో ఉన్నట్లు గుర్తించారు. కోవిడ్ మహమ్మారి దాదాపు అన్ని సామాజిక–ఆర్థిక సూచికలపైనా వ్యతిరేక ప్రభావం చూపిందని చైల్ రైట్స్ అండ్ యు(క్రై) సీఈవో పూజా మార్వాహ అన్నారు. గత దశాబ్ద కాలంపాటు సాధించిన పురోగతి కోవిడ్‌తో తుడిచి పెట్టుకుపోయిందని చెప్పారు. కోవిడ్ ఆంక్షల కారణంగా దీర్ఘకాలంపాటు అంగన్వాడీ కేంద్రాలను, స్కూళ్లలో మధ్యాహ్నభోజన పథకాన్ని నిలిపివేయడం పేద బాలలపై అన్ని రకాలుగా తీవ్ర ప్రభావం చూపిందన్నారు. కాగా, 2011 జనగణన ప్రకారం దేశంలో 46 కోట్ల మంది చిన్నారులున్నారు. -
Millet Snacks: చిరుధాన్యాలతో చిరుతిళ్ల వ్యాపారం!.. కోట్లలో లాభం..
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–4 ప్రకారం మన దేశంలో ఐదేళ్ల లోపు వయసు పిల్లల్లో 38% మందిలో పౌష్టికాహార లోపం వల్ల పెరుగుదల లోపించింది. 59% పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పిల్లలతో పాటు పెద్దల్లోనూ పౌష్టికాహార లోపం తీవ్రంగానే ఉంది. రోజువారీగా తినే ప్రధాన ఆహార పదార్థాలతోపాటు పౌష్టిక విలువలు లోపించిన చిరుతిళ్లు కూడా వీరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇంట్లో అమ్మ చేసి పెట్టే చిరుతిళ్ల కన్నా మార్కెట్లో దొరికే ఆరోగ్యపరంగా నష్టదాయకమైన(జంక్) చిరుతిళ్లనే పిల్లలు.. ఆ మాటకొస్తే పెద్దలూ అంతే. జంక్ ఫుడ్‌కు చక్కని ప్రత్యామ్నాయం చిరుధాన్యాలతో తయారైన చిరుతిళ్లే అనటంలో సందేహం లేదు. ‘పౌష్టిక ధాన్యాలు’ (న్యూట్రి–సీరియల్స్)గా ప్రభుత్వం గుర్తించిన చిరుధాన్యాలలో ఖనిజ లవణాలు, బీకాంప్లెక్స్ విటమిన్లు, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటమే ఇందుకు కారణం. హైదరాబాద్‌లోని ఐసీఏఆర్ అనుబంధ కేంద్ర ప్రభుత్వ సంస్థ భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) ప్రజలకు పౌష్టికాహార భద్రత కల్పించాలన్న లక్ష్యంతో కృషి చేస్తోంది. ఐదేళ్ల క్రితం అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఐఐఎంఆర్ దేశంలోనే తొలి ‘న్యూట్రిహబ్’ను నెలకొల్పింది. చిరుధాన్యాలతో రుచికరమైన వందలాది వంటకాలు, చిరుతిళ్లను అత్యాధునిక పద్ధతుల్లో తయారు చేయటంపై ‘న్యూట్రిహబ్’ ఔత్సాహిక స్టార్టప్ సంస్థలకు శిక్షణతోపాటు సాంకేతికత విజ్ఞానాన్ని, ఆర్థిక తోడ్పాటును సైతం అందించి ప్రోత్సహిస్తున్నట్లు ఐఐఎంఆర్ డైరెక్టర్ డా. విలాస్ ఎ తొనపి తెలిపారు. న్యూట్రిహబ్ ద్వారా ఇప్పటికి మిల్లెట్స్‌తో రకరకాల ఉత్పత్తులను తయారు చేసి విక్రయించటంపై 175 స్టార్టప్ సంస్థలకు మార్గదర్శనం చేసినట్లు న్యూట్రిహబ్ సీఈవో, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి. దయాకర్‌రావు చెప్పారు. వినూత్న ఉత్పత్తులతో ముందుకొచ్చి మార్కెట్లో దూసుకెళ్తున్న స్టార్టప్‌లలో కొన్నిటికి మహిళలే సారధులుగా ఉన్నారు. వీరిలో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి ఇటీవల ఐఐఎంఆర్ నిర్వహించిన న్యూట్రి–సీరియల్స్ భాగస్వాముల జాతీయ మెగా సమ్మేళనంలో అవార్డులు ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలైన మిల్లెట్ మహిళల విజయగాథలు.. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! నెల రోజులు తింటే తేడా తెలుస్తుంది! వరి, గోధుమలకు బదులు చిరుధాన్యాలను రోజుకు ఒక భోజనం చేస్తూ.. చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్లు (స్నాక్స్) తింటే జీవన శైలి జబ్బులతో బాధపడేవారు నెల రోజుల్లో ఆరోగ్యంలో మంచి మార్పును గమనించవచ్చు అని హైదరాబాద్ నివాసి అయిన డాక్టర్మందరపు సౌమ్య అంటున్నారు. ఆహార శుద్ధి రంగంలో ఉన్నత విద్యను అభ్యసించి, ఆహార సాంకేతిక నిపుణురాలిగా 16 ఏళ్ల అనుభవం కలిగిన ఆమె 120 రకాల ఆహారోత్పత్తుల ఫార్ములాలను రూపొందించారు. మూడేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ‘మిల్లెనోవా ఫుడ్స్’ పేరిట స్టార్టప్ సంస్థను నెలకొల్పారు. ఐఐఎంఆర్‌లోని న్యూట్రిహబ్ ద్వారా ఇంక్యుబేషన్ సేవలు పొందారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు తినదగిన ఆరోగ్యదాయకమైన చిరుధాన్య చిరుతిళ్ల ఫార్ములేషన్లకు రూపకల్పన చేశారు. చిరుధాన్యాలు, పండ్లు, పప్పుధాన్యాలు, కూరగాయలను కలిపి శాస్త్రీయ సమతులాహార ఫార్ములేషన్స్‌తో ప్రొటీన్ బార్, బ్రేక్‌ఫాస్ట్ బార్, ఇమ్యుటినిటీ బూస్టర్ బార్, స్పోర్ట్స్ ఎనర్జీ బార్లను రూపొందించారు. రైతుల నుంచి నేరుగా చిరుధాన్యాలను కొనుగోలు చేసి.. పోషకాలు సులువుగా జీర్ణమయ్యేందుకు ఎక్స్‌ట్రూజన్ టెక్నాలజీతో ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నామని డా. సౌమ్య తెలిపారు. రూ. 1.41 కోట్ల పెట్టుబడి పెట్టారు. చదవండి: Wemmer Pan Killer: అతనో నరరూప రాక్షసుడు.. ఏ శిక్ష వేసినా తక్కువే..! పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మూడో ఏడాదిలో రూ. 1.27 కోట్ల నికర లాభాన్ని ఆర్జించారు. ఐఐఎంఆర్ నుంచి ఉత్తమ మహిళా స్టార్టప్ అవార్డును అందుకున్నారు. సిఎఫ్టిఆర్ఐ నుంచి తొలి బెస్ట్ స్టార్టప్ అవార్డును, ఇక్రిశాట్ నుంచి స్మార్ట్ ఫుడ్ ఎంటర్ప్రైజ్ అవార్డుతో పాటు ఐఎస్బి–యాక్షన్ ఫర్ ఇండియా బెస్ట్ సోషల్ ఎంటర్ప్రైజ్ పురస్కారం అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ టీ–హబ్‌లో ఎం.ఎస్.ఎం.ఈ. అసోసియేట్ గ్రోత్ సెక్రెటరీగా ఎంపికైన డా. సౌమ్య ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే చిరుధాన్యాలదే భవిష్యత్తు అంటున్నారు. చిరుధాన్యాల ఉత్పత్తుల రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వారికి సలహాలు సూచనలు ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు డా.సౌమ్య. (79895 86619). https://millennova.com/ మహిళలకోసం ప్రత్యేక ఆహారోత్పత్తులు బెంగళూరుకు చెందిన రుచిక భువాల్క వృత్తి రీత్యా సోషల్ టీచర్. కుటుంబం కోసం వరి, గోధుమలు లేని ఆరోగ్యదాయకమైన ఆహారం తయారు చేసే క్రమంలో ఆమె చిరుధాన్యాలపై దృష్టి సారించారు. చిరుధాన్యాలను దైనందిన ఆహారంలో భాగం చేసుకోవటంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను అధిగమించడంలో ప్రజలకు దోహపడాలన్న తపనతో ‘అర్బన్ మాంక్’ పేరిట స్టార్టప్‌ను నాలుగేళ్ల క్రితం నెలకొల్పారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ తోడ్పాటుతో చిరుధాన్యాల బియ్యం, పిండితోపాటు ఇడ్లీ /దోసెల పిండి, బిస్కెట్లు వంటి రోజువారీ అవసరమయ్యే 40 ఉత్పత్తులను అందిస్తూ పట్టణ ప్రాంత గృహిణుల మనసు చూరగొనటంలో రుచిక విజయం సాధించారు. సేంద్రియ చిరుధాన్యాలతో 30–60 ఏళ్ల మధ్య మహిళల కోసం ప్రత్యేక ఆహారోత్పత్తులను అందిస్తూ మిల్లెట్ అమ్మగా ప్రసిద్ధి పొందారు. 20 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ కామర్స్ సైట్స్ ద్వారా విక్రయిస్తూ రూ. 2 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించిన రుచిక.. ఐఐఎంఆర్ నుంచి బెస్ట్ ఎమర్జింగ్ స్టార్టప్ అవార్డును అందుకున్నారు. https://milletamma.com/ చదవండి: African Wild Dogs: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!! ఆరోగ్యకరమైన చిరుతిళ్లు పౌష్టిక విలువలు లేని జంక్ స్నాక్స్ నుంచి పిల్లలను రక్షించుకోవడం కోసం చిరుధాన్యాలతో చిరుతిళ్లను తయారు చేయటం ప్రారంభించారు హైదరాబాద్‌కు చెందిన డి.మాధవి, బి. దివ్యజ్యోతి. ప్రగతినగర్‌లోని ఎలీప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో చిరుధాన్యాలతో రెడీ టు ఈట్ చిరుతిళ్ల ఉత్పత్తి కోసం చిరు పరిశ్రమను స్థాపించారు. రాగి కుకీస్, జోవార్ ఫ్లేక్స్ తయారీ కోసం ఐఐఎంఆర్ నుంచి టెక్నాలజీ తీసుకున్నారు. రాగి చోకో బాల్స్ తదితర ఉత్పత్తులను తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల నుంచి గిట్టుబాటు ధర చెల్లించి చిరుధాన్యాలను నేరుగా కొనుగోలు చేస్తున్నారు. రూ. 1.04 కోట్ల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి మూడేళ్లలో 80% తిరిగి రాబట్టుకోగలిగారు. 9 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 2017లోనే ఐఐఎంఆర్ నుంచి ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తల అవార్డును మాధవి, దివ్యజ్యోతి స్వీకరించారు. తాజాగా ఐఐఎంఆర్ కన్సొలేషన్ అవార్డును అందుకున్నారు. https://rigdamfoods.com/ చదవండి: ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే.. మిల్లెట్ మీల్ బాక్స్ హైదరాబాద్‌కు చెందిన వేముల అరుణ ఐదేళ్ల క్రితం శిక్షణ పొంది జొన్న లడ్డు, ఇడ్లీ, దోసెలు వంటి వంటకాలను విక్రయించడం ప్రారంభించారు. వివిధ సంస్థల్లో మధ్యాహ్న భోజనం (మీల్ బాక్స్) అందిస్తున్నారు. ప్రస్తుతానికి 8 రకాల చిరుధాన్య వంటకాలను అందిస్తున్నారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ తోడ్పాటుతో మరికొన్ని ఉత్పత్తులను జోడించబోతున్నామని అరుణ తెలిపారు. స్విగ్గి, జొమాటో తదితర ఆన్లైన్ పార్టనర్స్ ద్వారా రుచికరమైన చిరుధాన్య వంటకాలను కోరిందే తడవుగా ప్రజల ముంగిటకు అందించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె తెలిపారు. రూ. 2.5 లక్షల పెట్టుబడితో అరుణ చిరుధాన్యాల వంటశాలను ప్రారంభించారు. ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నారు. రూ. 2.8 లక్షల ఆదాయం గడించారు. తాజాగా ఐఐఎంఆర్ నుంచి కన్సొలేషన్ అవార్డును అందుకున్నారు అరుణ. vemulaaruna81@gmail.com చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట! 6న వేరుశనగ, కంది, ఉల్లిగడ్డ సాగుపై శిక్షణ ప్రకృతి వ్యవసాయంలో వేరుశనగ, కంది, ఉల్లిగడ్డ సాగుపై ఈనెల 6 (శనివారం)న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతి పేట దగ్గర తన వ్యవసాయ క్షేత్రంలో ప్రముఖ రైతు శాస్త్రవేత్త గుడివాడ నాగరత్నం నాయుడుతోపాటు తాండూరు రైతు నారాయణ, నాగర్‌కర్నూలు రైతు రాజు రైతులకు శిక్షణ ఇస్తారు. పాల్గొనదలచిన వారు ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి. వివరాలకు.. 