ఆదర్శ వివాహాలతోనే సామాజిక మార్పు | Ideal weddings for social change | Sakshi
Sakshi News home page

ఆదర్శ వివాహాలతోనే సామాజిక మార్పు

Published Sat, May 7 2016 2:26 AM | Last Updated on Mon, Aug 13 2018 4:30 PM

ఆదర్శ వివాహాలతోనే సామాజిక మార్పు - Sakshi

ఆదర్శ వివాహాలతోనే సామాజిక మార్పు

తిరుపతి కల్చరల్: కులాంతర, మతాంతర వివాహాల ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పి. వెంకటరత్నం తెలిపారు. శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయంలో మతాంతర వివాహం జరిపించారు. కర్నూలు జిల్లాకు చెందిన పి.రహంతుల్లా కుమార్తె పి.హసీనా(21), తిరుపతి ఎస్టీవీ నగర్‌కు చెందిన టి.వెంకటేష్ కుమారుడు టీవీ.కిశోర్(24)లు ప్రేమించుకున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు వీరి వివాహానికి అంగీకరించకపోవడంతో సీపీఐను ఆశ్రయించారు.

ఇద్దరూ మేజర్లు కావడంతో ఆదర్శ వివాహం చేయించారు. సీపీఐ సీనియర్ నేతలు వెంకటరత్నం, తులసేంద్ర మాట్లాడుతూ దేశంలో కులాలు, మతాలుపై విచ్చలవిడి దాడులు జరుగుతున్నా ఇలాంటి వివాహాలు జరగడం సంతోషకరమన్నారు. ప్రేమ వివాహాలు చేసుకోవడం గొప్పకాదని, ఆదర్శంగా జీవించి సమాజానికి మార్గదర్శకంగా ఉండాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement