సివి మోహన్‌రెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంట్‌కు పంపితే సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తామని సీమాంధ్ర అడ్వకేట్ జేఏసీ చైర్మన్ సివి మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ఈనెల 29న ఇందిరాపార్క్ వద్ద సీమాంధ్ర అడ్వకేట్ జేఏసీ ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర విభజన బిల్లు అంతా తప్పులు తడకగా ఉందని, దాన్ని రాష్ట్రపతికి తిప్పి పంపాలని మంత్రి శైలజానాధ్ ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్కు నోటీసు ఇప్పించారు. ఒకవేళ బిల్లు తిప్పిపంపినా, రాష్ట్రపతి దానిని పార్లమెంటుకు పంపించే అవకాశం ఉంది. అలా పంపితే తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని సివి మోహన రెడ్డి చెబుతున్నారు.