95538 25532. 7న బొప్పాయి, మునగ, అరటి సాగుపై శిక్షణ గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా శిబిరంలో ఈ నెల 7 (ఆదివారం)న బొప్పాయి, మునగ, అరటి సాగుపై నందివెలుగు రైతు మీసాల రామకృష్ణ, ఉద్యాన సహాయ సంచాలకులు రాజా కృష్ణారెడ్డి రైతులకు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666. 60% రైతులు మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా వ్యవసాయం చేస్తున్నారు. పంటలు సాగయ్యే విస్తీర్ణంలో 55% వర్షాధార ప్రాంతాల్లోనే ఉంది. భూతాపోన్నతి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్న రైతులు వీరు. అయితే, దేశ వ్యవసాయ బడ్జెట్లో 10% మాత్రమే ఈ ప్రాంతాలపై ఖర్చు పెడుతున్నాం. ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలి. ఫసల్ బీమా యోజన ఒక్కటే మెట్ట రైతును రక్షించలేదు. పంటల జీవవైవిధ్యం పెంపొందించాలి. – డాక్టర్ సబ్యసాచి దాస్, రీవైటలైజింగ్ రెయిన్‌ఫెడ్ అగ్రికల్చర్ నెట్వర్క్ చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. -
World Food Day: పాలకూర, పప్పు దినుసులు, బాదం..తింటే స్త్రీలలో ఆ సమస్యలు ..
మన దేశంలో అనేకమంది స్త్రీలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారనే విషయం అందరికీ విధితమే. దీనితో తాము అనారోగ్యంగా ఉండటమేకాకుండా, పోషకాహార లోపం ఉన్న రేపటి తరానికి జన్మనిస్తున్నారు. అందువల్ల మహిళలకు వారి పోషకాలలో వాటా అందేలా చూడడం అత్యవసరం. మన దేశంలో కేవలం ఆకలిని మాత్రమే నిర్మూలిస్తే సరిపోదు, బదులుగా, ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం ప్రజలందరికీ అందుబాటులో ఉంచడమూ అవసరమేనని పోషకాహారనిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళల ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు, వాటి ప్రాముఖ్యత తెలుసుకుందాం.. పాలకూర పాలకూరలో పోషకాలను తక్కువగా అంచనా వేయకండి. ఇది రోగనిరోధక శక్తి పెరుగుదలకు, ఎముకల పుష్టికి సహాయపడుతుంది. పాలకూరను మహిళల సూపర్‌ఫుడ్ అని కూడా అంటారు. ఎందుకంటే దీనిలో మాగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది మహిళల గర్భధారణ సంమయంలో అవసరమైనంతమేరకు శరీరానికి ఖనిజాలను అందిస్తుంది. చదవండి: పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినా నో ప్రాబ్లం.. వాటే ఐడియా గురూ..!! పప్పు దినుసులు పప్పు దినుసుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన మహిళలకు అవసరమైన ప్రొటీన్లు అందించడంలో వీటి పాత్ర కీలకం. ప్రతి రకం పప్పుల్లో దానిదైన ప్రత్యేక పోషక ప్రయోజనాలను అందిస్తుంది. ఓట్స్ రోజువారీ శక్తికి అవసరమైన ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ను అందించడంలో ఓట్స్ కీలకం. వీటిల్లో ఇతర ధాన్యాల కంటే ఎక్కువ ప్రోటీన్లు, కొవ్వులు కలిగి ఉంటాయి. అంతేకాకుండా వీటిల్లో ఆరోగ్యకరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా అధికమే. పాలు వర్కింగ్ ఉమెన్‌కు ఎముకల్లో పటుత్వం తగ్గి, ఎముకల నిర్మాణంలో మార్పులు సంభవించే ప్రమాధం ఉంది. ఇది ఎముకల వ్యాధి వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఐతే పాలల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. గ్లాస్ పాలు తాగితే రోజువారీ అవసరమైన కాల్షియంను తగుమోతాదులో అందిస్తుంది. ఇందులో ప్రోటీన్, భాస్వరం, పొటాషియం, డి, బి విటమిన్లు కూడా ఉన్నాయి. బ్రోకోలీ మహిళలకు మేలుచేసే ఆరోగ్యకరమైన ఆహారాల్లో బ్రోకోలీ అత్యంత కీలకమైనది. ఎందుకంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో ఎంతో సహాయపడుతుంది. క్యాన్సర్‌కు కారణమయ్యే ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తుంది. ముఖ్యంగా రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ నివారణలో దీని పాత్ర కీలకం. గుండె ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. దీనిలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఎముకల పటుత్వానికి దోహదపడుతుంది. బాదం జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే ప్రోబయోటిక్స్ ఉత్పత్తికి బాదం ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా పావు కప్పు బాదంలో గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. దీనిలో మెగ్నీషియం కూడా అధికంగానే ఉంటుంది. నిపుణులు సూచిస్తున్న ఈ ఆహారాలను తీసుకుంటే మహిళల్లో పోషకాహారలోపాన్ని అరికట్టవచ్చు. చదవండి: ఈ వాటర్ బాటిల్ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు.. -
హంగర్ ఇండెక్స్‌లో దిగజారిన ఇండియా: ముంచుకొస్తున్న ఆకలి భూతం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ఆకలి తీర్చడమే వరల్డ్ ఫుడ్ డే ప్రధాన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అంటూ ప్రతీ ఏడాది లాగానే ‘‘ఆరోగ్యకరమైన రేపటి కోసం ఇప్పుడు సురక్షితమైన ఆహారం" అనే థీమ్‌ను నిర్ణయించారు. ఆహారాన్ని ఆదా చేయడం, వ్యర్థాలను తగ్గించడం, వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల అభివృద్ధిని పెంచడం అనేది లక్ష్యం. తద్వారా భవిష్యత్తు తరాల కోసం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న పోషకాహారలోప సమస్యను నిర్మూలించాలనేది ప్రధానోద్దేశం. వరల్డ్ ఫుడ్ డే : చరిత్ర, ప్రాధాన్యత ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) 1945లో స్థాపితమైంది. దీనికి గుర్తుగా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పాటిస్తున్నారు. 1979 నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటారు. హంగేరియాకు చెందిన మాజీ వ్యవసాయ, ఆహార మంత్రి డాక్టర్ పాల్ రోమానీ సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఈ డేను జరుపుకుంటాయి. దాదాపు 821 మిలియన్ల ప్రజలు దీర్ఘకాలికంగా పోషకాహార లోపంతో ఉన్నారు. వీరిలో దాదాపు 99 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో నివసిస్తుండటం గమనార్హం. ప్రపంచంలో ఆకలితో ఉన్నవారిలో 60శాతం మంది మహిళలు. ప్రతి సంవత్సరం దాదాపు 20 మిలియన్ల మంది పిల్లలు తక్కువ బరువుతో పుట్టారు. ఇందులో కూడా 96.5శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్నారు. అది కూడా ప్రతి ఐదు జననాలలో ఒకటి సరైన వైద్య సదుపాయం లేనందు వల్ల చనిపోతున్నారు. ఫలితంగా పిల్లల్లో మరణాలలో దాదాపు 50శాతం మంది 5 సంవత్సరాల లోపే ఉంటున్నాయి. ఎయిడ్స్, మలేరియా, క్షయ వ్యాధి కారణగా సంభవిస్తున్న మరణాలకంటే ఆకలి కారణంగా ప్రపంచవ్యాప్తంగాఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతి రోజు, 10,000 మందికి పైగా పిల్లలతో సహా 25,000 మంది ఆకలి, సంబంధిత కారణాలతో మరణిస్తున్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభా 9.6 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఆహార ఉత్పత్తని పెంచడం అంటే తక్కువ ప్రాంతంలో ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేసే పద్ధతులు ముఖ్యంగా సహజ వనరులను ఉపయోగించాలినేది లక్ష్యం. మెరుగైన పంట, నిల్వ, ప్యాకింగ్, రవాణా, మౌలిక సదుపాయాలు, మార్కెట్ యంత్రాంగాలతో పాటు, సంస్థాగత చట్టపరమైన చర్యల తో అనేక కార్యక్రమాల ద్వారా తుది వినియోగానికి ముందు ఆహార నష్టాలను తగ్గించాలని నిర్ణయించింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మరోవైపు గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో ఇండియా మరింత దిగజారింది. ప్రపంచ ఆకలి సూచిక (జీహెచ్ఐ) 2021లో 116 దేశాలలో భారతదేశం 101వ స్థానానికి పడి పోయింది. తాజా నివేదిక ప్రకారం 94వ స్థానం 101కి దిగజారింది. తద్వారా పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ , నేపాల్ కంటే కూడా ఇండియా వెనుకబడి ఉంది. బ్రెజిల్, చిలీ, చైనా. క్యూబా కువైట్ సహా పద్దెనిమిది దేశాలు జీహెచ్ఐ స్కోరు తొలి అయిదు టాప్ ర్యాంక్‌లో నిలిచాయని ఆకలి, పోషకాహారలోపాలను లెక్కించే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెబ్సైట్ గురువారం తెలిపింది. అంతేకాదు ఇండియాలో ఆకలి స్థాయి ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి, సంబంధిత ఆంక్షల ప్రభావంతో ప్రజలు తీవ్రంగా నష్ట పోతున్నారనీ, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే పోషహార లోపంతో బాధపడుతున్న పిల్లల రేటు అత్యధికంగా ఉన్న దేశం ఇండియానే అని నివేదిక పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 ప్రకారం దేశంలో పోషకాహార ప్రమాణాలను కాపాడటం ప్రభుత్వాల విధి. -
మెరుగైన వంగడాల అభివృద్ధే లక్ష్యం కావాలి
సాక్షి, అమరావతి/యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): మెరుగైన వంగడాలను అభివృద్ధి చేయడంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. దేశంలో ఆహార కొరత తీర్చడానికి అదే పరిష్కారమన్నారు. తిరుపతిలో మంగళవారం నిర్వహించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 50వ స్నాతకోత్సవ వేడుకల్లో విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో ఆయన చాన్స్‌లర్ హోదాలో హాజరయ్యారు. గవర్నర్ మాట్లాడుతూ.. ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) తాజా గణాంకాల ప్రకారం దేశ జనాభాలో దాదాపు 14 శాతం మంది ఇంకా పోషకాహార లోపం, ఐదేళ్లలోపు పిల్లల్లో 20 శాతం మంది తక్కువ బరువు సమస్య, పునరుత్పత్తి వయసులో ఉన్న మహిళల్లో 51.4 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని వివరించారు. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు బయో–ఫోర్టిఫికేషన్‌పై పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమీకృత వ్యవసాయ విధానాలు, యాంత్రీకరణ విధానాల్లో పరిశోధనల ద్వారానే సాగు ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని సాధించగలమని గవర్నర్ అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, సాగునీరు సమర్థ వినియోగ సాంకేతికత, దిగుబడులు పెంపొందించడం, వ్యవసాయ–వ్యవసాయేతర రంగాల మధ్య సమన్వయాన్ని పెంచడం తదితర అంశాలపై శాస్త్రవేత్తలు ప్రధానంగా దృష్టి సారించాలని కోరారు. పంటల ఉత్పత్తి, రక్షణకు సంబంధించిన సాంకేతికతలను అభివృద్ధి చేసి రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. బోధన, పరిశోధనల్లో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. తక్కువ ధరలకు వ్యవసాయ ఉపకరణాలు అందుబాటులోకి తేవడం ద్వారానే రైతుల జీవన స్థితిగతులను మెరుగుపర్చగలమన్నారు. వ్యవసాయ విద్యార్థులు తాము ఎంచుకున్న ప్రత్యేక అంశాల్లో నిరంతర పరిశోధనలతో విజ్ఞానాన్ని పెంపొందించుకుని నవ కల్పనలను ఆవిష్కరించాలని గవర్నర్ హరిచందన్ ఆకాంక్షించారు. స్నాతకోత్సవంలో తిరుపతి నుంచి విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి, రాజ్‌భవన్ నుంచి గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్‌మీనా, విశ్వ విద్యాలయ ప్రతినిధులు డాక్టర్ వి.చెంగారెడ్డి, డాక్టర్ చెరుకూరి శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ గిరిధర్‌కృష్ణ పాల్గొన్నారు. -
Leaf Vegetable: పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారా?
సాక్షి, అమరావతి: దేశంలో నూటికి 80 శాతం మంది కౌమార దశలో ఉన్న పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వీరిలో ఎక్కువమంది పేదలే. ఇవి ప్రైవేటు సంస్థలో, వ్యక్తులో చెప్పిన మాటలు కాదు. సాక్షాత్తు ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉండే యూనిసెఫ్ భారతదేశానికి సంబంధించి ఇటీవల ఇచ్చిన నివేదిక. మారుతున్న రోజులకు ఇదో సవాలు. దీన్ని ఎదుర్కొనేందుకు అనేక పరిష్కార మార్గాలు మన చేతుల్లోనే ఉన్నా వాటిని చిన్నచూపు చూస్తున్న ఫలితమే ఈ దుర్గతి అని ఆహార నిపుణులు ఆవేదన చెందుతున్నారు. ఈనేపథ్యంలో పోషకాహార లేమిని తరిమి కొట్టేందుకు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్శిటీ నిపుణులు అనేక పరిష్కారాలను సూచిస్తున్నారు. వాటిల్లో అత్యంత ఆచరణాత్మకమైంది పెరటి తోటల పెంపకం. పెరటి తోటలకు పెరిగిన గిరాకీ పోషకాహార లోపం, కాలుష్యం, హిడెన్ హంగర్ (పౌష్టికాహర లేమి)కు ఏదీ అతీతం కాకపోవడంతో ఇటీవలి కాలంలో పెరటి తోటలకు బాగా గిరాకీ పెరిగింది. పోషకాహారలోప నివారణలో వీటి పాత్ర కీలకమైంది. ఆహార ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ పోషకాహార లోపంలోనూ అదేస్థాయిలో ఉంది. పెరుగుతున్న జనాభాను, పోషకాహార లోపాలను, కూరగాయల లభ్యతను, ధరలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన కూరగాయలను ఏడాది పొడవునా అందుబాటులో ఉంచేందుకు ఈ పోషకాహార పెరటి తోటలు ఉపయోగపడతాయి. అందుకే వీటిని ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. రసాయన ఎరువులు, సస్యరక్షణ, కలుపు నివారణ మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకోవడం అనివార్యమని శాస్త్రవేత్తలు సైతం సలహా ఇస్తున్నారు. ఒక్కో మనిషికి ఎన్నెన్ని గ్రాములు కావాలంటే.. సగటున ప్రతి మనిషికి రోజుకు కనీసం 85 గ్రాముల పండ్లు, 75 నుంచి 125 గ్రాముల ఆకుకూరలు, 85 గ్రాముల ఇతర కూరగాయలు, 85 గ్రాముల దుంప కూరలు కావాలి. ఇలా తీసుకున్నప్పుడే శరీరానికి అవసరమైన పోషకాలు సమకూరతాయి. ప్రస్తుత లెక్క ప్రకారం ఇంతకన్నా తక్కువ తీసుకుంటున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యంలో ఆకుకూరలకు రోజువారీ ఆహారంలో చోటు తక్కువైంది. ఫలితంగా విటమిన్ల లోపం ఏర్పడుతోంది. విటమిన్–ఎ లోపంతో రేచీకటి వస్తుంది. ఐరన్ లోపంతో రక్తహీనత వస్తుంది. దాదాపు సగంమంది మహిళలు, పిల్లలు, యుక్త వయస్కులు రక్తహీనతతో బాధపడుతున్నారు. విటమిన్–బి లోపంతో ఆకలి మందగించడం, నోటిచివర పగుళ్లు, నాలుకపై పూత వస్తాయి. ఈ లోపాలను నివారించాలంటే ఆకుకూరలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి. సమగ్ర జాతీయ పోషకాహార సర్వే లెక్క ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు సరైన పోషకాహారం అందడంలేదు. 2 నుంచి 4 ఏళ్ల వయసున్న పిల్లల్లో విటమిన్–ఎ లోపం తీవ్రంగా ఉంది. కూరగాయల వినియోగం తక్కువగా ఉంది. పెరటి తోటల్లోని ఆకుకూరలతో.. పోషకాహార పెరటి తోటలు పెంచడం వల్ల కుటుంబ ఆరోగ్యం బాగవుతుంది. దీనికి కావాల్సిందల్లా ఆసక్తే. చాలామందికి పెరళ్లు ఉంటాయి. లేనివారు కుండీల్లోను పెంచుకోవచ్చు. ఏడాది పొడవునా బెండ, వంగ, టమోటా, మిరప, పాలకూర, మెంతికూర, గోంగూర, తోటకూర, చుక్కకూర, బచ్చలి, సిర్రాకు, నిమ్మ, జామ, అరటి, బొప్పాయి, మామిడి, దానిమ్మ వంటి వాటిని పెంచుకోవచ్చు. అదనపు ఆదాయం పొందవచ్చు. ఇవి పోషకాహార లోపాన్ని నివారిస్తాయి. ఇళ్లల్లో మనకున్న స్థలాన్ని చిన్న మడులుగా విడగొట్టి తీగ జాతి కూరగాయలను కంచె మీదికి పాకించవచ్చు. దంప కూరలను గట్లపై పెంచవచ్చు. పండ్ల చెట్లను పెరట్లో ఏదైనా మూలగా వేసుకోవచ్చు. పెరట్లోనే ఒక పక్క కంపోస్టు గుంతను ఏర్పాటు చేసుకుని సేంద్రియ ఎరువును తయారు చేసుకుని దాన్నే ఉపయోగించుకోవచ్చు. బయటి నుంచి నారు తెస్తే 3, 4 వారాల మధ్య నాటుకోవాలి. నాటే సమయంలో 2, 3 గంపల పశువుల ఎరువులు వేయాలి. ఉపయోగాలు ఏమిటంటే.. కూరగాయల వినియోగం పెరిగితే పోషకాహార లోపం, సూక్ష్మపోషకాల లోపాలను నివారించుకోవచ్చు. కుటుంబ ఆహార అవసరాలను తీర్చుకోవచ్చు. తాజా కూరగాయలతో పోషకాలు మెండుగా వస్తాయి. వ్యాధుల నుంచి రక్షణ ఉంటుంది. ఖనిజాలు, పోషకాలు, విటమిన్లు సరేసరి. డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రాలు ఈ పోషకాహార తోటలు పెంచుకోవడానికి సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. ఇళ్లల్లో పెంచుకోవడానికి ఆకుకూరల విత్తనాలు కూడా సరఫరా చేస్తున్నట్లు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం గృహ విజ్ఞానశాస్త్ర విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్ బి.విజయలక్ష్మి, డాక్టర్ కె.మల్లికార్జునరావు, బి.గోవిందరాజులు తెలిపారు.